PM Modi: సన్నీ డియోల్ ఐకానిక్ వార్ మూవీ 'బోర్డర్' ఫేమ్ సీనియర్ బాలీవుడ్ నటుడు సుదేష్ బెర్రీ (Sudesh Berry) ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ప్రధాని మోదీని సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారంగా అభివర్ణించిన ఆయన, అవకాశం వస్తే మోదీ పాదాలు కడిగి ఆ నీళ్లను తాగడానికి కూడా వెనుకాడనని స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
"మోదీజీని దేవుడిలా గౌరవిస్తా".. సుదేష్ బెర్రీ కామెంట్స్

'అకంపనీ అక్కీ' (Accompany Akki) యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుదేష్ బెర్రీ.. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆకాశానికెత్తేశారు. గతంలో తాను సొంత తల్లి పాదాలు కడిగి గౌరవించుకున్నానని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
"నాకు మోదీజీతో వ్యక్తిగత పరిచయం లేదు, ఆయనను ఎప్పుడూ కలవలేదు. కానీ మనం దేవుడిని చూడకపోయినా ఎలా ఆరాధిస్తామో, నేను మోదీజీని అలాగే గౌరవిస్తాను. నాకు అవకాశం వస్తే ఆయన పాదాలు కడిగి ఆ నీళ్లు తాగుతాను" అని సుదేష్ బెర్రీ వ్యాఖ్యానించారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఒక మనిషిగా ఆయనకు ఇస్తున్న గౌరవమని పేర్కొన్నారు.
"జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే ఏం రాదు!"
ఈ ఇంటర్వ్యూలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్న సీజేపీ (Cockroach Janta Party) కార్యకర్తలపై సుదేష్ బెర్రీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి పార్టీల పేర్లు వినడానికే అసహ్యంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. సీజేపీలోని వాళ్లందరూ లోఫర్లు, ఎందుకూ పనికి రాని వారని అనడం గమనార్హం.
"సమాజానికి మంచి చేయాలనుకుంటే పిల్లల కోసం పార్కులు కట్టించండి, వృద్ధాశ్రమాలు కట్టించండి లేదా రోగులకు వైద్యం అందించండి. అంతేగానీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తూ కూర్చుంటే దేశానికి ఒరిగేదేమీ లేదు" అని ఆయన ఘాటుగా విమర్శించారు.
దేశంలో ఇప్పటికే 'రామరాజ్యం' వచ్చేసింది!
{{/usCountry}}"సమాజానికి మంచి చేయాలనుకుంటే పిల్లల కోసం పార్కులు కట్టించండి, వృద్ధాశ్రమాలు కట్టించండి లేదా రోగులకు వైద్యం అందించండి. అంతేగానీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తూ కూర్చుంటే దేశానికి ఒరిగేదేమీ లేదు" అని ఆయన ఘాటుగా విమర్శించారు.
దేశంలో ఇప్పటికే 'రామరాజ్యం' వచ్చేసింది!
{{/usCountry}}ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించిందని, దేశంలో ఇప్పటికే రామరాజ్యం మొదలైందని ఆయన అన్నారు. దీనిని కేవలం అనుభవపూర్వకంగానే తెలుసుకోగలమని, మాటల్లో చెప్పలేమని తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశ ప్రగతి కోసం అద్భుతంగా పనిచేస్తున్నారని సుదేష్ బెర్రీ కొనియాడారు.
'బోర్డర్' నుంచి బుల్లితెర వరకు సుదేష్ బెర్రీ ప్రస్థానం
1990ల కాలంలో బాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సుదేష్ బెర్రీ.. 1997లో వచ్చిన 'బోర్డర్' సినిమాలో సుబేదార్ మధురా సింగ్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బుల్లితెరపై 'మహాభారత్', 'శక్తిమాన్' వంటి ఐకానిక్ సీరియల్స్‌తో పాటు పలు హిందీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.
ఇప్పుడు రాజకీయ అంశాలపై, ప్రధాని మోదీపై ఆయన చేసిన బోల్డ్ కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.