Avika Gor: తెలుగు హీరోయిన్‌కు 104 డిగ్రీల జ్వరం- 2 రోజుల షూటింగ్ ఒక్కరోజులోనే పూర్తి- చివరికీ ఏమైందో చెప్పి భర్త ఎమోషనల్

Avika Gor Hospitalised Husband Milind Emotional: చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ఫేమ్, తెలుగు హీరోయిన్ అవికా గోర్ 104 డిగ్రీల జ్వరం ఉండగా కూడా యాడ్ షూటింగ్ చేసిందని ఆమె భర్త మిలింద్ చంద్వానీ తెలిపారు. నిర్మాతలకు నష్టం రాకూడదని అలా చేసిందని, చివరికి ఏమైందో చెబుతూ ఎమోషనల్ అయ్యారు అవికా గోర్ భర్త.

Published on: Aug 8, 2026, 12:11:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Avika Gor Hospitalised Husband Milind Emotional: లిక వధూ తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో యావత్ భారతీయ ప్రేక్షకులకు సుపరిచితమై, 'ఉయ్యాల జంపాల' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు అవికా గోర్. తాజాగా తీవ్ర అనారోగ్యంతో అవికా గోర్ ఆసుపత్రి పాలయ్యారు.

తెలుగు హీరోయిన్‌కు 104 డిగ్రీల జ్వరం- 2 రోజుల షూటింగ్ ఒక్కరోజులోనే పూర్తి- చివరికీ ఏమైందో చెప్పి భర్త ఎమోషనల్
తెలుగు హీరోయిన్‌కు 104 డిగ్రీల జ్వరం- 2 రోజుల షూటింగ్ ఒక్కరోజులోనే పూర్తి- చివరికీ ఏమైందో చెప్పి భర్త ఎమోషనల్

ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స

గత ఐదు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న అవికాకు పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని తేలింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని అవికా గోర్ భర్త మిలింద్ చాంద్వానీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ప్రొడ్యూసర్ల కోసం త్యాగం!

గత కొన్ని రోజులుగా అవికా గోర్ 103 నుంచి 104 డిగ్రీల తీవ్ర జ్వరంతో అల్లాడిపోతున్నప్పటికీ, ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆమె భర్త మిలింద్ తెలిపారు.

నిర్మాతల డబ్బు వృథా అవుతుందని

"గత ఐదు రోజులుగా ఆమెకు 104 డిగ్రీల జ్వరం ఉంది. రెండు రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉంటే, ఆ జ్వరంతోనే వెళ్లి నటించింది. ఆమె చూపించిన ప్రతిభకు రెండు రోజుల షూటింగ్ ఒక్క రోజులోనే పూర్తయింది. షూటింగ్ వాయిదా వేస్తే నిర్మాతల డబ్బు, సమయం వృథా అవుతాయని తనే స్వయంగా వెళ్లి యాడ్ షూట్‌లో కూడా పాల్గొంది" అని మిలింద్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో భావోద్వేగానికి గురయ్యారు.

నిలబడే పరిస్థితిలో కూడా లేదని

ఢిల్లీలో జరిగిన యాడ్ షూట్ సమయంలో అవికా గోర్ కనీసం సరిగ్గా నిలబడే పరిస్థితిలో కూడా లేదని, కేవలం ఓఆర్ఎస్ (ORS) తాగుతూ షూటింగ్ పూర్తి చేసిందని ఆమె టీమ్ సభ్యులు వెల్లడించారు. ముంబై తిరిగి వచ్చాక బ్లడ్ రిపోర్టులు చూడగా డెంగ్యూ అని నిర్ధారణ కావడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.

హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం..

అవికా గోర్‌కు మన తెలుగు రాష్ట్రాలతో, ప్రత్యేకించి హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేయడమే కాకుండా, తన భర్త మిలింద్ చాంద్వానీని ఆమె మొదటిసారి కలిసింద కూడా ఇక్కడే. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తూ దగ్గరయ్యారు.

ఓటీటీ రియాలిటీ షోలో

2020లో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట, గతేడాది జూన్ 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2025లో ఒక ఓటీటీ రియాలిటీ షో సెట్స్‌పై వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

త్వరగా కోలుకోవాలంటూ

తమ అభిమాన నటి డెంగ్యూతో ఆసుపత్రిలో చేరిందనే వార్త తెలిసిన వెంటనే బుల్లితెర, వెండితెర ప్రముఖులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. నటి అవికా గోర్ ఏ వ్యాధితో ఆసుపత్రిలో చేరారు?

అవికా గోర్ తీవ్రమైన డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ముంబైలోని ఆసుపత్రిలో చేరారు.

2. అవికా గోర్ భర్త ఎవరు?

అవికా గోర్ భర్త పేరు మిలింద్ చాంద్వానీ. వీరిద్దరూ హైదరాబాద్‌లో మొదటిసారి కలుసుకున్నారు.

3. అవికా గోర్ తెలుగులో నటించిన మొదటి సినిమా ఏది?

రాజ్ తరుణ్ సరసన నటించిన 'ఉయ్యాల జంపాల' సినిమాతో అవికా గోర్ టాలీవుడ్‌లోకి కథానాయికగా అడుగుపెట్టారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More