...
...
Next Story

Rakesh Bedi: నటనకు ప్రేక్షకులు ఫిదా- కోటి రూపాయలు అదనంగా పొందిన నటుడు రాకేష్ బేడీ- పారితోషికానికి రెట్టింపు!

Rakesh Bedi Get 1 Cr Bonus: ఇప్పుడు ఎక్కడ చూసినా 'ధురంధర్' ప్రభంజనమే కనిపిస్తోంది. వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రంలో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన సీనియర్ నటుడు రాకేష్ బేడీకి మేకర్స్ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఆయన చేసిన నటనకు ప్రేక్షకులు ఫిదా కావడంతో కోటి రూపాయలు అదనంగా బోనస్ వచ్చింది.

Published on: Apr 25, 2026, 15:44:21 IST
Advertisement

Rakesh Bedi Get 1 Cr Bonus: సినిమా అంటే కేవలం హీరో, విలన్ మాత్రమే కాదు. బలమైన పాత్రలు పడితే ఏ నటుడైనా వెండితెరపై మ్యాజిక్ చేయగలడని బాలీవుడ్ నటుడు రాకేష్ బేడీ నిరూపించారు. 'ధురంధర్' చిత్రంలో ఆయన పోషించిన పాకిస్థానీ రాజకీయ నాయకుడు 'జమీల్ జమాలీ' పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

రాకేష్ బేడీ చెప్పిన డైలాగ్స్‌కు ఫిదా

నటనకు ప్రేక్షకులు ఫిదా- కోటి రూపాయలు అదనంగా పొందిన నటుడు రాకేష్ బేడీ- పారితోషికానికి రెట్టింపు!
నటనకు ప్రేక్షకులు ఫిదా- కోటి రూపాయలు అదనంగా పొందిన నటుడు రాకేష్ బేడీ- పారితోషికానికి రెట్టింపు!

ముఖ్యంగా రాకేష్ బేడీ చెప్పిన డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతున్నాయి. రెండో భాగం 'ధురంధర్: ది రివెంజ్'లో రాకేష్ బేడీ పాత్ర చుట్టూ తిరిగే ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేయడమే కాకుండా, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

ధురంధర్ సినిమాలు సాధించిన చారిత్రాత్మక విజయం, రాకేష్ బేడీ నటనకు వస్తున్న ప్రశంసలను చూసి నిర్మాతలు ఫిదా అయ్యారు. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు ఆదిత్య ధర్, నిర్మాత లోకేష్ ధర్ రాకేష్ బేడీకి రూ. 1 కోటి అదనపు పారితోషికాన్ని బోనస్‌గా అందజేసినట్లు సమాచారం.

పారితోషికానికి రెట్టింపు

నిజానికి ఈ ఫ్రాంచైజీకి (రెండు భాగాలకు కలిపి) రాకేష్ బేడీ గతంలో రూ. 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు రాకేష్ బేడీ నటనకు ప్రేక్షకులు ఫిదా కావడం, బ్రహ్మరథం పట్టడంతో ఆయనకు అదనంగా కోటి రూపాయలు ఇచ్చినట్లు టాక్ వస్తోంది. ఈ లెక్కన రాకేష్ బేడీ తీసుకున్న పారితోషికానికి ఇది రెట్టింపు అన్నమాట.

సాధారణంగా బాలీవుడ్‌లో హీరోలకు లాభాల్లో వాటాలు ఉండటం చూస్తుంటాం. కానీ, ఇలా ఒక సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కష్టాన్ని గుర్తించి ఇంత పెద్ద మొత్తంలో బోనస్ ఇవ్వడం చిత్ర పరిశ్రమలో అరుదైన విషయమని విశ్లేషకులు చెబుతున్నారు.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట

ప్రస్తుతం రాకేష్ బేడీ చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. అందులో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వస్తున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' ఒకటి. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks