టాలీవుడ్‌లో ‘యమదొంగ’, 'కింగ్' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ మమతా మోహన్‌దాస్ (Mamta Mohandas). క్యాన్సర్‌ను జయించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె.. తాజాగా తన ప్రేమ జీవితం, పెళ్లి, రిలేషన్షిప్స్ గురించి సంచలన విషయాలు వెల్లడించింది. జోస్ ఆలుక్కాస్ ఆధ్వర్యంలో నటి సుహాసిని (Suhasini) హోస్ట్ చేస్తున్న పాడ్‌కాస్ట్‌లో ఆమె తన గతాన్ని గుర్తుచేసుకుంది.
"ఎంగేజ్మెంట్ విషయం దాచాడు.."

తన క్యాన్సర్ చికిత్స తర్వాత, పెళ్లికి ముందు తాను ఇద్దరు వ్యక్తులతో డేటింగ్ చేశానని మమతా మోహన్‌దాస్ తెలిపింది. "నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడితో డేటింగ్ చేశాను. అతను నన్ను డేట్‌కి అడిగినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా అమ్మ పర్మిషన్ తీసుకుని మరీ వెళ్లాను. కానీ అప్పటికే అతనికి ఎంగేజ్మెంట్ అయిపోయిన విషయం నాకు తెలియదు. ఒక నెల తర్వాత వాళ్ళ అన్నయ్య ద్వారా నాకు ఆ నిజం తెలిసింది. అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి గుండె పగిలింది. నన్ను ఎందుకు మోసం చేశాడో అర్థం కాలేదు" అని మమతా ఆవేదన వ్యక్తం చేసింది.
క్యాన్సర్ తర్వాత ఆత్రుతలో..
తనకు రిలేషన్షిప్స్, డేటింగ్ గురించి పెద్దగా అవగాహన లేదని మమతా చెప్పింది. "నాకు క్యాన్సర్ అని తెలిసిన మొదటి ఏడాది తర్వాతే నేను పెళ్లి చేసుకున్నాను. ఒక మహిళగా నాకున్న అంచనాలను, కోరికలను నెరవేర్చుకోవాలనే ఆత్రుతలో తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాను. నా జబ్బు కారణంగా పార్ట్‌నర్స్ నన్ను సీరియస్‌గా తీసుకుంటారని అమాయకంగా నమ్మాను. కానీ అది నా పొరపాటు" అని ఆమె వివరించింది. మరో వ్యక్తితో కూడా డేటింగ్ చేశానని, కానీ అతను ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు కాదని తెలిపింది.
మమత పెళ్లి - విడాకులు..
2011లో మమతా.. బహ్రెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎంతోకాలం నిలవలేదు. కేవలం ఆరు నెలలకే మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 2012లో విడాకులు తీసుకున్నారు. "నేను చాలా చిన్న వయసులో, అనుభవం లేకపోవడం వల్లే ఇలా జరిగిందేమో" అని ఆమె అభిప్రాయపడింది.
{{/usCountry}}2011లో మమతా.. బహ్రెయిన్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎంతోకాలం నిలవలేదు. కేవలం ఆరు నెలలకే మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 2012లో విడాకులు తీసుకున్నారు. "నేను చాలా చిన్న వయసులో, అనుభవం లేకపోవడం వల్లే ఇలా జరిగిందేమో" అని ఆమె అభిప్రాయపడింది.
{{/usCountry}}2005లో 'మయూఖం' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన మమతా.. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. 2010లో హాడ్జికిన్ లింఫోమా (Hodgkin lymphoma) క్యాన్సర్ బారిన పడ్డ ఆమె.. దాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. ఇటీవల విజయ్ సేతుపతి 'మహారాజా' సినిమాలో కనిపించిన ఆమె.. త్వరలో 'మై డియర్ సిస్టర్' అనే సినిమాలో కనిపించనుంది.