Aamir Khan Wedding: బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ (Aamir Khan) వ్యక్తిగత జీవితం, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్కే. విడాకులు తీసుకున్న తర్వాత కూడా తన మాజీ భార్యలతో ఎంతో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించడం అమీర్ ఖాన్‌కు మాత్రమే సాధ్యమని బాలీవుడ్ అంటుంటుంది. తాజాగా దీనిని నిజం చేస్తూ ఒక అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
మాజీ భార్యలతో కలిసి

అమీర్ ఖాన్ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చే జూలై 5న గౌరీ స్ప్రాట్ తో అమీర్ ఖాన్ వివాహం జరగనున్న నేపథ్యంలో, పెళ్లికి ముందే ఆయన తన కాబోయే భార్య, ఇద్దరు మాజీ భార్యలతో కలిసి ఒకే కారులో ప్రయాణించడం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
ఒకే కారులో అమీర్ ఖాన్ ఫ్యామిలీ
వైరల్ అవుతున్న ఈ వీడియోలో అమీర్ ఖాన్ కారు ముందు సీట్లో కూర్చుని కనిపించగా, వెనుక సీట్లో ఆయన కాబోయే భార్య గౌరీ స్ప్రాట్, అమీర్-కిరణ్ రావుల కుమారుడు ఆజాద్ రావు ఖాన్ కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అమీర్ ఖాన్ రెండో మాజీ భార్య కిరణ్ రావు, ఆమె వెనుకాలే మొదటి మాజీ భార్య రీనా దత్తా కూడా వచ్చి అదే కారులో కూర్చున్నారు.
{{/usCountry}}వైరల్ అవుతున్న ఈ వీడియోలో అమీర్ ఖాన్ కారు ముందు సీట్లో కూర్చుని కనిపించగా, వెనుక సీట్లో ఆయన కాబోయే భార్య గౌరీ స్ప్రాట్, అమీర్-కిరణ్ రావుల కుమారుడు ఆజాద్ రావు ఖాన్ కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అమీర్ ఖాన్ రెండో మాజీ భార్య కిరణ్ రావు, ఆమె వెనుకాలే మొదటి మాజీ భార్య రీనా దత్తా కూడా వచ్చి అదే కారులో కూర్చున్నారు.
{{/usCountry}}వీరంతా కలిసి కారులో ముందుకు సాగుతుండగా, ఒకరితో ఒకరు ఎంతో సరదాగా ముచ్చటించుకుంటూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఈ బాండింగ్ ఎలా సాధ్యం?
ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు ఆశ్చర్యపోతూ "డియర్ అమీర్ ఖాన్.. ఇదెలా సాధ్యం?" అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొంతమంది ఏమో విమర్శలు చేస్తున్నారు. డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమేనంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇంకో పెళ్లి చేసుకుంటే కారు సరిపోతుందో లేదో అని తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇదే సీక్రెట్
సాధారణంగా విడాకులు తీసుకున్న దంపతులు ముఖం చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ అమీర్ ఖాన్ తన 'అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్' బాధ్యతలను, సినిమాల ఎంపికను ఇప్పటికీ కిరణ్ రావు, రీనా దత్తాలతో పంచుకుంటారు. ఇటీవల ఆస్కార్ నామినేటెడ్ చిత్రం 'లగాన్' విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలోనూ ఈ ముగ్గురూ కలిసి ఈవెంట్‌లో సందడి చేశారు.
అమీర్ ఖాన్ తన పిల్లల (ఐరా ఖాన్, జునైద్ ఖాన్, ఆజాద్) భవిష్యత్తు కోసం మాజీ భార్యలను ఎప్పుడూ దూరం పెట్టలేదు. ఇప్పుడు రాబోయే కొత్త భాగస్వామి గౌరీ స్ప్రాట్ ను కూడా ఈ ఫ్యామిలీ ఈక్వేషన్‌లో భాగం చేయడమే ఈ జర్నీ వెనుక ఉన్న అసలు సీక్రెట్.
గెస్ట్ లిస్ట్‌లో ఖాన్స్!
తన పెళ్లి వార్తలపై అమీర్ ఖాన్ ఇప్పటికే అధికారికంగా స్పష్టతనిచ్చారు. "మా పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజమే. జూలై 5న మా వివాహం జరగనుంది. గౌరీ, నేను ఒకరినొకరు ఎంతో ఇష్టపడుతున్నాం. నా మనసులో ఇప్పటికే ఆమెను నా భార్యగా భావించా" అని పంచుకున్నారు.
అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుకను ఎంతో ప్రైవేట్‌గా నిర్వహించడానికి ఈ జంట ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకకు బాలీవుడ్ టాప్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు కూడా హాజరవుతారని బి-టౌన్ వర్గాల సమాచారం.