Actor Srihari Son Meghamsh Aasmaan First Look Released: శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాలో దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు.
ఆస్మాన్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

ఆస్మాన్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, అరబిక్ భాషల్లో రూపొందుతోంది. స్వర్గీయ నటుడు శ్రీహరి జయంతి సందర్భంగా ఆస్మాన్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను శనివారం (ఆగస్ట్ 15) నాడు రిలీజ్ చేశారు. ఆస్మాన్ మోషన్ పోస్టర్ వీడియో గమనిస్తే.. సినిమాపై ఆసక్తి కలుగుతోంది.
పెద్ద అరచేయి మధ్యలో హీరో
పెద్ద అరచేయి మధ్యలో హీరో మేఘాంశ్ కాగడా పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆ అరచేయికి సంబంధించిన నుదురు, దానిపై డిఫరెంట్‌గా డిజైన్ చేసిన బొట్టును కూడా మోషన్ పోస్టర్‌లో గమనించవచ్చు. అరచేయి చుట్టూ జనాలందరూ కాగడాలను పట్టుకుని నిలుచున్నారు. అసలు అరచేయి ఎవరిది? మేఘాంశ్ పాత్ర ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అవుతోంది.
హీరో మేఘాంశ్ శ్రీహరి కామెంట్స్
ఈ మేరకు నిర్వహించిన ఆస్మాన్ మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. రామ్‌తో వర్క్ చేయడం ఓ గొప్ప ఎక్స్‌పీరియెన్స్. సెట్‌లో ఎప్పుడూ ఓ పండుగ వాతావరణం కనిపించేది" అని అన్నారు.
హీరోయిన్‌గా రాయంచ చేస్తున్నారు
"రాయంచ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రశాంత్ గారి బీజీఎమ్ అద్భుతంగా ఉండబోతోంది. మిగతా విషయాలన్నీ మున్ముందు ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడతాను" అని తెలిపారు హీరో మేఘాంశ్ శ్రీహారి.
మేఘాంశ్ బయట కూడా హీరోనే
{{/usCountry}}"రాయంచ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రశాంత్ గారి బీజీఎమ్ అద్భుతంగా ఉండబోతోంది. మిగతా విషయాలన్నీ మున్ముందు ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడతాను" అని తెలిపారు హీరో మేఘాంశ్ శ్రీహారి.
మేఘాంశ్ బయట కూడా హీరోనే
{{/usCountry}}దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ మూవీ అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. థియేటర్లో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్ గారు, హీరో మేఘాంశ్ గారికి, విజువల్స్ ఇచ్చిన షోయబ్ గారికి థాంక్స్. మేఘాంశ్ గారు బయట కూడా హీరోనే. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో వస్తాం" అని చెప్పారు.
మేఘాంశ్‌ది ట్రాన్స్‌ఫార్మర్ లాంటి బాడీ
నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ పోస్టర్ అద్భుతంగా ఉంది. నాకు పోస్టర్ చూస్తుంటే మాత్రం ఫుల్ ఎనర్జిటిక్‌గా అనిపిస్తోంది. మేఘాంశ్‌ది ట్రాన్స్‌ఫార్మర్‌లాంటి బాడీ. మేఘాంశ్ యాక్టింగ్ చూసి అందరం ఆశ్చర్యపోయేవాళ్లం" అని అన్నారు.
రియల్ స్టార్ కొడుకు ఇలానే ఉంటాడని
"మేఘాంశ్ షూటింగ్ సెట్‌లో అందరి కంటే ముందుంటాడు. రియల్ స్టార్ కొడుకు అంటే ఇలానే ఉంటాడనిపించేలా ఉంటాడు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన డిస్కో శాంతి మేడంకి థాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాత వెంకటేష్.
తెలుగులో చాలా అరుదుగా వస్తుంది
మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ లాంటి చిత్రం తెలుగులో చాలా అరుదుగా వస్తుంది. ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్‌కి పని చేస్తుండటం ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్స్" అని పేర్కొన్నారు.