Srinath Maganti Impress As Karthik ENE Repeat: తెలుగు యువతకు ఆల్‌టైమ్ ఫేవరెట్ కల్ట్ కామెడీ చిత్రాల్లో 'ఈ నగరానికి ఏమైంది' (ENE) స్థానం ప్రత్యేకం. హైదరాబాద్ వీధుల్లో నలుగురు స్నేహితుల మధ్య సాగే ఆ సరదా ప్రయాణానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైంది 2' (ENE రిపీట్) ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.
సుశాంత్ రెడ్డి పోషించిన కార్తీక్ పాత్రలో

ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న వేళ, అందరి దృష్టి నటుడు శ్రీనాథ్ మాగంటిపై నిలిచింది. తొలి భాగంలో సుశాంత్ రెడ్డి పోషించిన 'కార్తీక్' పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సుశాంత్ స్థానంలో ఎంట్రీ.. తొలుత తీవ్ర విమర్శలు
వ్యక్తిగత కారణాలు, కుటుంబ వ్యాపారాలపై దృష్టి పెట్టాల్సి రావడంతో సుశాంత్ రెడ్డి ఈ సీక్వెల్ నుంచి తప్పుకున్నారు. దాంతో ఆ స్థానంలో శ్రీనాథ్ మాగంటిని ఎంపిక చేసినట్లు చిత్ర బృందం ప్రకటించినప్పుడు సినీ వర్గాలతో పాటు అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు.
తొలి భాగంలో కార్తీక్ పాత్రకు సుశాంత్‌తో యువత బాగా కనెక్ట్ అయ్యారు. అలాంటి ఐకానిక్ పాత్రను శ్రీనాథ్ మ్యాచ్ చేయగలడా అన్న అనుమానాలు బలంగా వినిపించాయి. సోషల్ మీడియాలోనూ విమర్శలు, ట్రోలింగ్ ఎదురయ్యాయి. ఏమాత్రం తేడా కొట్టినా శ్రీనాథ్ కెరీర్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్న సవాలు అది.
తొలి రోజు షూటింగ్‌లో బ్యాకప్ ప్లాన్
అయితే దర్శకుడు తరుణ్ భాస్కర్ లాంటి ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్‌తో పనిచేసే అవకాశాన్ని శ్రీనాథ్ వదులుకోలేదు. ఎంతో ఉత్సాహంతో సెట్స్‌లోకి అడుగుపెట్టారు. నిజానికి తొలి రోజు షూటింగ్ సమయంలో మేకర్స్ సైతం ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకున్నారు.
ఒకవేళ శ్రీనాథ్ ఆ పాత్రలో ఇమడలేకపోయినా, తమకు సంతృప్తి కలగకపోయినా మరో నటుడిని తీసుకుందామనే ఆలోచనతో చిత్ర బృందం ఉంది. ఈ విషయం అప్పట్లో శ్రీనాథ్‌కు తెలియదు. కానీ, కెమెరా ముందు నిలబడిన తొలి క్షణం నుంచే శ్రీనాథ్ తన నటనతో మాయ చేశారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమానులతో కూడిన గ్యాంగ్‌లో ఒకడిగా సునాయాసంగా కలిసిపోయారు.
శివాత్మికతో కెమిస్ట్రీ.. మారిన ట్రోలర్ల స్వరం
{{/usCountry}}ఒకవేళ శ్రీనాథ్ ఆ పాత్రలో ఇమడలేకపోయినా, తమకు సంతృప్తి కలగకపోయినా మరో నటుడిని తీసుకుందామనే ఆలోచనతో చిత్ర బృందం ఉంది. ఈ విషయం అప్పట్లో శ్రీనాథ్‌కు తెలియదు. కానీ, కెమెరా ముందు నిలబడిన తొలి క్షణం నుంచే శ్రీనాథ్ తన నటనతో మాయ చేశారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమానులతో కూడిన గ్యాంగ్‌లో ఒకడిగా సునాయాసంగా కలిసిపోయారు.
శివాత్మికతో కెమిస్ట్రీ.. మారిన ట్రోలర్ల స్వరం
{{/usCountry}}సినిమాలో శ్రీనాథ్, నటి శివాత్మిక రాజశేఖర్ మధ్య నడిచే ట్రాక్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు సహజంగా పండటంతో థియేటర్లలో మంచి స్పందన వస్తోంది. సినిమా విడుదలకు ముందు తనపై వచ్చిన సందేహాలన్నింటినీ శ్రీనాథ్ తన నటనతో పటాపంచలు చేశారు. ఒకప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు కార్తీక్ పాత్రకు శ్రీనాథ్ పూర్తి న్యాయం చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ అద్భుతమైన స్పందనపై శ్రీనాథ్ మాగంటి భావోద్వేగానికి లోనయ్యారు. "నా నటనతో సంతృప్తి చెందకపోతే కార్తీక్ పాత్ర కోసం మరొక నటుడిని తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావించారు. కానీ ఈ రోజు సినిమా విడుదలైంది. నేను అందులో భాగమయ్యాను. అదే నాకు లభించిన అతిపెద్ద గుర్తింపు" అని శ్రీనాథ్ పేర్కొన్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి లీడ్ రోల్స్ వైపు అడుగులు
గతంలో 'హిట్', 'యానిమల్', లక్కీ భాస్కర్ లాంటి భారీ చిత్రాల్లో సహాయ నటుడిగా నటించి శ్రీనాథ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' విజయంతో ఆయనపై బాధ్యత మరింత పెరిగింది.
స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే, ఇకపై సోలో హీరోగా లీడ్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు శ్రీనాథ్ సిద్ధమవుతున్నారు. సరైన అవకాశం దొరికితే ఎలాంటి పాత్రనైనా సునాయాసంగా పోషించగలనని ఈ సినిమాతో ఆయన నిరూపించుకున్నారు.
ABOUT THE AUTHOR
చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.