...
...
Next Story

Hyderabad : డ్రగ్స్‌ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి - యువతకు హీరో వెంకటేశ్ పిలుపు

Hyderabad Walks for Nasha Mukt Bharat : 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' కార్యక్రమంలో నటుడు వెంకటేష్ పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత భారత లక్ష్యానికి మద్దతు ఇవ్వాలని, బాధితులకు అండగా నిలవాలని యువతకు పిలుపునిచ్చారు.

Published on: Nov 25, 2026, 12:52:06 IST
Advertisement

Hyderabad Walks for Nasha Mukt Bharat : డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ పిలుపునిచ్చారు. 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన…. డ్రగ్స్‌కు నో చెప్పి జీవితానికి ఎస్ చెప్పాలని యువతకు సూచించారు.

ప్రతి ఒక్కరిపై బాధ్యత - హీరో వెంకటేశ్

ర్యాలీలో హీరో విక్టరీ వెంకటేశ్
ర్యాలీలో హీరో విక్టరీ వెంకటేశ్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి యువతే అతిపెద్ద బలమని వెంకటేష్ స్పష్టం చేశారు. యువత ముందుకు సాగేందుకు ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని గుర్తుచేశారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని కలలను, లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. అదే సమయంలో ప్రమాదకరమైన డ్రగ్స్ వ్యసనాల నుంచి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.

2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేపట్టిన ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని వెంకటేష్ కోరారు. ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఇంతమందిని ఒకే లక్ష్యం కోసం ఏకతాటిపైకి తీసుకురావడానికి ఎంతో నిబద్ధత, నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు.

డ్రగ్స్ వాడకం వల్ల యువత తమ ఆరోగ్యాన్ని, చదువును, ఉజ్వల భవిష్యత్తును చేజేతులా కోల్పోతున్నారని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యసనం బాధితుల కుటుంబాలు, స్నేహితులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని సమాజం దూరం పెట్టకూడదని, వారికి అండగా నిలిచి వ్యసనం నుంచి బయటపడేందుకు చేతనైన సహాయం చేయాలని సూచించారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks