...
...
Next Story

Rajasekhar Balakrishna NBK112: బాలకృష్ణను ఢీకొట్టే క్రూరమైన విలన్‌గా రాజశేఖర్? డైరెక్టర్ కొరటాల శివ సంచలన ప్లాన్!

Rajasekhar As Villain In Balakrishna Koratala NBK112: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం 'NBK112' నుంచి క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో యాంగ్రీ యంగ్ మేన్ డాక్టర్ రాజశేఖర్ క్రూరమైన విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం.

Published on: Oct 5, 2026, 20:35:45 IST
Advertisement

Rajasekhar As Villain In Balakrishna Koratala NBK112: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'NBK112' చుట్టూ టాలీవుడ్‌‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమరావతి వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది.

బాలయ్యకు జోడీగా కాదు.. ఢీకొట్టే విలన్‌గా రాజశేఖర్!

బాలకృష్ణను ఢీకొట్టే క్రూరమైన విలన్‌గా రాజశేఖర్? డైరెక్టర్ కొరటాల శివ సంచలన ప్లాన్!
బాలకృష్ణను ఢీకొట్టే క్రూరమైన విలన్‌గా రాజశేఖర్? డైరెక్టర్ కొరటాల శివ సంచలన ప్లాన్!

ఈ భారీ కామర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన ఒక సంచలన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో బాలకృష్ణను ఢీకొట్టే పవర్‌ఫుల్ ప్రతినాయకుడి పాత్ర కోసం సీనియర్ హీరో, 'యాంగ్రీ యంగ్ మేన్' డాక్టర్ రాజశేఖర్‌ను ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

బైకర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించి

'అంకుశం', 'ఆగ్రహం' వంటి సినిమాలతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సీనియర్ హీరో రాజశేఖర్, ఇటీవల 'బైకర్' సినిమాలో తన నటనతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు బాలయ్యతో తలపడే క్రూరమైన విలన్ పాత్రలో ఆయన కనిపిస్తే థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం..

బాలయ్య-రాజశేఖర్ కాంబినేషన్ కుదిరితే వెండితెరపై భారీ స్థాయి మాస్ విజృంభణ చూడవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది. తండ్రి, కొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో ఆయన కనిపించే అవకాశం ఉంది.

మాఫియా బ్యాక్‌డ్రాప్!

ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మొదటి షూటింగ్ షెడ్యూల్‌‌ను 2026 డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్!

ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజశేఖర్ పాత్ర డిజైన్‌పై చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. బాలకృష్ణ పవర్‌ఫుల్ మాస్ ఇమేజ్, కొరటాల శివ సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ మార్క్, రాజశేఖర్ విలనిజం ఇవన్నీ కలిస్తే 'NBK112' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1: NBK112 చిత్రానికి దర్శకుడు ఎవరు?

A1: ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

Q2: ఈ సినిమాలో డాక్టర్ రాజశేఖర్ ఎలాంటి పాత్ర పోషించనున్నారు?

A2: బాలకృష్ణను ఢీకొట్టే పవర్‌ఫుల్ ప్రతినాయకుడి (విలన్) పాత్రలో రాజశేఖర్ కనిపించనున్నారని ఫిలింనగర్ సమాచారం.

Q3: NBK112 సినిమాలో బాలకృష్ణ ఎన్ని పాత్రల్లో కనిపించనున్నారు?

A3: బాలకృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.

Q4: ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుంది?

A4: 2026 డిసెంబర్ మొదటి వారంలో తొలి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks