OTT Today: ఓటీటీలోకి ఇవాళ 8 సినిమాలు- 6 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 5- తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- క్రైమ్ టు అడల్ట్ కామెడీ!
OTT Movies Today Release: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు విడుదల అయ్యాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఏకంగా 6 సినిమాలు ఉంటే అందులో ఒక్క ఓటీటీలోనే 5 మూవీస్ ఉండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, మనోరమ మ్యాక్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో లుక్కేద్దాం.
Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి అడల్ట్ కామెడీ సెటైరికల్ డ్రామా వరకు విభిన్న జోనర్లలో సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, మనోరమ మ్యాక్స్ వంటి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలోనే ఈ 8 సినిమాలు విడుదల అయ్యాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
కర (తెలుగు డబ్బింగ్ తమిళ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 28
ఎమి మార్టినజ్: ది కిడ్ వూ స్టాప్స్ టైమ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ మూవీ)- మే 28
మర్డర్ మైండ్‌ఫుల్లీ సీజన్ 2 (జర్మన్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 28
ది ఫోర్ సీజన్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 28
డెడ్ మ్యాన్స్ వైర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- మే 28
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
లీడర్ 2026 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 28
ఆహా ఓటీటీ
కాకమ్మ కథలు సీజన్ 3 (తెలుగు సెలబ్రిటీ టాక్ షో)- మే 28
మనోరమ మ్యాక్స్ ఓటీటీ
స్పా (మలయాళం అడల్ట్ కామెడీ సోషల్ సెటైర్ డ్రామా మూవీ)- మే 28
ఓటీటీలోకి ఇవాళ 8 సినిమాలు- 6 స్పెషల్
ఇలా ఇవాళ (మే 28) 8 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో ధనుష్-మమితా బైజు కర, పాయల్ రాజ్‌పుత్ లీడర్, హాట్ బ్యూటీ తేజస్విని మదివాడ హోస్ట్‌గా చేస్తున్న కాకమ్మ కథలు, అడల్ట్ కామెడీ డ్రామా స్పా, డెడ్ మ్యాన్స్ వైర్, ది ఫోర్ సీజన్స్ సీజన్ 2తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా ఏకంగా 6 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
తెలుగులో 4 ఇంట్రెస్టింగ్
అలాగే, వీటన్నింటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 4 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, ఈ సినిమాలన్నింటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 5 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవడం విశేషం.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఈ వారం తెలుగు డబ్బింగ్‌తో విడుదలైన ఓటీటీ సినిమాలు ఏవి?
మే 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'కర', రొమాంటిక్ సిరీస్ 'ది ఫోర్ సీజన్స్ సీజన్ 2'.. అలాగే అమెజాన్ ప్రైమ్‌లో స్పై యాక్షన్ ఫిల్మ్ 'లీడర్ 2026' చిత్రాలు తెలుగు డబ్బింగ్ వెర్షన్లలో అందుబాటులోకి వచ్చాయి.
2. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ఏది?
ప్రముఖ ఫుట్‌బాల్ గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినజ్ జీవిత విశేషాలతో తెరకెక్కిన 'ఎమి మార్టినజ్: ది కిడ్ వూ స్టాప్స్ టైమ్' అనే బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
3. ఆహా (Aha) ఓటీటీలో ఈ వారం వచ్చిన కొత్త షో ఏది?
తెలుగు ప్రేక్షకులను అలరించే సెలబ్రిటీ టాక్ షో 'కాకమ్మ కథలు సీజన్ 3' సరికొత్త ఎపిసోడ్ మే 28 నుంచి ఆహా ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.
4. 'లీడర్ 2026' సినిమా ఏ ఓటీటీలో చూడవచ్చు?
తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన 'లీడర్ 2026' తెలుగు డబ్బింగ్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


