...
...
Next Story

Actor Prakashraj : రామలక్ష్మణులపై వ్యాఖ్యలు.. నటుడు ప్రకాశ్‌రాజ్‌ మీద పరువు నష్టం దావా

Actor Prakashraj : రామలక్ష్మణులపై నటుడు ప్రకాశ్‌రాజ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

Published on: Apr 18, 2026, 11:28:47 IST
Advertisement

నటుడు ప్రకాశ్‌రాజ్ తాను చేసే కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. తాజాగా కూడా రామలక్ష్మణుల మీద మాట్లాడారు. దీంతో చాలా హిందూ సంఘాలు ప్రకాశ్‌రాజ్‌ను విమర్శిస్తున్నాయి.

ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్

అంతేకాదు ప్రకాశ్‌రాజ్ మీద పరువు నష్టం దావా దాఖలైంది. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఈ పరువు నష్టం దావా దాఖలు చేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాశ్‌రాజ్ మాట్లాడారని విమర్శించారు. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కావాలనే రామలక్ష్మణులపై వ్యాఖ్యానించారని పేర్కొన్నారు.

ప్రకాశ్‌రాజ్ ఏమన్నాడు?

కేరళలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో ప్రకాశ్‌రాజ్ పాల్గొన్నాడు. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుతూ.. రామాయణాన్ని గురించి కామెంట్స్ చేశాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కార్మికులుగా అభివర్ణించాడు. రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన గిరిజన తెగకు చెందిన వ్యక్తిగా వ్యాఖ్యానించాడు.

'రాముడు, లక్ష్మణుడు దక్షిణాదిలోని ఒక తోటలోకి ప్రవేశించి అక్కడ పండ్లను దొంగతనంగా తిన్నారు. ఆ సమయంలో ఆ తోట యజమానికి అయిన రావణుడితో వారికి గొడవ జరిగింది. అదే రామాయణ యుద్ధానికి కారణం.' అని కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చాడు ప్రకాశ్‌రాజ్.

కోట్లాది మందికి ఆరాధ్యుడైన రాముడిపై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంఘాలు ప్రకాశ్‌రాజ్‌ను విమర్శిస్తున్నాయి. పవిత్రంగా భావించేవారిని ఇలా అపహాస్యం చేయడంపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. హిందూ ధర్మంపై ప్రకాశ్‌రాజ్‌కు ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

ఇక సోషల్ మీడియాలో ప్రకాశ్‌రాజ్ మీద కామెంట్ల వర్షం కురుస్తోంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రామాయణాన్ని వక్రీకరిస్తున్నట్టుగా మండిపడుతున్నారు. ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. వలస కూలీలు అనడంపై దురుద్దేశం ఉందన్నారు.

ప్రకాశ్‌రాజ్‌కు సినిమాల్లో అవకాశాలు ఇవ్వకూడదని, సినిమా ఇండస్ట్రీ నుంచి అతడిని బరిష్కరించాలనే డిమాండ్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో #BanPrakashRaj వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe