...
...
Next Story

Aruguru Pathivrathalu Re Release: వెయిటింగ్ ఓవర్..ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ డేట్ ఇదే..వేయికళ్లతో ఎదురు చూస్తున్న మూవీ!

Aruguru Pathivrathalu Re Release: హాస్య బ్రహ్మ ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన బోల్డ్ కామెడీ మూవీ 'ఆరుగురు పతివ్రతలు'. ఈ కల్ట్ క్లాసిక్ సినిమా చాలా కాలం తర్వాత థియేటర్లలో రీరిలీజ్ కాబోతుంది. వేయికళ్లతో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నామంటూ నెటిజన్లు పెడుతున్న కామెంట్లు వైరల్ గా మారాయి.

Published on: Oct 2, 2026, 17:31:02 IST
Advertisement

Aruguru Pathivrathalu Re Release: దర్శకరత్న ఇ.వి.వి. సత్యనారాయణ తెరకెక్కించిన అత్యంత డేరింగ్ సినిమాల్లో 'ఆరుగురు పతివ్రతలు' ఒకటి. ఈ సినిమా 2004 ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైంది. మళ్లీ 22 ఏళ్ల తర్వాత 4కె వర్షన్ లో సరికొత్తగా రీ రిలీజ్ కు రెడీ అయింది. ఆరుగురు పతివ్రతలు మూవీ రీ రిలీజ్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఆరుగురు పతివ్రతలు స్టోరీ

వెయిటింగ్ ఓవర్..ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ డేట్ ఇదే..వేయికళ్లతో ఎదురు చూస్తున్న మూవీ! (x)
వెయిటింగ్ ఓవర్..ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ డేట్ ఇదే..వేయికళ్లతో ఎదురు చూస్తున్న మూవీ! (x)

ఆరుగురు పతివ్రతలు మూవీ అప్పుడు థియేటర్లలో సెన్సేషన్ గా నిలిచింది. ఈ మూవీ స్టోరీ, కాన్సెప్ట్ బోల్డ్ అండ్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒక వివాహ వేడుక కోసం ఆరుగురు బాల్య స్నేహితులు ఒకచోట కలుస్తారు. ఈ అమ్మాయిలు వారి వైవాహిక జీవితాలు, అనుబంధాలు, అక్రమ సంబంధాలు, కుటుంబ బంధాల నగ్న సత్యాలను ఓపెన్ గా చెప్పుకుంటారు.

ఒకరేమో తన భర్త సంసార సుఖాన్ని ఇవ్వకపోవడంతో వేరేవాడితో పడక పంచుకోవడం గురించి, మరొకరు మతిలేని మొగుడ్ని చేసుకుని పడుతున్న బాధ.. ఇలా ఎవరి ప్రాబ్లెమ్స్ వాళ్లు చెప్పుకుంటారు.

కల్ట్ క్లాసిక్

ఆరుగురు పతివ్రతలు చిత్రం విడుదలైన తొలిరోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. అయితే, తర్వాతి కాలంలో బుల్లితెరపై, డిజిటల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొంది ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కల్ట్ క్లాసిక్ అనే గుర్తింపును దక్కించుకుంది.

ఆరుగురు పతివ్రతలు రీరిలీజ్ డేట్

ఈ బోల్డ్ కామెడీ డ్రామా ఆరుగురు పతివ్రతలు సినిమాకు నేటి తరం ప్రేక్షకుల్లోనూ క్రేజ్ ఉంది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'పోచమ్మ ఫిల్మ్స్' (Pochamma Films) సంస్థ ఈ చిత్రాన్ని 4K డిజిటల్ వర్షన్‌లో అక్టోబర్ 29న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తామని ప్రకటించింది.

నెటిజన్ల రియాక్షన్

‘‘అందరూ వేయికళ్లతో ఎదురు చూస్తున్న సినిమా’’, ‘‘సైలెంట్ గా అందరూ టికెట్లు బుక్ చేసుకొని ఓ షో వేస్తారు’’, ‘‘థియేటర్లలో మాములు రచ్చ ఉండదు’’, ‘‘ప్రతి సీన్, ప్రతి షాట్ వర్త్. అప్పుడు థియేటర్లలో మిస్ అయ్యా. ఇప్పుడు మిస్ అయ్యేదే లేదు’’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks