Actor: తెలుగులో చిన్న సినిమాగా తెరకెక్కిన ‘హుషార్ పిట్టలు’ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ ఊహించని సంఘటన జరిగింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన పుట్టా భాను అనే నటుడు చేసిన పని అందరినీ షాక్ కు గురి చేసింది.
చెంపపై కొట్టుకుంటూ

హుషార్ పిట్టలు మూవీ ప్రెస్ మీట్ లో అందరూ మాట్లాడుతూ తమ సినిమా అనుభవాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే మైక్ అందుకున్న పుట్టా భాను స్టేజీపై చేసిన పని అక్కడ ఉన్న వాళ్లందరిని ఒక్కసారిగా కంగారు పెట్టింది. మైక్ లో మాట్లాడుతూనే, ఒక్క క్షణం అంటూ తన చెంపలపై తానే బలంగా నాలుగైదు దెబ్బలు వేసుకున్నాడు భాను. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బిగ్ స్క్రీన్ పై
హుషార్ పిట్టలు సినిమాతో బిగ్ స్క్రీన్ పై కనిపించడంతో పుట్టా భాను ఎమోషనల్ అయ్యాడు. ‘‘నా పేరు పుట్టా భాను. సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా పుట్టా భానునే. నాకున్న సినిమా పిచ్చితో మా ఊరి థియేటర్లో ఏ సినిమా వచ్చినా ఫస్ట్ షోకు వెళ్లేవాడిని. స్క్రీన్ మీద ఏదైనా కామెడీ సీన్ వస్తే పగలబడి నవ్వేవాడిని. మొన్న మా సినిమా ప్రివ్యూ వేశారు. అప్పుడు అంత పెద్ద స్క్రీన్ మీద నా కామెడీ చూసి సీట్లలో కూర్చున్న వాళ్లు నవ్వారు’’ అని పుట్టా భాను చెప్పుకొచ్చాడు.
కలనో నిజమో
‘‘ఇది కలనో నిజమో అసలు అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం’’ అని ఆగి తన చెంపపై కొట్టుకున్నాడు భాను. దీంతో వెనుకాల ఉన్న హీరో హీరోయిన్ తో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‘‘ఇది నమ్మలేకపోతున్నా. ఇది కావాలని చేయలేదు. నేను అంత పెద్ద స్క్రీన్ మీద కనిపించానా? 8 ఏళ్ల నుంచి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సినిమానే లైఫ్ అని ఉన్నా. యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని భాను ఏడ్చేశాడు.
యూత్ ఫుల్ లవ్ స్టోరీ
{{/usCountry}}‘‘ఇది కలనో నిజమో అసలు అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం’’ అని ఆగి తన చెంపపై కొట్టుకున్నాడు భాను. దీంతో వెనుకాల ఉన్న హీరో హీరోయిన్ తో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‘‘ఇది నమ్మలేకపోతున్నా. ఇది కావాలని చేయలేదు. నేను అంత పెద్ద స్క్రీన్ మీద కనిపించానా? 8 ఏళ్ల నుంచి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సినిమానే లైఫ్ అని ఉన్నా. యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని భాను ఏడ్చేశాడు.
యూత్ ఫుల్ లవ్ స్టోరీ
{{/usCountry}}హుషార్ పిట్టలు సినిమాను యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఇందులో అన్ష్, వాసవి గణేష్ జంటగా నటించారు. గోవర్ధన్, సునీతా మనోహర్, రమేష్, అంజి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భిక్షు డైరెక్టర్. ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లకు రాబోతుంది.