Actress Sunainaa Against AI Misuse: సినీ రంగాన్ని, మహిళా నటీమణులను కృత్రిమ మేధ (AI) రూపంలో కొత్త తరహా ముప్పు తీవ్రంగా వేధిస్తోంది. ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోల బారిన పడి తీవ్ర మనోవేదనకు గురైన సంగతి తెలిసిందే.
సైబర్ వేధింపుల బారిన తెలుగు హీరోయిన్

తాజాగా ఈ క్రమంలోనే ప్రముఖ తెలుగు హీరోయిన్ సునైనా యెల్లా సైతం తీవ్రమైన సైబర్ వేధింపులకు గురయ్యారు. సోషల్ మీడియాలో తన రూపాన్ని దుర్వినియోగం చేస్తూ తయారు చేసిన ఒక అశ్లీల ఏఐ వీడియో వైరల్ కావడంపై ఆమె గట్టిగా స్పందించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసిన సునైనా తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సైబర్ క్రిమినల్స్ వైఖరిపై విరుచుకుపడ్డారు.
"మహిళల ఆత్మగౌరవంతో ఆటలాడకండి"
తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా రూపొందించిన ఈ నకిలీ వీడియోను చూసి తాను తీవ్రంగా అసహ్యించుకున్నానని సునైనా తెలిపారు. "స్త్రీల భద్రతకే ముప్పు పొంచి ఉన్న ఈ రోజుల్లో, కనీసం మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడాల్సి రావడం తీవ్రంగా కలచివేస్తోంది" అని సునైనా తన ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఏమాత్రం బాధ్యత లేకుండా ఒక మహిళ రూపాన్ని, అనుమతి లేకుండా ఈ రకంగా దుర్వినియోగం చేయడం వెనుక ఉన్న వ్యక్తుల తీరును సునైనా కడిగిపారేశారు. సంస్కారం లేని ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించకూడదని పిలుపునిచ్చారు.
న్యాయపోరాటానికి సిద్ధం – చట్టాల హెచ్చరిక
ఇటువంటి అసభ్యకరమైన వీడియోల తయారీ, ప్రచారం సాధారణమైన విషయం కాదని, ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సునైనా స్పష్టం చేశారు. "ఇది నా వ్యక్తిత్వానికి భంగం కలిగించే నేరం. భారతీయ సమాచార సాంకేతిక చట్టం (IT Act 2000), అలాగే భారతీయ న్యాయ సంహిత (BNS 2023) ప్రకారం ఇది తీవ్రమైన శిక్షార్హమైన నేరం" అని ఆమె హెచ్చరించారు.
{{/usCountry}}ఇటువంటి అసభ్యకరమైన వీడియోల తయారీ, ప్రచారం సాధారణమైన విషయం కాదని, ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సునైనా స్పష్టం చేశారు. "ఇది నా వ్యక్తిత్వానికి భంగం కలిగించే నేరం. భారతీయ సమాచార సాంకేతిక చట్టం (IT Act 2000), అలాగే భారతీయ న్యాయ సంహిత (BNS 2023) ప్రకారం ఇది తీవ్రమైన శిక్షార్హమైన నేరం" అని ఆమె హెచ్చరించారు.
{{/usCountry}}ఈ నేరానికి ఒడిగట్టిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సునైనా యెల్లా స్పష్టం చేశారు. ఇటువంటి మానసిక దాడులు తన మనశ్శాంతిని గానీ, ధైర్యాన్ని గానీ దెబ్బతీయలేవని ధీమా వ్యక్తం చేశారు.
ప్రేక్షకులకు, అభిమానులకు కీలక విజ్ఞప్తి
సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతుందో, దాన్ని చెడు మార్గంలో వాడే మానసిక వైకల్యం కూడా అంతే స్థాయిలో పెరుగుతోందని ఈ ఘటన నిరూపిస్తోంది. డిజిటల్ యుగంలో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
"ఎవరైనా ఒక వ్యక్తి స్వభావాన్ని లేదా గుర్తింపును దుర్వినియోగం చేసే కంటెంట్‌ను చూసినప్పుడు దాన్ని చూడకండి, ఇతరులకు షేర్ చేయకండి. మీ కళ్లముందు ఇటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు గళమెత్తండి" అని సునైనా నేటి తరం నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.
సునైనా తెలుగు, తమిళ సినిమాలు
మన చిన్న చిన్న నిర్ణయాలే సమాజంలో మంచి మార్పుకు పునాది వేస్తాయని నొక్కి చెప్పారు. కాగా, శ్రీవిష్ణు నటించిన రాజ రాజ చోర సినిమాలో హీరోయిన్‌గా సునైనా చేసింది. అలాగే నాగార్జున, ధనుష్‌ల కుబేర, విశాల్ లాఠీ, రెజీనా వంటి సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించింది.