...
...
Next Story

Abhaya Poster: సమాజానికి బలమైన సందేశం.. పవర్‌ఫుల్ టైటిల్‌తో లేడీ ఓరియెంటెడ్ సినిమా అభయ.. పోస్టర్ రిలీజ్!

Abhaya Title Poster Released: మహిళా సాధికారత నేపథ్యంతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘అభయ’ చిత్ర టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యోగితా భోసాలే ప్రధాన పాత్రలో నటించిన అభయ సినిమాను నాలుగు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అభయ సినిమా విశేషాలు మీకోసం.

Published on: Jun 14, 2026, 13:21:19 IST
Advertisement

Abhaya Movie Title Poster Released: ప్రస్తుత కాలంలో వెండితెరపై లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు, మహిళల పోరాట పటిమను చూపే కథలకు ఆదరణ బాగా పెరిగింది. ఇదే కోవలో సమాజంలో మహిళల శక్తిని, వారి పట్టుదలను చాటిచెప్పేందుకు ‘అభయ’ అనే సరికొత్త చిత్రం సిద్ధమవుతోంది.

అభయ టైటిల్ పోస్టర్ రిలీజ్

సమాజానికి బలమైన సందేశం.. పవర్‌ఫుల్ టైటిల్‌తో లేడీ ఓరియెంటెడ్ సినిమా అభయ.. పోస్టర్ రిలీజ్!
సమాజానికి బలమైన సందేశం.. పవర్‌ఫుల్ టైటిల్‌తో లేడీ ఓరియెంటెడ్ సినిమా అభయ.. పోస్టర్ రిలీజ్!

యోగిత భోసాలె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అభయ టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. పోస్టర్‌ను గమనిస్తే ఇదొక పవర్‌ఫుల్ కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోందని స్పష్టమవుతోంది.

విలక్షణమైన కథాంశంతో

గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత డాక్టర్ విమల్ రాజ్ మాథుర్, ఆర్‌.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రూపేష్ డి. గోహిల్ సంయుక్తంగా అభయ సినిమాను నిర్మిస్తున్నారు. విలక్షణమైన కథాంశంతో దర్శకుడు యూసఫ్ ముజామ్మిల్ సుర్తి అభయ సినిమాకు రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో 4 భాషల్లో..

అభయ సినిమాను కేవలం ఒక్క పరిశ్రమకే పరిమితం చేయకుండా విస్తృతమైన మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్నారు. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా లెవెల్‌లో అభయ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అభయ నటీనటులు

అభయ సినిమాలో మోహన్ జోషి, గణేష్ యాదవ్, కమలేష్ సావంత్, అనికేత్ కేల్కర్, రోహిత్ కోకటి, ఉమేష్ బోల్కె, డాక్టర్ సంజీవ్ కుమార్ పాటిల్, హర్ష్ నికమ్ వంటి పలువురు సీనియర్, ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మహిళల స్ఫూర్తిని కొనియాడే చిత్రం

అలాగే, "అభయ సినిమా 4 భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ రోజు పోస్ట‌ర్‌ను విడుదల చేయ‌టం ఆనందంగా ఉంది. సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం" అని నిర్మాత విమల్ రాజ్ మాథుర్ పేర్కొన్నారు.

ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన కథనం

మరో ప్రొడ్యూసర్ రూపేష్ డి. గోహిల్ మాట్లాడుతూ.. "ఈ ప్రాజెక్ట్ టైటిల్ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఒక అర్థవంతమైన సందేశంతో పాటు, ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన కథనం, అద్భుతమైన నటీనటుల ప్రదర్శన ఈ సినిమాలో చూడవచ్చు. ఈ ప్రేరణాత్మకమైన సినిమాటిక్ అనుభవాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం" అని చెప్పుకొచ్చారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe