...
...
Next Story

Aaya Sher Lyrics: పక్కా తెలంగాణ భాషతో ఊర మాస్‌గా పదాలు- నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్ లిరిక్స్ ఇవే!

Nani The Paradise Aaya Sher Song Lyrics In Telugu: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ది ప్యారడైజ్ నుంచి ఫిబ్రవరి 24న ఆయా షేర్ సాంగ్ రిలీజ్ అయి దూసుకుపోతోంది. ఈ క్రమంలో పక్కా తెలంగాణ పదాలతో అల్లిన ఆయా షేర్ సాంగ్ లిరిక్స్ ఎలా ఉన్నాయో లుక్కేద్దాం.

Published on: Feb 26, 2026, 14:57:26 IST
Advertisement

ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న సాంగ్ ఆయా షేర్. నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ది ప్యారడైజ్ సినిమా నుంచి నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న ఆయా షేర్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

నాని హుక్ స్టెప్‌

పక్కా తెలంగాణ భాషతో ఊర మాస్‌గా పదాలు- నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్ లిరిక్స్ ఇవే!
పక్కా తెలంగాణ భాషతో ఊర మాస్‌గా పదాలు- నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్ లిరిక్స్ ఇవే!

యూట్యూబ్‌లో రిలీజ్ అయిన రోజు నుంచే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఆయా షేర్ సాంగ్. ముఖ్యంగా పాటలో నాని వేసిన హుక్ స్టెప్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్, డ్యాన్సర్స్ ఈ హుక్ స్టెప్‌ను రీ క్రియేట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ఇదే పాటపై మీమ్స్ కూడా పడుతున్నాయి.

ఆయా షేర్ సాంగ్ లిరిక్స్‌

మరి ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆయా షేర్ సాంగ్‌ను పక్కా తెలంగాణ భాషలోని ఊర మాస్‌ పదాలతో అల్లారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఆయా షేర్ సాంగ్ లిరిక్స్‌పై ఓ లుక్కేద్దాం.

పల్లవి

హే నీ అయ్యా జాగీరా చల్ మావోడొచ్చిండ్రా

ఇగ జడ్తియ్యాలే జుంబలికే ఆయా షేర్..

హే యే దర్ కా సుల్తానే... మా ఘర్ కా సైతానే

చల్ షికార్ జెయ్యా.... జుంబలికే ఆయా షేర్

పచ్చబొట్టు గాయమిది... ఆయా షేర్

గుంజుకునే న్యాయమిది... ఆయా షేర్

భూడిదల గడ్డ ఇది... ఆయా షేర్

మాతో రాయబడ్డ కథే ఇది... ఆయా షేర్

కొడతరో తొడలురో తీస్తరో తోలురో

సవారికి దొరుకు బిడ్డా... శవాలే లేస్తయ్ బిడ్డా

పేగుల్ తీసి మెడలో యేసి...

ఆడుతం బిడ్డా ఆడుతం బిడ్డా...

చరణం

ఆడ ఈడ ఏడ చూడు బిడ్డా...

వణుకే పుట్టాలింక పడితెనే నా నీడ...

బొంద పెడుతా మాలిక్‌నైనా గూడా...

వాడి సావు రాసుకొచ్చిన దేవునికాడా...

చల్ ఉడుకుతుంది సారా బట్టిలో మా కంట తడే

జుంబలికే ఆయా ఆయా షేర్..

ఇక రాలుతది బొట్టు బొట్టులో నీ పంచె తడే

జుంబలికే ఆయా ఆయా షేర్..

జడలురో జడలురో హడలురో ధడలురో

కొడతరో తొడలురో తీస్తరో తోలురో

సవారికి దొరుకు బిడ్డా... శవాలే లేస్తయ్ బిడ్డా

పేగుల్ తీసి మెడలో యేసి...

ఆడుతం బిడ్డా ఆడుతం బిడ్డా...

హే బరి బత్తాలున్నొన్రా... బర్ బాధే అయినొన్రా

నన్ను పీకుతావా... జుంబలికే ఆయా షేర్

హే మొల్దారం లేనోన్రా... నీకన్నా మొండోన్రా

ఇక పీకుతావా... జుంబలికే ఆయా షేర్...

పొట్టు పొట్టు ఆకలుంది... ఆయా షేర్

మెట్టు మెట్టు ఎక్కుతరా... ఆయా షేర్

పేరు పత్తా లేనొన్నిర్రా... ఆయా షేర్

చూస్కో ప్యారడైజ్‌కే అడ్రస్ అయితా... ఆయా షేర్..

సాంగ్ రైటర్, సింగర్స్

ఇలా అచ్చ తెలంగాణ మాండలికంలో సాగిన ఆయా షేర్ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. సింగర్స్ అద్దుల జంగిరెడ్డి, అర్జున్ చండీ అంత పవర్‌ఫుల్‌గా ఆలపించారు. ఇక పాటను నెక్ట్స్ లెవెల్‌లో తీసుకెళ్లిన సంగీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe