Suyodhana: 11 ఏళ్లప్పుడు దుర్యోధనుడి నాటకం, ఇప్పుడు సుయోధనగా చేశా- ప్రియదర్శికి యూఎస్‌లోనూ ఫాలోయింగ్ ఉంది: సాయి కుమార్

Sai Kumar Speech Suyodhana Pre Release Event: డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా సుయోధన. ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కానుంది. తాజాగా ఇవాళ (మార్చి 26) నిర్వహించిన సుయోధన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Mar 26, 2026, 20:11:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సుయోధన. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించారు. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు.

11 ఏళ్లప్పుడు దుర్యోధనుడి నాటకం, ఇప్పుడు సుయోధనగా చేశా- ప్రియదర్శికి యూఎస్‌లోనూ ఫాలోయింగ్ ఉంది: సాయి కుమార్
11 ఏళ్లప్పుడు దుర్యోధనుడి నాటకం, ఇప్పుడు సుయోధనగా చేశా- ప్రియదర్శికి యూఎస్‌లోనూ ఫాలోయింగ్ ఉంది: సాయి కుమార్

సుయోధన ప్రీ రిలీజ్ ఈవెంట్

సుయోధన సినిమా ఈ నెల 27న అంటే రేపే ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ సుయోధన సినిమాను విడుదల చేస్తోంది.

ఈ క్రమంలో తాజాగా ఇవాళ (మార్చి 26) సుయోధన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దుర్యోధనుడి నాటకం వేశా

యాక్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ.. "నేను 1972లో దుర్యోధనుడి పాత్రను నాటికలో అభినయించాను. అప్పటికి నా వయసు 11 ఏళ్లు. ఇప్పుడు ఈ చిత్రంలో సుయోధనుడిగా నటిస్తుంటే ఆ రోజులు గుర్తుకువచ్చాయి" అని అన్నారు.

"మీరు చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెబుతున్నారు. వీలైతే సినిమా అంతా ఇక్కడే చూడాలని ఉంది. మూవీలో ఎలాంటి మలుపులు ఉంటాయో మాకూ తెలియదు. రీసెంట్‌గా ఈ మూవీ ప్రమోషన్స్ యూఎస్‌లో చేశాం. ప్రియదర్శికి ఇక్కడే కాదు యూఎస్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. యూఎస్‌లోని వాళ్లు సుయోధనతో ఒక మంచి మూవీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని అన్నారు" అని సాయి కుమార్ తెలిపారు.

చిన్నప్పుడే నాన్నగారు నేర్పించారు

"అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందనే విషయాన్ని మా నాన్నగారు చిన్నప్పుడే నేర్పించారు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రమిది. ఇలాంటి సినిమాలు తరుచూ రావు. ఈ టీమ్ అంతా చాలా కష్టపడి, ప్యాషనేట్‌గా మూవీ చేశారు. రేపు థియేటర్స్‌లోకి వస్తున్న సుయోధన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా" అని సాయి కుమార్ తన స్పీచ్ ముగించారు.

ఇదే ఈవెంట్‌లో ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ.. "నేను ఈ సినిమాలోకి రావడానికి కారణం ఎడిటర్ చోటా కె ప్రసాద్. ఆయన ఈ సినిమాకు ఎడిటింగ్‌తో పాటు అనేక విషయాల్లో సపోర్ట్ చేస్తూ అండగా నిలిచారు" అని తెలిపారు.

మంచి సెట్ వర్క్ చేశాం

"ఈ మూవీ కోసం మంచి సెట్ వర్క్ చేశాం. అది మూవీలో చాలా బిగ్ స్పాన్‌లో కనిపిస్తుంది. సాయి కుమార్ గారికి, ప్రియదర్శికి తమ కెరీర్‌లో ఒక స్పెషల్ మూవీగా సుయోధన నిలుస్తుంది" అని చెప్పుకొచ్చారు బ్రహ్మ కడలి.

"సుయోధన సినిమా ఒక సౌండింగ్ నేపథ్యంగా ఉంటుంది అని తెలియగానే మ్యూజిక్ డైరెక్టర్‌గా హ్యాపీగా ఫీలయ్యాను. ఒక కొత్త వైబ్ ఈ సినిమాలో మీరంతా ఫీలవుతారు" అని సంగీత దర్శకుడు జై క్రిష్ పేర్కొన్నారు.

బీజీఎమ్ మరింత బాగా వచ్చేలా

"ప్రియదర్శి, సాయి కుమార్ గారి పర్‌ఫార్మెన్స్‌లు చూశాక నా బీజీఎమ్‌ను మరింత బాగా వచ్చేలా చూసుకున్నాను. ఈ సినిమా మీ అందరికీ ఒక కొత్త అనుభూతిని పంచుతుంది" అని వెల్లడించారు మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More