Accused Review: లెస్బియన్ లవ్.. హోమోసెక్సువల్ చుట్టూ సాగే అక్యూజ్ట్..డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Accused Review: లెస్బియన్ లవ్, హోమోసెక్సువల్ చుట్టూ తిరిగే కథతో ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చిన మూవీ ‘అక్యూజ్డ్’. డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఇక్కడ రివ్యూలో చూసేయండి.
సినిమా: అక్యూజ్డ్

దర్శకురాలు: అనుభూతి కశ్యప్
నటీనటులు: కొంకణా సేన్ శర్మ, ప్రతిభ రంటా తదితరులు
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27, 2026
ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమాగా ‘అక్యూజ్డ్’ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. లెస్బియన్ లవ్, హోమోసెక్సువల్ (స్వలింగ సంపర్కం) ప్రధాన పాయింట్ గా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందా? అనేది అక్యూజ్డ్ రివ్యూలో చూసేయండి. ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ గా ఓటీటీలోకి వచ్చింది.
అక్యూజ్డ్ కథ
అక్యూజ్డ్ మూవీ మొత్తం గీతిక సేన్ (కొంకణా సేన్ శర్మ), మీరా (ప్రతిభ రాంటా) చుట్టూ తిరుగుతోంది. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు. కలిసే ఉంటారు. గీతిక, మీరా డాక్టర్లు. ముఖ్యంగా గైనకాలజిస్ట్ గా గీతిక మంచి పేరు ఉంది. గీతిక భార్య మీరా ఏమో పీడియాట్రీషియన్. వీళ్ల హోమోసెక్సువల్ లైఫ్ హ్యాపీగా సాగుతుంటుంది. కానీ హాస్పిటల్లో గీతిక తమను లైైంగికంగా వేధిస్తుందని కొంతమంది మహిళలు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తారు.
లైంగిక వేధింపుల ఆరోపణలతో గీతిక, మీరా జీవితం తలకిందలవుతుంది. మీరాను హాస్పిటల్ నుంచి తొలగిస్తారు. ఆమె పర్సనల్ లైఫ్ లోనూ ప్రాబ్లెమ్స్ వస్తాయి. అసలు ఈ ఆరోపణలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది తెలుసుకోవడానికి గీతిక ట్రై చేస్తుంది. మరి గీతికపై ఆరోపణలు చేసింది ఎవరు? ఆమె నిజంగానే లైంగికంగా వేధించిందా? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
లెస్బియన్ లవ్ అంటూ డైరెక్టర్ అనుభూతి కశ్యప్ బోల్డ్ కంటెంట్ ను సినిమాగా తీసుకొచ్చింది. ఆమె ఆలోచనకు, ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పటికీ మన సమాజంలో ఒకరినొకరు ప్రేమించుకునే అమ్మాయిలను చులకనగా చూస్తున్నారు. వాళ్లు ఏదో నేరం చేసినట్లు చూస్తున్నారు. ఈ అక్యూజ్డ్ సినిమాలో హోమోసెక్సువల్ రిలేషన్ షిప్ ను బాగానే చూపించారు. అయితే మీటూ ఉద్యమం కాన్సెప్ట్ ఇందులో ఉంటుంది. పురుషుడిపై కాకుండా ఒక మహిళపైనే మరో మహిళ ఆరోపణలు చేయడం కొత్తగా ఉంది.
గీతిక, మీరా బంధం.. గీతికపై ఆరోపణలతో స్టోరీ రసవత్తరంగా మారుతుంది. అసలు గీతికపై ఆరోపణలు ఎవరు చేస్తున్నారన్నది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇందులో మీరా పాత్ర ఏమిటన్నది సస్పెన్స్ కలిగిస్తుంది. అయితే మూవీ మాత్రం స్లోగా సాగుతుంది. ఇక క్లైమాక్స్ కూడా గొప్పగా ఏం లేదు. మిస్టరీకి తగ్గ ఎలివేషన్ లేకుండా ఏదో సాదాసీదాగా ముగించారు. మరోవైపు గీతిక, మీరా మధ్య బంధంలోనూ ఎమోషనల్ డెప్త్ అనేది కనిపించలేదు.
ఎవరెలా చేశారంటే?
డాక్టర్ గీతికగా కొంకణా సేన్ శర్మ ఈ సినిమాకు వెన్నెముకలా నిలిచింది. మీరాతో బంధం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొనే మహిళాగా గీతిక గొప్పగా నటించింది. అసలు ఆ ఆరోపణలు ఎవరు చేస్తున్నారన్నది తెలుసుకోవడం కోసం ఆమె ప్రయత్నించడం బాగుంది. మరోవైపు ప్రతిభా రాంటా పర్ఫార్మెన్స్ కూడా చక్కగా ఉంది. ఆఖర్లో ఆమె ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.
ఫైనల్ గా
సుమారు రెండు గంటల నిడివి ఉన్న అక్యూజ్డ్ మూవీ ఒక సైకలాజికల్ థ్రిల్లర్. థ్రిల్లర్లను ఇష్టపడే ఆడియన్స్ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ చూడొచ్చు. అయితే స్లోగా సాగే కథనం, ప్రధాన పాత్రల మధ్య బలమైన ఘర్షణ లేకపోవడం, క్లైమాక్స్ మూవీకి మైనస్ పాయింట్లు అని చెప్పొచ్చు. ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
రేటింగ్: 2/5
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


