...
...
Next Story

యాక్షన్ బ్లాక్‌తో అదరగొట్టిన హీరోయిన్- క్వీన్ ఆఫ్ మార్క్‌గా దీప్శిక చంద్రన్- ఇంతకీ ఎవరీ బ్యూటి?

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది బ్యూటిపుల్ దీప్శిక చంద్రన్. కన్నడ సూపర్ హిట్ ఫిల్మ్ మార్క్‌లో నటించి అందరి ప్రశంసలు అందుకుంటున్న దీప్శిక క్వీన్ మార్క్‌గా పిలవబడుతోంది. ఈ నేపథ్యంలో దీప్శిక చంద్రన్ బయో, ఫొటోలు తదితర అంశాలపై లుక్కేద్దాం.

Published on: Jan 3, 2026, 18:34:40 IST
Advertisement

కన్నడ యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్క్ మూవీ కర్ణాటక అంతటా థియేటర్లలో అదరగొడుతోంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే, ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న మార్క్ సినిమాలో హీరోయిన్ దీప్శిక చంద్రన్ నటన హైలెట్స్‌లో భాగమైంది.

యాక్షన్ బ్లాక్‌తో

యాక్షన్ బ్లాక్‌తో అదరగొట్టిన హీరోయిన్- క్వీన్ ఆఫ్ మార్క్‌గా దీప్శిక చంద్రన్- ఇంతకీ ఎవరీ బ్యూటి?
యాక్షన్ బ్లాక్‌తో అదరగొట్టిన హీరోయిన్- క్వీన్ ఆఫ్ మార్క్‌గా దీప్శిక చంద్రన్- ఇంతకీ ఎవరీ బ్యూటి?

మార్క్ చిత్రంలో దీప్శిక చంద్రన్ నటన ఈలలు, చప్పట్లు కొట్టేలా చేస్తోందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, మార్క్ మూవీలో హీరోయిన్ దీప్శిక చంద్రన్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులందరిని అలరించింది. ముఖ్యంగా దీప్శిక యాక్షన్ బ్లాక్‌తో అదరగొట్టింది. దాంతో ఆమె చేసిన యాక్షన్ ఎపిసోడ్‌కు సూపర్ క్రేజ్ వస్తోంది.

క్వీన్ ఆఫ్ మార్క్ అంటూ

ఈ నేపథ్యంలో దీప్శిక చంద్రన్‌ను "మార్క్ క్వీన్","క్వీన్ ఆఫ్ మార్క్" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియెన్స్, నెటిజన్స్. దీంతో ఇంటర్నెట్‌లో దీప్శిక చంద్రన్ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఫలితంగా ఇవన్నీ మార్క్ సినిమాకు ప్లస్‌గా మారాయి.

మైల్ స్టోన్‌గా నిలిచినందుకు

థియేటర్ స్పందన, పాజిటివ్ మౌత్ టాక్ మార్క్ సినిమాను కన్నడ మార్కెట్‌లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిపాయి. అలాగే, దీప్శిక చంద్రన్ పాత్ర సినిమాలో బలంగా నిలిచింది. కర్ణాటక అంతటా మార్క్ తన విజయవంతమైన ప్రదర్శనను కొనసాగిస్తుండగా దీప్శిక చంద్రన్‌పై చూపిస్తున్న ఆడియెన్స్ ఆదరణ ఆమె కెరీర్‌లో ఒక మైల్ స్టోన్‌గా నిలిచిందని ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది.

దీప్శిక చంద్రన్ గ్లామర్ షో

ఇదిలా ఉంటే, మార్క్‌లో నటన, యాక్షన్‌తో ఆకట్టుకున్న దీప్శిక చంద్రన్ గ్లామర్ షోతో కూడా అట్రాక్ట్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోషూట్లతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది ఈ కేరళ కుట్టి.

కళ్లతోనే భావాలు

ఇక తాజాగా దీప్శిక చంద్రన్ షేర్ చేసిన ఫోటోల్లో తన అందచందాలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. "ఆ కళ్లలో ఏదో మ్యాజిక్ ఉంది" అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks