...
...
Next Story

Aadarsha Kutumbam Review: ఆదర్శ కుటుంబం రివ్యూ.. రూ.100 కోట్ల లాటరీ ఫన్ రైడ్.. వెంకీ-త్రివిక్రమ్ మూవీ ఎలా ఉందంటే?

Aadarsha Kutumbam Review: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో థియేటర్లలోకి వచ్చిన డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం'. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రూ.100 కోట్ల లాటరీ తగలడం అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేయండి.

Published on: Oct 30, 2026, 12:51:41 IST
Advertisement

Aadarsha Kutumbam Review:

ఆదర్శ కుటుంబం రివ్యూ.. రూ.100 కోట్ల లాటరీ ఫన్ రైడ్.. వెంకీ-త్రివిక్రమ్ మూవీ ఎలా ఉందంటే? (x/haarikahassine)
ఆదర్శ కుటుంబం రివ్యూ.. రూ.100 కోట్ల లాటరీ ఫన్ రైడ్.. వెంకీ-త్రివిక్రమ్ మూవీ ఎలా ఉందంటే? (x/haarikahassine)

సినిమా పేరు : ఆదర్శ కుటుంబం

నటీనటులు : వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నివేతా పేతురాజ్, సత్య, నారా రోహిత్ తదితరులు

డైరెక్టర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

ప్రొడ్యూసర్ : ఎస్ రాధాకృష్ణ‌

రిలీజ్ డేట్ : అక్టోబర్ 30, 2026

వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఆదర్శ కుటుంబం సినిమా ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో రిలీజైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ వెంకటేష్ హీరోగా చేసిన సినిమా ఇది. మరి ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అలరించిందా? త్రివిక్రమ్ మరోసారి మ్యాజిక్ చేశారా? అన్నది ఈ ఆదర్శ కుటుంబం రివ్యూలో చూద్దాం.

స్టోరీ ఏంటంటే?

చిట్టిబాబు (వెంకటేష్) ఓ పక్కా మిడిల్ క్లాస్ తండ్రి. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి), ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంటాడు. అప్పులు చేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. ఆర్థిక కష్టాలతో సతమతమయ్యే ఆ కుటుంబానికి ఏకంగా రూ.100 కోట్ల లాటరీ తగులుతుంది. కష్టాలన్నీ తీరిపోయాయని సంబరపడుతూ రూ.20 కోట్లు పెట్టి ఓ లగ్జరీ విల్లాను (హౌస్ నెం 47) కొంటారు.

కానీ, ఆ డబ్బే వాళ్ల పాలిట శాపంగా మారుతుంది. దోపిడీలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఓ బీహార్ ముఠా కన్ను ఈ ఇంటిపై పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? తన కుటుంబాన్ని చిట్టిబాబు ఎలా రక్షించుకున్నాడు అన్నదే ఈ 'ఆదర్శ కుటుంబం' అసలు కథ.

విశ్లేషణ

అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్పీడ్, ఎంటర్టైన్మెంట్ సెకండాఫ్ కు వచ్చేసరికి పడిపోయింది. త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే బలమైన భావోద్వేగాలు ఇందులో మిస్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకుండా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. దీనికి తోడు పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు, పైగా 'నారాయణమ్మ' సాంగ్ అయితే ఫ్లోకు అడ్డంకిగా మారుతుంది.

ఎవరెలా చేశారంటే?

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది విక్టరీ వెంకటేషే. ఈ క్యారెక్టర్ ఆయనకు కొట్టిన పిండి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఆయన చేసే కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ ల్లో చూపించిన ఎనర్జీ చూస్తే ఫ్యాన్స్ కు పండుగే. భార్యగా చేసిన శ్రీనిధి శెట్టి సర్ ప్రైజ్ చేసింది. ఆమె కామెడీ టైమింగ్ అద్భుతంగా వర్కౌట్ అయింది.

కమెడియన్ సత్య తనదైన పంచులతో నవ్వించాడు. అయితే, టాలెంటెడ్ నటి నివేదా పేతురాజ్ ను చాలా చిన్న పాత్రకు పరిమితం చేయడం బాగా నిరాశపరుస్తుంది. నారా రోహిత్, విలన్ గా చేసిన ఉదయ్ వీర్ సంధు పర్వాలేదనిపిస్తారు కానీ, విలనిజం ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది.

టెక్నికల్ గా

టెక్నికల్ గా చూసుకుంటే రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి మార్కులే పడతాయి. ఆయన మార్క్ కొన్ని డైలాగ్ లు థియేటర్లో అద్భుతంగా పేలాయి. కానీ డైరెక్టర్ గా సెకండాఫ్ పై ఆయన ఇంకా ఫోకస్ పెట్టి ఉంటే బాగుండనిపిస్తుంది. ఇక కెవిన్ కుమార్ కంపోజ్ చేసిన ఇంటర్వెల్ ఫైట్ కు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ, చినబాబు నిర్మాణ విలువలు సినిమాను చాలా గ్రాండ్ గా చూపించాయి.

ఫైనల్ గా

సెకండాఫ్ లో కొన్ని లోపాలు, ఎమోషనల్ డెప్త్ లేకపోవడం మైనస్ అయినప్పటికీ.. వెంకటేష్ కామెడీ, సాలిడ్ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు.

రేటింగ్ : 3/5

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks