...
...
Next Story

IPL Team: ప్రో కబడ్డీ, ఐఎస్ఎల్ ఓనర్‌గా సక్సెస్- కానీ, ఐపీఎల్ టీమ్‌ను కొనలేకపోయిన అభిషేక్ బచ్చన్- అసలు కారణం చెప్పిన హీరో

Abhishek Bachchan On Not Buying IPL Team: ప్రో కబడ్డీ, ఐఎస్ఎల్ వంటి క్రీడల్లో జట్లను కొనుగోలు చేసి సక్సెస్‌ఫుల్ ఓనర్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న లీగ్ అయిన ఐపీఎల్‌కు ఎందుకు దూరంగా ఉన్నారో తొలిసారి వివరించారు. అభిషేక్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 14, 2026, 12:44:20 IST
Advertisement

Abhishek Bachchan On Not Buying IPL Team: క్రీడలంటే బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌కు ప్రాణం. కేవలం గ్యాలరీలో కూర్చుని కేకలు వేయడం కాకుండా, క్షేత్రస్థాయిలో జట్టు విజయాల కోసం శ్రమించే యజమానిగా ఆయనకు గుర్తింపు ఉంది. జైపూర్ పింక్ పాంథర్స్ (కబడ్డీ), చెన్నైయిన్ ఎఫ్‌సీ (ఫుట్‌బాల్) జట్లతో ఆయన సాధించిన విజయాలే దీనికి నిదర్శనం.

ప్రో కబడ్డీ, ఐఎస్ఎల్ ఓనర్‌గా సక్సెస్- కానీ, ఐపీఎల్ టీమ్‌ను కొనలేకపోయిన అభిషేక్ బచ్చన్- అసలు కారణం చెప్పిన హీరో
ప్రో కబడ్డీ, ఐఎస్ఎల్ ఓనర్‌గా సక్సెస్- కానీ, ఐపీఎల్ టీమ్‌ను కొనలేకపోయిన అభిషేక్ బచ్చన్- అసలు కారణం చెప్పిన హీరో

అయితే, ఇంతటి క్రీడాభిమాని ఐపీఎల్ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదనే సందేహం అందరిలోనూ ఉండేది. దీనిపై తాజాగా ఫోర్బ్స్ ఇంటర్వ్యూలో తాను ఐపీఎల్ టీమ్‌ను ఎందుకు కొనుగోలు చేయలేదో అభిషేక్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బడ్జెట్ పరిమితులు.. అప్పట్లో సాధ్యపడలేదు

ఐపీఎల్ ప్రారంభమైన సమయంలో తన ఆర్థిక పరిస్థితి జట్టును కొనుగోలు చేసే స్థాయిలో లేదని అభిషేక్ బచ్చన్ నిజాయితీగా ఒప్పుకున్నారు. "నిజం చెప్పాలంటే, ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు అది చాలా ఖరీదైన వ్యవహారం. అప్పుడప్పుడే నా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయి. ఆదాయం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. కానీ ఐపీఎల్ టీమ్‌ను సొంతం చేసుకునేంత బడ్జెట్ నా దగ్గర లేదు" అని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు.

"నేను కేవలం గ్యాలరీలో సెలబ్రిటీని కాదు"

కేవలం సెలబ్రిటీ హోదాతో కాకుండా, సొంత బలంతో జట్టును నడపాలనే ఉద్దేశం ఆయన మాటల్లో కనిపించింది. డబ్బు ఒక్కటే కారణం కాదు, జట్టు నిర్వహణలో తన పాత్ర ఏమిటనేది కూడా అభిషేక్‌ను ఆలోచింపజేసింది.

"ఐపీఎల్ మౌలిక సదుపాయాలను బీసీసీఐ అద్భుతంగా నిర్వహిస్తుంది. అక్కడ నా వంతుగా నేను అదనంగా ఇచ్చే సహకారం ఏముంటుంది? గ్యాలరీలో కూర్చుని జెండాలు ఊపుతూ, 'స్టార్ వచ్చాడు' అనిపించుకోవడం నాకు నచ్చదు. నా కబడ్డీ లేదా ఫుట్‌బాల్ జట్లను గమనిస్తే.. నేను ప్లేయర్లతో పాటే ఉంటాను. వారి శిక్షణ, చివరికి వారు రోజూ ఏం తినాలో కూడా నేనే పర్యవేక్షిస్తాను. ప్రతి చిన్న విషయంలోనూ పాలుపంచుకోవడం నా అలవాటు" అని తన మేనేజ్మెంట్ స్టైల్‌ను వివరించారు అభిషేక్ బచ్చన్.

సినిమాల్లో బిజీ బిజీ

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇది కాకుండా రితీష్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'రాజా శివాజీ'లోనూ అభిషేక్ బచ్చన్ నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks