Yash Toxic: టాక్సిక్‌లో ఇంటిమేట్ సీన్లు.. తన భార్య రాధిక పండిత్ కూడా ఇబ్బందిపడినట్లు చెప్పిన హీరో యశ్

Yash About Wife Radhika Pandit Reaction: కేజీఎఫ్ 2 వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్'. ఈ సినిమాలో ఆయన నటించిన రొమాంటిక్ సన్నివేశాలపై భార్య రాధిక పండిత్ ఎలా స్పందించారో యశ్ ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Published on: Aug 16, 2026, 14:15:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Yash About Wife Radhika Pandit Reaction: 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్, నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 'టాక్సిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' టైటిల్‌తోనే సినీ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేసింది.

టాక్సిక్‌లో ఇంటిమేట్ సీన్లు.. తన భార్య రాధిక పండిత్ కూడా ఇబ్బందిపడినట్లు చెప్పిన హీరో యశ్
టాక్సిక్‌లో ఇంటిమేట్ సీన్లు.. తన భార్య రాధిక పండిత్ కూడా ఇబ్బందిపడినట్లు చెప్పిన హీరో యశ్

భార్య అసౌకర్యంగా భావించడం సహజమే

ఇటీవలే విడుదలైన ఈ టాక్సిక్ ట్రైలర్‌లో యశ్ కొన్ని రొమాంటిక్ అండ్ ఇంటిమేట్ సీన్లలో నటించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పాపులర్ టాక్ షో 'ఆప్ కీ అదాలత్'లో ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మతో మాట్లాడిన యశ్ ఈ కాంట్రవర్షియల్ సీన్లపై తన భార్య, మాజీ నటి రాధిక పండిత్ ఎలా స్పందించారో చాలా ఓపెన్‌గా చెప్పారు.

నేనేదీ దాచాలనుకోవడం లేదు

"ఏ జీవిత భాగస్వామికైనా తమ భాగస్వామి తెరపై ఇటువంటి సన్నివేశాల్లో నటించడం చూస్తే కాస్త అసౌకర్యంగానే అనిపిస్తుంది. నేనేదీ దాచాలనుకోవడం లేదు, రాధిక కూడా అలాగే భావించింది" అని యశ్ నిజాయతీగా ఒప్పుకున్నారు.

రాధిక కూడా నటి కావడంతో

కథ డిమాండ్ మేరకే తానూ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటించానని యష్ వివరించారు. రాధిక కూడా నటి కావడంతో సినిమా మేకింగ్ ప్రక్రియను, నటుల పరిమితులను ఆమె బాగా అర్థం చేసుకోగలరని చెప్పారు.

ఇది కేవలం ఒక బాధ్యత మాత్రమే!

తెరపై తాను రొమాంటిక్ సీన్లు చేస్తున్నప్పుడు ఒక నటుడిగా మాత్రమే చేస్తానని, ఒక భర్తగా కాదని యశ్ వ్యాఖ్యానించారు. "ఈ సన్నివేశాలు చేయడం నాకూ అంత తేలికైన విషయం కాదు. అయితే కథకు ఇవి చాలా కీలకమైనవి. నా భార్యకు ఇవి పూర్తిగా నచ్చకపోవచ్చు, అంతమాత్రాన ఆమె నాపై కోపంగా లేదు. నాపై ఆమెకు పూర్తి నమ్మకం ఉంది" అని యశ్ స్పష్టం చేశారు.

యూత్‌ను మనస్సులో పెట్టుకుని

ఈ తరం యూత్‌ను (Gen Z) మనస్సులో పెట్టుకునే 'టాక్సిక్' కథను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. నేటి యువత, మునుపటి తరం ఎదుర్కొంటున్న వైరుధ్యాలు, సవాళ్లను ఈ సినిమాలో చాలా ప్రామాణికంగా చూపించనున్నట్లు చెప్పారు.

ఐదుగురు స్టార్ హీరోయిన్లతో గ్యాంగ్‌స్టర్ డ్రామా

టాక్సిక్ చిత్రంలో యశ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో కథ సాగనుంది. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి ఐదుగురు స్టార్ హీరోయిన్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. కేజీఎఫ్ 2 తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకుని యశ్ చేస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా స్థాయిలో దీనిపై భారీ బిజినెస్ అంచనాలు నెలకొన్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'టాక్సిక్' సినిమాలో యశ్‌తో పాటు నటిస్తున్న కథానాయికలు ఎవరు?

ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కథానాయికలుగా నటిస్తున్నారు.

2. రొమాంటిక్ సీన్లపై యశ్ భార్య రాధిక పండిత్ ఎలా స్పందించారు?

ఈ తరహా సన్నివేశాలు చూసి మొదట కాస్త అసౌకర్యంగా అనిపించినా, కథ డిమాండ్ అని అర్థం చేసుకుని రాధిక తనకు మద్దతుగా నిలిచారని యశ్ తెలిపారు.

3. 'టాక్సిక్' చిత్రానికి దర్శకుడు ఎవరు?

ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా, యశ్ కూడా కథా రచనలో భాగమయ్యారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More