Shakeela: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని తన క్రేజ్‌తో ఊపేసి, శృంగార తారగా పేరు తెచ్చుకున్న నటి నటి షకీలా ఇటీవల మెడ సంబంధిత సమస్యతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో బ్లాగ్ (Vlog) పోస్ట్ చేస్తూ తనకు ఎదురైన భయానక అనుభవాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె మెడకు 'నెక్ కాలర్' ధరించి ఉన్నారు.
షకీలాకు ఎందుకు ఇలా అయింది?

షకీలాకు ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎక్కువగా ఫోన్ వాడటమే. ‘‘ప్రతి రోజూ మంచంపై ఒకపక్కకి ఒరిగి పడుకుని వరుసగా 4 గంటల పాటు మొబైల్‌లో గేమ్‌లు ఆడేదాన్ని. మధ్యలో టీ లేదా కాఫీ తాగడానికి మాత్రమే లేచేదాన్ని. గేమ్ పూర్తయ్యాక యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో గంటల తరబడి రీల్స్ చూస్తూ గడిపేదాన్ని’’అని షకీలా తన వీడియోలో వెల్లడించారు.
నరాలు దెబ్బతిని
‘‘సరైన పొజిషన్‌లో కూర్చోకుండా, పడుకుని గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల మెడలోని ప్రధాన నరాలపై తీవ్రమైన ఒత్తిడిపడింది. ఆ నరాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్లాల్సి వచ్చింది’’ అని షకీలా తెలిపారు.
రూ. 3 లక్షలు గోవిందా
ఈ వీడియోలో షకీలా తన పరిస్థితిపై స్వయంగా సెల్ఫ్ ట్రోలింగ్ చేసుకుంటూనే, వ్యూయర్స్ కు అత్యంత కీలకమైన హెచ్చరికలు చేశారు. సర్జరీ తర్వాత మంచం మీద నుంచి లేవడానికి, భోజనం చేయడానికి కూడా ఒకరి సాయం అవసరమవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"ఫోన్ అనేది చాలా ఉపయోగకరమైన వస్తువే, కానీ దాన్ని అవసరానికి మించి వాడితే నాలాంటి పరిస్థితే వస్తుంది. నా ఆపరేషన్‌కి ఏకంగా రూ.3 లక్షలు ఖర్చయ్యాయి. డబ్బులు పోవడమే కాకుండా తట్టుకోలేని నరకం అనుభవించాల్సి వస్తుంది" అని షకీలా పేర్కొన్నారు.
షకీలా రిక్వెస్ట్
చిన్న పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇవ్వవద్దని తల్లిదండ్రులను షకీలా రిక్వెస్ట్ చేశారు. "అవసరమైన విషయాల కోసమే ఫోన్ వాడండి. పనికిరాని వీడియోలు.. ఆఖరికి నా వీడియోలు కూడా చూడకండి. ఉపయోగపడే కంటెంట్ మాత్రమే చూడండి" అని షకీలా హితవు పలికారు.
కుదిపేసిన గ్లామర్ క్వీన్
{{/usCountry}}చిన్న పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇవ్వవద్దని తల్లిదండ్రులను షకీలా రిక్వెస్ట్ చేశారు. "అవసరమైన విషయాల కోసమే ఫోన్ వాడండి. పనికిరాని వీడియోలు.. ఆఖరికి నా వీడియోలు కూడా చూడకండి. ఉపయోగపడే కంటెంట్ మాత్రమే చూడండి" అని షకీలా హితవు పలికారు.
కుదిపేసిన గ్లామర్ క్వీన్
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సమీపంలో పుట్టి పెరిగిన షకీలా (Shakeela C Begum) ప్రస్థానం అత్యంత విచిత్రమైనది. సాఫ్ట్‌కోర్ అడల్ట్ సినిమాల ద్వారా ఇండియన్ పాప్ కల్చర్‌లో ఒక సంచలనంగా మారారు.
రూ.12 లక్షల బడ్జెట్.. రూ.4 కోట్ల కలెక్షన్
2000వ సంవత్సరంలో ఆర్‌జే ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షకీలా 'కిన్నారతుంబికల్' (Kinnarathumbikal) చిత్రం హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం రూ.12 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.4 కోట్ల వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. కేరళలో షకీలా వేవ్ ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది.
స్టార్ హీరోలకే పోటీ
ఆ సమయంలో మలయాళ చిత్రసీమలో కంటెంట్ కొరత ఉన్నప్పుడు, టాప్ హీరోల సినిమాల కంటే షకీలా నటించిన చిత్రాలే ఎక్కువ వసూళ్లను రాబట్టేవి.
ఆ తర్వాత ఆమె మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి మారి మోహన్‌లాల్ 'చోటా ముంబై', పృథ్వీరాజ్ 'తేజాభాయ్ అండ్ ఫ్యామిలీ' చిత్రాల్లో నటించారు. తెలుగులో 'తొట్టి గ్యాంగ్', 'జయం', 'బంగారం' వంటి హిట్ చిత్రాలతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు.