...
...
Next Story

AK47 Teaser: ఫ్యామిలీ ఇమేజ్ ఉందని తెలుసు-ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్-అదిరేలా వెంకీ, త్రివిక్రమ్ కాంబో-నారా రోహిత్ ఎక్కడ?

AK47 Teaser: ఎట్టకేలకు విక్టరీ వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అప్డేట్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ అభిమానులకు జోష్ అందిస్తూ ఏకే 47 టీజర్ ను ఇవాళ మేకర్స్ రిలీజ్ చేశారు.

Published on: Sep 12, 2026, 16:10:30 IST
Advertisement

AK47 Teaser: విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరే అప్డేట్ వచ్చేసింది. మూవీపై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా నుంచి టీజర్ రిలీజైంది. ఇవాళ (సెప్టెంబర్ 12) ఈ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ స్టైల్ మేకింగ్ తో, వెంకీ మామ యాక్టింగ్ తో టీజర్ అదిరిపోయింది.

ఏకే47 టీజర్

ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్ (x/haarikahassine)
ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్ (x/haarikahassine)

వరుస సినిమాలతో జోరుమీదున్న వెంకటేష్ అప్ కమింగ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ ఏకే47’. డైరెక్టర్ గా త్రివిక్రమ్ ఫస్ట్ టైమ్ వెంకటేష్ తో చేస్తున్న మూవీ కావడంతో అనౌన్స్ మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్ పై హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే ఇవాళ రిలీజైన ఏకే 47 టీజర్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ తో నిండింది.

వెంకీ టైమింగ్

సీనియర్ హీరో వెంకటేష్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం నెగెటివిటీ లేని హీరో ఆయనే. ఇప్పుడు ఆదర్శ కుటుంబం సినిమాలోనూ తన టైమింగ్ తో మరోసారి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వెంకీ మామ రెడీ అయిపోయాడు. టీజర్ లో ఆయన టైమింగ్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.

భార్య చేసే అప్పులు కట్టలేక, పిల్లల అల్లరి భరించలేక నలిగిపోయే ఓ మిడిల్ క్లాస్ భర్తగా వెంకీ నటన కచ్చితంగా నవ్వించేలా ఉంది. ఒక్కసారిగా రిచ్ గా మారిన తర్వాత వెంకీ యాక్షన్ సీక్వెన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

మాటల మాంత్రికుడు

‘‘డబ్బు, సబ్బుకు ఓ పోలిక ఉంది. మొదటిది చూస్తుండగానే కరిగిపోతుంది. రెండోది ఆలోచించేలోపే అరిగిపోద్ది’’ అనే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ తోనే టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇంట్లో వంట చేసి మరీ ఆఫీస్ కు వెళ్లే భర్తగా వెంకటేష్ కనిపించారు.

ఒక్కసారిగా రిచ్

అప్పటివరకూ అప్పులతో మిడిల్ క్లాస్ జీవితంలో కొట్టుమిట్టాడుతున్న హీరో ఫ్యామిలీ ఒక్కసారిగా రిచ్ గా మారిపోతుంది. ‘‘నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని నాకు తెలుసు. ఐ నో. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ కు వెనుకాడను’’ అంటూ ఆ తర్వాత హీరో ఒక్కసారిగా యాక్షన్ మోడ్ లోకి దిగిపోయాడు. ఆ తర్వాత వచ్చే సీన్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

రిలీజ్ డేట్

ఆదర్శ కుటుంబం మూవీ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఇందులో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా నారా రోహిత్, నివేత పేతురాజ్, యువీనా తదితరులు కూడా ఉన్నారు. అయితే ఈ టీజర్ లో పోలీస్ ఆఫీసర్ అయిన నారా రోహిత్ ముఖం మాత్రం చూపించకపోవడం గమనార్హం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks