Maa Ramudu Andarivadu Pre Release Event Suman Speech: అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు.
మా రాముడు అందరివాడు నటీనటులు

అలాగే, మా రాముడు అందరివాడు సినిమాలో సీనియర్ హీరో, నటుడు సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు.
సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా మా రాముడు అందరివాడు సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో మా రాముడు అందరివాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
మా రాముడు అందరివాడు ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ మా రాముడు అందరివాడు ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ ఈ చిత్రం ఘన విజయం సాధించి మూవీ టీమ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.
ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ .. "సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగా చేశారు" అని చెప్పారు.
మంచి మెసేజ్ ఇచ్చే పాత్ర
"ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత లక్ష్మణ్ గారు ఇందులో విలన్‌గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు" అని సీనియర్ నటుడు సుమన్ తెలిపారు.
{{/usCountry}}"ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత లక్ష్మణ్ గారు ఇందులో విలన్‌గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు" అని సీనియర్ నటుడు సుమన్ తెలిపారు.
{{/usCountry}}"ఇది చాలా మంచి కథ. ట్విస్టులు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు" అని సుమన్ ఆకాంక్షించారు.
20 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసి
నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ.. "మా సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్ పాత్ర పోషించా. ఫస్టాఫ్‌లో వైల్డ్ విలన్‌గా కనిపిస్తా. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసి అరాచకంగా ఆ ఊరిని ఎలా కంట్రోల్ పెట్టుకుంటాడనేది నా క్యారెక్టర్" అని పేర్కొన్నారు.
"సుమన్ గారు ఇందులో సీఎంగా నటించారు. మా మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ అలరిస్తాయి. మారెడుమిల్లి ఫారెస్ట్‌లో షూటింగ్ చేశాం. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మనీష్ కుమార్ మ్యూజిక్ అందించిన నాలుగు పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి" అని వెల్లడించారు ప్రొడ్యూసర్ అనుమల లక్ష్మణరావు.
ఎవరు పట్టించుకోలేదు
"డీవోపీ వినోద్, కుమార్ సహా టీమ్ అంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారిని సపోర్ట్ చేయాలని కోరాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ట్రైలర్ చూసి వారే బాగుందని చెప్పారు. 200పైగా థియేటర్స్‌లో సెప్టెంబర్ 4న ప్రేక్షకులముందుకు రానున్న మా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నా" అని కోరారు నిర్మాత లక్ష్మణరావు.