Shravan Reddy Role Analysis In Agadha Movie: టాలీవుడ్‌లో ఇటీవల విభిన్నమైన కథాంశాలతో వచ్చే అట్మాస్ఫియరిక్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఆ క్రమంలోనే పూర్తిస్థాయి మిస్టిసిజమ్, సూపర్‌నేచురల్, డివైన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'అగధ'.
కథా కథనాల పరంగా చూస్తే..

సాధారణంగా వచ్చిపోయే రెగ్యులర్ హారర్ చిత్రాలకు, కథా కథనాల పరంగా చూస్తే అగధ పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. కేవలం భయపెట్టడమే ధ్యేయంగా కాకుండా, ఒక నిగూఢమైన వాతావరణాన్ని (Atmospheric Thriller) క్రియేట్ చేస్తూ సాగే ఈ సినిమాను కేవలం ఒక హారర్ మూవీగా మాత్రమే వర్గీకరించలేం.
బహుముఖ కోణాలున్న పాత్రలో శ్రవణ్ రెడ్డి
నటీనటుల పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ అగధ చిత్రాన్ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఈ చిత్రంలో హీరో, నటుడు శ్రవణ్ రెడ్డి పోషించిన పాత్రలో అనేక లేయర్లు (Layers) ఉన్నాయి. సినిమా ప్రారంభంలో ఎంతో సహజంగా, మన పక్కంటి కుర్రాడిలా కనిపించే ఆ పాత్ర, కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఊహించని కొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది.
ఒక రకమైన డిస్టర్బెన్స్
పాత్రలోని ఈ రూపాంతరాన్ని (Transformation) శ్రవణ్ రెడ్డి ఎంతో సహజంగా తన నటనతో పండించారు. కావాలని భయపెట్టే ప్రయత్నం చేయకుండానే, తన హావభావాలతో ఒక రకమైన డిస్టర్బెన్స్, గూస్‌బంప్స్ తెప్పించే భయాన్ని (Unsettling quality) ప్రేక్షకుల్లో కలిగించడంలో ఆయన విజయం సాధించారని చెప్పుకోవచ్చు.
పాత్రను పూర్తిగా అర్థ చేసుకున్నామనుకునేలోపే
ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్నాం అనుకునే లోపే మరో కోణాన్ని చూపిస్తూ ప్రేక్షకుడిని నిరంతరం సస్పెన్స్‌లో ఉంచడమే ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి నటనలోని అసలు ప్రత్యేకత అని మూవీ మేకర్స్ చెప్పారు. అంటే, అగధలో శ్రవణ్ రెడ్డిని స్టార్టింగ్‌లో హీరోగా, క్లైమాక్స్‌కు వచ్చేసరికి యాంటీ హీరోగా మారే విధానం ఆకట్టుకుంటుంది.
గ్రే షేడ్స్‌లో పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్
{{/usCountry}}ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్నాం అనుకునే లోపే మరో కోణాన్ని చూపిస్తూ ప్రేక్షకుడిని నిరంతరం సస్పెన్స్‌లో ఉంచడమే ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి నటనలోని అసలు ప్రత్యేకత అని మూవీ మేకర్స్ చెప్పారు. అంటే, అగధలో శ్రవణ్ రెడ్డిని స్టార్టింగ్‌లో హీరోగా, క్లైమాక్స్‌కు వచ్చేసరికి యాంటీ హీరోగా మారే విధానం ఆకట్టుకుంటుంది.
గ్రే షేడ్స్‌లో పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్
{{/usCountry}}నటుడిగా పాజిటివ్, నెగెటివ్ షేడ్స్ మధ్య ఉండే క్లిష్టమైన 'గ్రే జోన్' (Grey Zone)ను శ్రవణ్ రెడ్డి ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేశారు. డైలాగ్స్ లేకుండా నిశ్శబ్దంగా ఉన్న క్షణాల్లో సైతం, అతని కళ్లలోనే ఏదో డార్క్ సీక్రెట్ దాగి ఉందనే భావన వీక్షకులను వెంటాడుతుంది.
థియేటర్ నుంచి బయటకు వచ్చాక
ప్రారంభంలో కనిపించిన శ్రవణ్ వేరు, క్లైమాక్స్ నాటికి ఆ పాత్ర చేరుకునే ఎత్తు వేరు. ఒక పరిణతి చెందిన నటుడిలా చాలా కంట్రోల్డ్‌గా, ఆత్మవిశ్వాసంతో ఆయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్, సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మనసులో ముద్రవేసుకుపోతుంది.
సరికొత్త థ్రిల్ పంచేలా అగధ
మొత్తానికి విభిన్నమైన చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు 'అగధ' ఒక సరికొత్త థ్రిల్‌ను పంచడమే కాకుండా, శ్రవణ్ రెడ్డి నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అగ్ర నిర్మాత, డైరెక్టర్ ఎంఎస్ రాజు అగధ చిత్రానికి దర్శకత్వం వహించారు.
కామాక్షి, శ్రవణ్ నటన హైలెట్
టాలీవుడ్‌లో నటిగా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న కామాక్షి భాస్కర్ల అగధలో మెయిన్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించారు. అగధ సినిమాలో కామాక్షి, శ్రవణ్ రెడ్డి నటన హైలెట్‌గా నిలిచిందని రివ్యూవర్స్ తెలిపారు. ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైన అగధ పర్వాలేదనిపించుకుంటోంది.
అగధ కీలక పాత్రలు
అంతేకాకుండా అగధ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డితోపాటు ఉల్కా గుప్తా, జోవిక విజయ్ కుమార్, రోషన్ బషీర్, సీనియర్ హీరో భానుచందర్, షిజు అబ్ధుల్ రషీద్, వనిత విజయ్ కుమార్, శ్రేయా రాణి రెడ్డి, వైవా రాఘవ, అర్ణ ములర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.