...
...
Next Story

Riva Arora: గుమ్మం దగ్గర మొదలై, లిఫ్ట్ వరకు మానసిక వేధింపులు- దుర్భాషలాడిన డెలివరీ ఏజెంట్‌పై ఉరి నటి రివా అరోరా ఫిర్యాదు

Riva Arora Alleges Harassment Blinkit Delivery Agent: గ్రాసరీ యాప్ ద్వారా ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చిన డెలివరీ ఏజెంట్ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అసభ్య పదజాలంతో వేధించాడని బ్యూటిఫుల్ రివా అరోరా ఆరోపించారు. ఈ ఘటనపై ఆమె ముంబై పోలీసులను ఆశ్రయించగా, వారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నారు.

Published on: May 8, 2026, 11:19:30 IST
Advertisement

Riva Arora Alleges Harassment Blinkit Delivery Agent: బాలీవుడ్‌లో 'ఉరి', 'గుంజన్ సక్సేనా' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి రివా అరోరాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఏప్రిల్ 26న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో నిత్యావసర సరుకులు అందించే 'బ్లింకిట్' (Blinkit) యాప్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి వింతగా ప్రవర్తించాడట. తొలుత డెలివరీ ఇచ్చేటప్పుడే అతని మాట తీరు బాగోలేదని, తన తల్లి నిషా అరోరా వారించినా అతడు పట్టించుకోలేదని రివా పేర్కొన్నారు.

గుమ్మం దగ్గర మొదలై.. లిఫ్ట్ వరకు వేధింపులు

గుమ్మం దగ్గర మొదలై, లిఫ్ట్ వరకు మానసిక వేధింపులు- దుర్భాషలాడిన డెలివరీ ఏజెంట్‌పై ఉరి నటి రివా అరోరా ఫిర్యాదు
గుమ్మం దగ్గర మొదలై, లిఫ్ట్ వరకు మానసిక వేధింపులు- దుర్భాషలాడిన డెలివరీ ఏజెంట్‌పై ఉరి నటి రివా అరోరా ఫిర్యాదు

విషయం అక్కడితో ఆగకుండా, ఆ ఏజెంట్ వెనుతిరిగి వెళ్తున్న సమయంలో లిఫ్ట్ దగ్గర రివా సోదరి ముస్కాన్ అరోరాకు ఎదురయ్యాడు. అక్కడ కూడా అతడు రెచ్చగొట్టేలా, అసభ్యకరమైన భాషలో మాట్లాడటంతో పరిస్థితి విషమించింది. ఎటువంటి కారణం లేకపోయినా గుమ్మం దగ్గర మొదలై లిఫ్ట్ వరకు దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు ఆ వ్యక్తి దుర్భాషలాడి తమను మానసిక వేధింపులకు గురిచేశాడని రివా అరోరా ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల రంగప్రవేశం.. అడ్డుకున్న కుటుంబ సభ్యులు

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా, రివా కుటుంబ సభ్యులు కిందకు వెళ్లి అతడిని అడ్డుకున్నారు. వెంటనే ముంబై పోలీసులకు సమాచారం అందించారు. "పోలీసులు చాలా వేగంగా స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చట్టపరమైన ప్రక్రియలో ఉంది" అని రివా అరోరా వెల్లడించారు. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కూడా తమకు అండగా నిలిచారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కేవలం పోలీసులకే కాకుండా, సదరు డెలివరీ సంస్థ 'బ్లింకిట్'కు కూడా అధికారికంగా ఫిర్యాదు చేశామని, వారి నుంచి సరైన స్పందన కోసం వేచి చూస్తున్నామని రివా అరోరా తెలిపారు. ఈ ఘటనపై వివరణ కోరగా సదరు సంస్థ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.

కంపెనీల బాధ్యతపై రివా అరోరా గళం

కేవలం వస్తువులను చేరవేయడమే కాకుండా, కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలనే అంశంపై వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. "గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. చిన్న విషయమే కదా అని అసభ్య ప్రవర్తనను భరించకూడదు. మనం గొంతు ఎత్తినప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది" అని రివా అరోరా పేర్కొన్నారు.

తల్లి నిషా, సోదరి ముస్కాన్‌తో నటి రివా అరోరా

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. రివా అరోరా ఎదుర్కొన్న సమస్య ఏమిటి?

ఓ డెలివరీ యాప్ ఏజెంట్ తన ఇంటికి వచ్చి అసభ్య పదజాలంతో దూషించాడని, దాదాపు 40 నిమిషాల పాటు తమ కుటుంబాన్ని వేధించాడని రీవా ఆరోపించారు.

2. ఈ ఘటనపై పోలీసులు స్పందించారా?

అవును, ముంబై పోలీసులు సమాచారం అందిన వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు చేపట్టారు.

3. ఏ డెలివరీ సంస్థపై ఫిర్యాదు చేశారు?

రివా అరోరా 'బ్లింకిట్' (Blinkit) సంస్థకు మరియు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

4. రివా అరోరా ఏ సినిమాల్లో నటించారు?

ఆమె 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్', 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' వంటి హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe