ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఎన్నో లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయని తాజాగా మరోసారి నిరూపితమైంది. ఈ టెక్నాలజీ దుర్వినియోగానికి తాను కూడా బాధితురాలినే అని నటి శ్రీలీల చెప్పింది. ఈ ఏఐ జనరేట్ చేసిన నాన్సెన్స్ ను సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి వేడుకుంటున్నట్లు ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
శ్రీలీల పోస్ట్ వైరల్

నటి శ్రీలీల బుధవారం (డిసెంబర్ 17) ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. టెక్నాలజీ దుర్వినియోగం వల్ల సెలబ్రిటీలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెబుతూ ఈ పోస్ట్ సాగింది. ఇందులో ఆమె తన అభిమానులను ఏఐ జనరేట్ చేసిన చెత్తను సపోర్ట్ చేయొద్దని కోరడం విశేషం.
“నేను రెండు చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను.. దయచేసి AI సృష్టించిన ఈ చెత్తను సపోర్ట్ చేయకండి. టెక్నాలజీని వాడుకోవడానికి, దుర్వినియోగం చేయడానికి చాలా తేడా ఉంది. సాంకేతికత అనేది జీవితాన్ని సులభం చేయడానికే తప్ప.. ఇలా సంక్లిష్టం చేయడానికి కాదని నా అభిప్రాయం" అని శ్రీలీల చెప్పింది.
"ప్రతి అమ్మాయి ఒకరికి కూతురే కదా.."
ఈ టెక్నాలజీ సాయంతో నటీమణుల పట్ల జరుగుతున్న దాడిని ఆమె తీవ్రంగా ఖండించింది. "ప్రతి అమ్మాయి ఒకరికి కూతురు, మనవరాలు, చెల్లి లేదా స్నేహితురాలు. కళనే వృత్తిగా ఎంచుకున్నంత మాత్రాన మాకు రక్షణ లేని వాతావరణం ఉండకూడదు. మేము కూడా ఆనందాన్ని పంచే ఇండస్ట్రీలో భద్రంగా ఉండాలని కోరుకుంటాం" అని శ్రీలీల ఎమోషనల్ అయింది.
"చాలా డిస్టర్బ్ అయ్యాను.."
షూటింగ్ బిజీలో ఉండటం వల్ల ఆన్లైన్లో ఏం జరుగుతుందో తనకు తెలియలేదని, శ్రేయోభిలాషులు చెప్పాకే తెలిసిందని ఆమె చెప్పింది. "నేను ఎప్పుడూ నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. కానీ ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. నా తోటి నటీమణులు కూడా ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. అందరి తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను.. దయచేసి మాకు అండగా నిలబడండి" అని ఆమె విజ్ఞప్తి చేసింది.
{{/usCountry}}షూటింగ్ బిజీలో ఉండటం వల్ల ఆన్లైన్లో ఏం జరుగుతుందో తనకు తెలియలేదని, శ్రేయోభిలాషులు చెప్పాకే తెలిసిందని ఆమె చెప్పింది. "నేను ఎప్పుడూ నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. కానీ ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. నా తోటి నటీమణులు కూడా ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. అందరి తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను.. దయచేసి మాకు అండగా నిలబడండి" అని ఆమె విజ్ఞప్తి చేసింది.
{{/usCountry}}ఇలాంటి పోస్టు చేయడం నిజానికి తనకు ఇబ్బంది కలిగించేదే అని, అయినా దీని వల్ల మార్పు వస్తుందన్న ఆశ తనకు ఉందని చెప్పింది. డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోల వల్ల ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలీల కూడా దాని బారిన పడటంతో ఆమె ఇలా తన ఆవేదనను పోస్ట్ ద్వారా పంచుకుంది.