Satyadev Motivational Quotes Telugu: సత్యదేవ్.. ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్‌లో మోస్ట్ అండర్‌రేటెడ్ హీరో. అద్బుతమైన నటన నైపుణ్యం ఉన్న టాలెంటెడ్ యాక్టర్ హీరో సత్యదేవ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద వంటి సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్‌గా చేసిన జ్యోతిలక్ష్మీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
చిరంజీవికి విలన్‌గా

ఆ తర్వాత బ్లఫ్ మాస్టర్ సినిమాలో తన నటనతో ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించాడు. నటుడిగా, హీరోగానే కాకుండా చిరంజీవి వంటి స్టార్స్ పక్కన విలన్‌గా (గాడ్ ఫాదర్ మూవీ) చేసి మెప్పించాడు సత్యదేవ్.
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సత్యదేవ్ చేతిలో రావు బహదూర్, ఫుల్ బాటిల్, గరుడ: చాప్టర్ వన్, సమవర్తి వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన రావు బహదూర్ గ్లింప్స్, సమవర్తి మేకింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాల్లో సత్యదేవ్ పడిన కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఒక్కో మెట్టు ఎదుగుతూ
ఎంతో కష్టపడుతూ ఒక్కో మెట్టు ఎదుగుతున్న హీరో సత్యదేవ్ ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పి సత్యాలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని సత్యాలు అనడం కంటే జీవితాన్ని మార్చే మోటివేషన్ సూత్రాలు అనొచ్చు. ఎందుకంటే సత్యదేవ్ చెప్పిన ఆ ఐదు మాటలు జీవితంలో కష్టమైనిపించినప్పుడు ఒక్కసారైన సరే తలుచుకుంటే ఓ చిన్న స్ఫూర్తి కలుగుతుంది.
మరి హీరో సత్యదేవ్ చెప్పిన ఆ ఐదు మోటివేషన్ సూత్రాలతో పాటు ఆయన చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. ప్రముఖ పాపులర్ యూట్యూబ్ పాడ్‌కాస్ట్ ఛానెల్ రా టాక్స్ విత్ వీకే షోలో ఇటీవల పాల్గొన్న హీరో సత్యదేవ్ కెరీర్ మొదట్లో పడిన కష్టాన్ని చెప్పుకున్నాడు.
రెండింటిని వదల్లేదు
{{/usCountry}}మరి హీరో సత్యదేవ్ చెప్పిన ఆ ఐదు మోటివేషన్ సూత్రాలతో పాటు ఆయన చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. ప్రముఖ పాపులర్ యూట్యూబ్ పాడ్‌కాస్ట్ ఛానెల్ రా టాక్స్ విత్ వీకే షోలో ఇటీవల పాల్గొన్న హీరో సత్యదేవ్ కెరీర్ మొదట్లో పడిన కష్టాన్ని చెప్పుకున్నాడు.
రెండింటిని వదల్లేదు
{{/usCountry}}"నేను చాలా డెస్పరేట్ అయిపోయాను. భయమేసింది. కడుపు కాలితే ఏదైనా చేస్తాం గురు. నేను ఒక ప్లాన్ వేసుకున్నా. నా కలని, ఉద్యోగాన్ని రెండింటిని వదల్లేదు. మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 వరకు సినిమా షూటింగ్స్ చేసేవాడిని. మళ్లీ సాయంత్రం 6 నుంచి ఉదయం 3 వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడిని. మరి సెక్యూరిటీ (జాబ్) ఉండాలిగా" అని సత్యదేవ్ చెప్పాడు.
సత్యదేవ్ చెప్పిన 5 మోటివేషన్ సూత్రాలు:
1. ఎవ్వరైనా అచీవ్ (విజయం సాధిస్తారు) చేయగలరు. ఎవరైనా చేస్తారు. కేవలం దాన్ని వదలకూడదు అంతే. ప్రయత్నిస్తూనే ఉండాలి.
2. దేవుడు నిన్ను రాజును చేయాలనుకుంటే.. నీకు కిరీటాన్ని ఇవ్వడు, యుద్ధాన్ని ఇస్తాడు. సో నేను రాజు అవ్వాలని కోరుకుంటే టింగుమని నెత్తిమీద కిరీటం రాదు. ఫస్ట్ యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో నువ్వు గెలిస్తే రాజు అవుతావ్.
3. నీకు ఈ పని అవ్వకూడదనుకుంటే పది మందితో డిస్కస్ చేయు. అవ్వాలనుకుంటే నువ్వు ఒక్కడివే నిర్ణయం తీసుకో.
4. ఎవడైనా ఏదైనా అన్నాడనుకో రెండు రెట్లు ఎక్కువగా పనిచేస్తాను. నువ్వు నన్ను పడగొట్టలేవని చెప్పడానికి అన్నమాట.
5. కొన్ని ఉంటాయిగా.. అది ఎందుకు చేయలేదని. అది చేస్తే పీక్స్‌లో చేయాలి లేకుంటే చేయకూడదు అన్నదే పాయింట్. నేను చేయగలిగాను అంటే ఎవడైనా చేయగలడు. (ఏదైనా నిర్ణయం తీసుకుని లేదా ఇష్టముండి చేయాలనుకుంటే చాలా గట్టిగా చేయాలి. లేకుంటే లేదు. సైలెంట్‌గా ఊరుకోవాలనే అర్థంలో)
సత్యదేవ్ సత్యాలు పేరుతో
ఇవేకాకుండా రా టాక్స్ పాడ్‌కాస్ట్‌లో సత్యదేవ్ చెప్పిన చాలా మాటలు ఎంతోమందికి మోటివేషన్ ఇస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియో క్లిప్స్, కొటేషన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. సత్యేదేవ్ సత్యాలు పేరుతో అవి మరింత ట్రెండ్ అవుతూ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి.