Satyadev On Politics: డబ్బు ఉంటేనే రాజకీయాలు మాట్లాడాలి, లేకుంటే నోరు మూసుకోవడమే మంచిది.. హీరో సత్యదేవ్ కామెంట్స్

Satyadev Comments On Politics Podcast: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా డబ్బు ఉంటేనే రాజకీయాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయాలని లేకుంటే నోరు మూసుకుని ఉండాలని సత్యదేవ్ అన్నారు. రా టాక్స్ అనే పాడ్‌కాస్ట్‌లో సత్యదేవ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: May 31, 2026, 16:37:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Satyadev Comments On Politics Podcast: టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. వైవిధ్యమైన నటనతో తెలుగులో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు సత్యదేవ్. అయితే, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో నటీనటుల రాజకీయాలపై హీరో సత్యదేవ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

డబ్బు ఉంటేనే రాజకీయాలు మాట్లాడాలి, లేకుంటే నోరు మూసుకోవడమే మంచిది.. హీరో సత్యదేవ్ కామెంట్స్ (YouTube/Raw Talks)
డబ్బు ఉంటేనే రాజకీయాలు మాట్లాడాలి, లేకుంటే నోరు మూసుకోవడమే మంచిది.. హీరో సత్యదేవ్ కామెంట్స్ (YouTube/Raw Talks)

అభిప్రాయల వల్ల వచ్చే నష్టాలు

నటులుగా ఉన్నవారు తమ రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా చెబితే వచ్చే నష్టాల గురించి పూసగుచ్చినట్లు వివరించారు సత్యదేవ్. ఇటీవలి కాలంలో తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు రాజకీయాల్లోకి రావడం లేదా ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీకి మద్దతు తెలపడం చూస్తున్నాం. అయితే దీనివల్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగి, సినిమాల కలెక్షన్లపై కూడా ఆ ప్రభావం పడుతోంది. సరిగ్గా ఇదే అంశంపై సత్యదేవ్ మాట్లాడారు.

'రా టాక్స్ విత్ వీకే' పాడ్‌కాస్ట్‌లో అసలు నిజాలు

ప్రముఖ యూట్యూబ్ పాడ్‌కాస్ట్ 'రా టాక్స్ విత్ వీకే' (Raw Talks with VK)లో హీరో సత్యదేవ్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. సెలబ్రిటీలుగా ఉన్నవారు తమ మనసులోని అసలు రాజకీయ అభిప్రాయాలను ఎందుకు దాచుకుంటారనే విషయానికి ఆయన ఒక వ్యాపార సూత్రాన్ని (Business Model) ఉదాహరణగా చెప్పారు.

"ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం ఏ విషయాలపైనా నిజాయితీతో కూడిన రాజకీయ అభిప్రాయాలను బయటకు చెప్పలేం. ఇది ఇండస్ట్రీలో బతకడానికి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ఒక ప్రోటోకాల్. మన సినిమాను థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాలి అనుకున్నప్పుడు.. దౌత్యనీతి (Diplomacy) పాటించడం తప్పనిసరి" అని సత్యదేవ్ పేర్కొన్నారు.

డబ్బుంటేనే ఆ రిస్క్ చేయాలి!

సినిమా అనేది ఒక భారీ వ్యాపారమని, ఇక్కడ ప్రతి ప్రేక్షకుడూ ముఖ్యమేనని సత్యదేవ్ అభిప్రాయపడ్డారు. "సినిమా చూసేవాళ్లలో అన్ని రకాల రాజకీయ భావాలు ఉన్నవారు ఉంటారు. నా పని కేవలం సినిమా తీసి, దాన్ని వీలైనంత ఎక్కువ మందికి చూపించడం మాత్రమే" అని సత్యదేవ్ అన్నారు.

"ఒక పది మంది నా సినిమా చూడటానికి వస్తే, వారిలో ఒక్కరిని కూడా రాజకీయాల వల్ల కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. అందుకే నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఒకవేళ నేను ఏదైనా ఒక రాజకీయ పార్టీ వైపు నిలబడాలి అనుకుంటే.. ఆ తప్పులన్నింటినీ కడిగేసేంత భారీగా నా దగ్గర డబ్బుండాలి. అంత ఆర్థిక బలం లేనప్పుడు నోరు మూసుకుని ఉండటమే మంచిది. నేనైతే నా జీవితంలో నా అసలు రాజకీయ ఆలోచనలను ఎప్పటికీ బయటపెట్టను" అని సత్యదేవ్ స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో నటీనటుల (సెలబ్రిటీలు)పై ఒత్తిడి పెరుగుతోందని, ఏదైనా ఒక చిన్న సామాజిక అంశంపై స్పందిస్తే.. ఆ తర్వాత జరిగే ప్రతి వివాదంపైనా మాట్లాడాలంటూ సెలబ్రిటీలను నెటిజన్లు (ప్రజలు) టార్గెట్ చేస్తున్నారనే పాయింట్‌ను కూడా సత్యదేవ్ ఒప్పుకున్నారు. ఇలాంటి పరిణామాల వల్లే సినిమా వాళ్లు మౌనంగా ఉండటానికే మొగ్గు చూపుతారని చెప్పారు.

వరుస సినిమాలతో సత్యదేవ్ బిజీ

ఇదిలా ఉంటే, సత్యదేవ్ కెరీర్ విషయానికొస్తే.. గతేడాది (2025) గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'కింగ్డమ్' (Kingdom) చిత్రంలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అన్నదమ్ముల సెంటిమెంట్‌తో సాగిన ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు.

అలాగే ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించిన 'డ్రైవ్' సినిమాలో అతిథి పాత్రలో సత్యదేవ్ మెరిశారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందించిన ఓటీటీ సిరీస్ అరేబియా కడలిలోనూ సత్యదేవ్ హీరోగా చేశారు.

సత్యదేవ్ క్రేజీ సినిమాలు

ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ నటిస్తున్న 'రావు బహదూర్' (Rao Bahadur) చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో పాటు 'ఫుల్ బాటిల్', 'గరుడ: చాప్టర్ వన్', సమవర్తి వంటి సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More