ఓటీటీలోకి ఉత్కంఠ రేపుతూ, అదిరిపోయే థ్రిల్ పంచే తమిళ సినిమా దూసుకొస్తోంది. కొత్త పాయింట్ తో తెరకెక్కిన ‘ఆర్యన్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కన్ఫామ్ అయింది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఈ నెలలోనే డిజిటల్ డెబ్యూ చేయనుంది. మరి ఆర్యన్ సినిమా ఏ ఓటీటీలోకి? ఎప్పుడు? వస్తుంది, మూవీ స్టోరీ ఏంటీ? అన్నది ఇక్కడ చూసేయండి.
ఆర్యన్ ఓటీటీ రిలీజ్ డేట్

తమిళ థ్రిల్లర్లకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇదే జోనర్లో తెరకెక్కిన ఆర్యన్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఆర్యన్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (నవంబర్ 22) అనౌన్స్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆర్యన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ శనివారం అనౌన్స్ చేసింది.
నెల రోజుల్లోపే
ఆర్యన్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే డిజిటల్ డెబ్యూ చేయనుంది. విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి, సెల్వ రాఘవన్ తదితరులు నటించిన ఆర్యన్ సినిమా అక్టోబర్ 31, 2025న థియేటర్లలో రిలీజైంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఐఎండీబీలో దీనికి 7 రేటింగ్ ఉంది. ఇప్పుడు నెల రోజుల్లోనే అంటే నవంబర్ 28న ఓటీటీలో అడుగుపెట్టనుంది ఈ థ్రిల్లర్.
ఆర్యన్ కథ
ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఆర్యన్ మూవీ ఓ కొత్త పాయింట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇది మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్. ఆత్రేయ (సెల్వ రాఘవన్) ఓ ఫెయిల్యూర్ రైటర్. నయన (శ్రద్ధా శ్రీనాథ్) పాపులర్ టీవీ ఛానెల్ లో యాంకర్. ఆమె నిర్వహించే ఓ టాక్ షోకు ప్రేక్షకుడిగా ఆత్రేయ వెళ్తాడు. కానీ అక్కడికి గెస్ట్ గా వచ్చిన ఒకరిని గన్ తో కాల్చి చంపుతాడు ఆత్రేయ.
{{/usCountry}}ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఆర్యన్ మూవీ ఓ కొత్త పాయింట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇది మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్. ఆత్రేయ (సెల్వ రాఘవన్) ఓ ఫెయిల్యూర్ రైటర్. నయన (శ్రద్ధా శ్రీనాథ్) పాపులర్ టీవీ ఛానెల్ లో యాంకర్. ఆమె నిర్వహించే ఓ టాక్ షోకు ప్రేక్షకుడిగా ఆత్రేయ వెళ్తాడు. కానీ అక్కడికి గెస్ట్ గా వచ్చిన ఒకరిని గన్ తో కాల్చి చంపుతాడు ఆత్రేయ.
{{/usCountry}}లైవ్ షోలోనే తాను రాసిన ఒక థ్రిల్లర్ కథ గురించి చెప్తాడు. ఆ స్టోరీ ప్రకారం తాను ఆత్మహత్య చేసుకున్న తర్వాత చనిపోయిన ఓ వ్యక్తి వరుసగా అయిదుగురిని మర్డర్ చేస్తాడని ఆత్రేయ చెప్తాడు. ఆ వెంటనే తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆత్రేయ చెప్పినట్లుగా హత్యలు జరుగుతాయి. ఈ కేసును డీసీపీ నంది (విష్ణు విశాల్) టేకప్ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? హత్యలు చేసింది ఎవరు? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.