చేతులు జోడించి వేడుకుంటున్నాను.. ఈ నాన్సెన్స్‌కు సపోర్ట్ చేయొద్దు: ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల ఆవేదన

టాలీవుడ్ నటి శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ లో ఎంతో ఆవేదనతో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తాను కూడా టెక్నాలజీ దుర్వినియోగం బారిన పడినట్లు చెబుతూ.. దీనిని ఎవరూ సపోర్ట్ చేయొద్దని ఆమె చేతులు జోడించి వేడుకుంది.

Published on: Dec 17, 2025, 16:32:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఎన్నో లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయని తాజాగా మరోసారి నిరూపితమైంది. ఈ టెక్నాలజీ దుర్వినియోగానికి తాను కూడా బాధితురాలినే అని నటి శ్రీలీల చెప్పింది. ఈ ఏఐ జనరేట్ చేసిన నాన్సెన్స్ ను సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి వేడుకుంటున్నట్లు ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

చేతులు జోడించి వేడుకుంటున్నాను.. ఈ నాన్సెన్స్‌కు సపోర్ట్ చేయొద్దు: ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల ఆవేదన
చేతులు జోడించి వేడుకుంటున్నాను.. ఈ నాన్సెన్స్‌కు సపోర్ట్ చేయొద్దు: ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల ఆవేదన

శ్రీలీల పోస్ట్ వైరల్

నటి శ్రీలీల బుధవారం (డిసెంబర్ 17) ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. టెక్నాలజీ దుర్వినియోగం వల్ల సెలబ్రిటీలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెబుతూ ఈ పోస్ట్ సాగింది. ఇందులో ఆమె తన అభిమానులను ఏఐ జనరేట్ చేసిన చెత్తను సపోర్ట్ చేయొద్దని కోరడం విశేషం.

“నేను రెండు చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను.. దయచేసి AI సృష్టించిన ఈ చెత్తను సపోర్ట్ చేయకండి. టెక్నాలజీని వాడుకోవడానికి, దుర్వినియోగం చేయడానికి చాలా తేడా ఉంది. సాంకేతికత అనేది జీవితాన్ని సులభం చేయడానికే తప్ప.. ఇలా సంక్లిష్టం చేయడానికి కాదని నా అభిప్రాయం" అని శ్రీలీల చెప్పింది.

"ప్రతి అమ్మాయి ఒకరికి కూతురే కదా.."

ఈ టెక్నాలజీ సాయంతో నటీమణుల పట్ల జరుగుతున్న దాడిని ఆమె తీవ్రంగా ఖండించింది. "ప్రతి అమ్మాయి ఒకరికి కూతురు, మనవరాలు, చెల్లి లేదా స్నేహితురాలు. కళనే వృత్తిగా ఎంచుకున్నంత మాత్రాన మాకు రక్షణ లేని వాతావరణం ఉండకూడదు. మేము కూడా ఆనందాన్ని పంచే ఇండస్ట్రీలో భద్రంగా ఉండాలని కోరుకుంటాం" అని శ్రీలీల ఎమోషనల్ అయింది.

"చాలా డిస్టర్బ్ అయ్యాను.."

షూటింగ్ బిజీలో ఉండటం వల్ల ఆన్‌లైన్‌లో ఏం జరుగుతుందో తనకు తెలియలేదని, శ్రేయోభిలాషులు చెప్పాకే తెలిసిందని ఆమె చెప్పింది. "నేను ఎప్పుడూ నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. కానీ ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. నా తోటి నటీమణులు కూడా ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. అందరి తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను.. దయచేసి మాకు అండగా నిలబడండి" అని ఆమె విజ్ఞప్తి చేసింది.

ఇలాంటి పోస్టు చేయడం నిజానికి తనకు ఇబ్బంది కలిగించేదే అని, అయినా దీని వల్ల మార్పు వస్తుందన్న ఆశ తనకు ఉందని చెప్పింది. డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోల వల్ల ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలీల కూడా దాని బారిన పడటంతో ఆమె ఇలా తన ఆవేదనను పోస్ట్ ద్వారా పంచుకుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More