Rajendra Prasad Released Mugguru Kothulu Koko Kokoroko Song: తెలుగు చిత్రసీమలో యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్లకు ఎప్పుడూ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. కొత్త నటీనటులు, వైవిధ్యమైన ఆలోచనలతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో తెరకెక్కిన చిత్రం 'ముగ్గురు కోతులు'.
నిర్మాతగా శోభారాణి గరిమెల్ల

ఈ సినిమాను శోభారాణి గరిమెల్ల నిర్మించగా.. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహించారు. ముగ్గురు కోతులు సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో కావలసినంత ఆసక్తిని పెంచాయి.
ఐటమ్ సాంగ్ కోకో కొకొరోకో
తాజాగా ముగ్గురు కోతులు సినిమా నుంచి మాస్ ఆడియెన్స్‌ను ఊపేసే 'కోకో కొకొరొకో' అనే స్పెషల్ ఐటమ్ సాంగ్‌ను సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన రాజేంద్ర ప్రసాద్, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు.
మాస్ స్టెప్పులతో కేక పుట్టిస్తున్న 'కోకో కొకొరొకో'
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్పెషల్ మాస్ సాంగ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమాలో ఇలాంటి హై-ఎనర్జీ నంబర్ ఉంటే థియేటర్లలో వాతావరణం మరింత వేడెక్కుతుంది. 'కోకో కొకొరొకో' పాట కూడా అదే స్థాయిలో ఉత్సాహాన్ని నింపుతోంది.
సుహాస్ అందించిన సంగీతం
జగదీష్ అందించిన సాహిత్యం కుర్రకారును ఆకట్టుకునేలా సాగగా, ఎస్. సుహాస్ అందించిన బాణీలు శ్రోతలను వెంటనే కాలు కదిపేలా చేస్తున్నాయి. గాయని లాస్య ప్రియ తన గొంతుతో ఈ పాటకు మరింత ఊపు తీసుకొచ్చారు.
మాస్ స్టెప్పులకు ఈలలు పడటం
'కోకో కొకొరొకో' పాటలో కోరియోగ్రాఫర్లు వినోద్, రఘు, సాయి కంపోజ్ చేసిన మాస్ స్టెప్పులు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. ముగ్గురు హీరోలతో పాటు స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన నటి గ్లామర్, ఆమె డ్యాన్స్ మూవ్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
{{/usCountry}}'కోకో కొకొరొకో' పాటలో కోరియోగ్రాఫర్లు వినోద్, రఘు, సాయి కంపోజ్ చేసిన మాస్ స్టెప్పులు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. ముగ్గురు హీరోలతో పాటు స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన నటి గ్లామర్, ఆమె డ్యాన్స్ మూవ్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
{{/usCountry}}యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా 'ముగ్గురు కోతులు'
ఇకపోతే ముగ్గురు కోతులు చిత్రంలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ కథానాయకులుగా నటిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా అలరించనున్నారు. రాజ్ నోముల ఛాయాగ్రహణం, జమీర్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో జోష్ నింపుతోన్న ఈ సినిమా నుంచి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్లు రానున్నాయి.
మంచి విజయం సాధించాలి
"ఈ చిత్రం మంచి విజయం సాధించి, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలి" అని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు, ఉత్సాహవంతులైన కొత్త కుర్రకారు కలయికలో వస్తున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో చూడాలి.