Sunainaa Video: కుబేర నటి అశ్లీల వీడియో కలకలం.. ఇది లైంగిక వేధింపే, పోరాడటం కలచివేస్తుందని హీరోయిన్ సునైనా కామెంట్స్

Actress Sunainaa Against AI Misuse: సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన తన ఏఐ మార్ఫింగ్ అశ్లీల వీడియోపై కుబేర నటి సునైనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా సృష్టించిన ఈ నకిలీ కంటెంట్‌పై న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ఏఐ దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ పోరాడాలన్నారు.

Published on: Oct 31, 2026, 10:00:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Actress Sunainaa Against AI Misuse: సినీ రంగాన్ని, మహిళా నటీమణులను కృత్రిమ మేధ (AI) రూపంలో కొత్త తరహా ముప్పు తీవ్రంగా వేధిస్తోంది. ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోల బారిన పడి తీవ్ర మనోవేదనకు గురైన సంగతి తెలిసిందే.

కుబేర నటి అశ్లీల వీడియో కలకలం.. ఇది లైంగిక వేధింపే, పోరాడటం కలచివేస్తుందని హీరోయిన్ సునైనా కామెంట్స్
కుబేర నటి అశ్లీల వీడియో కలకలం.. ఇది లైంగిక వేధింపే, పోరాడటం కలచివేస్తుందని హీరోయిన్ సునైనా కామెంట్స్

సైబర్ వేధింపుల బారిన తెలుగు హీరోయిన్

తాజాగా ఈ క్రమంలోనే ప్రముఖ తెలుగు హీరోయిన్ సునైనా యెల్లా సైతం తీవ్రమైన సైబర్ వేధింపులకు గురయ్యారు. సోషల్ మీడియాలో తన రూపాన్ని దుర్వినియోగం చేస్తూ తయారు చేసిన ఒక అశ్లీల ఏఐ వీడియో వైరల్ కావడంపై ఆమె గట్టిగా స్పందించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసిన సునైనా తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సైబర్ క్రిమినల్స్ వైఖరిపై విరుచుకుపడ్డారు.

"మహిళల ఆత్మగౌరవంతో ఆటలాడకండి"

తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా రూపొందించిన ఈ నకిలీ వీడియోను చూసి తాను తీవ్రంగా అసహ్యించుకున్నానని సునైనా తెలిపారు. "స్త్రీల భద్రతకే ముప్పు పొంచి ఉన్న ఈ రోజుల్లో, కనీసం మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాడాల్సి రావడం తీవ్రంగా కలచివేస్తోంది" అని సునైనా తన ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఏమాత్రం బాధ్యత లేకుండా ఒక మహిళ రూపాన్ని, అనుమతి లేకుండా ఈ రకంగా దుర్వినియోగం చేయడం వెనుక ఉన్న వ్యక్తుల తీరును సునైనా కడిగిపారేశారు. సంస్కారం లేని ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించకూడదని పిలుపునిచ్చారు.

న్యాయపోరాటానికి సిద్ధం – చట్టాల హెచ్చరిక

ఇటువంటి అసభ్యకరమైన వీడియోల తయారీ, ప్రచారం సాధారణమైన విషయం కాదని, ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సునైనా స్పష్టం చేశారు. "ఇది నా వ్యక్తిత్వానికి భంగం కలిగించే నేరం. భారతీయ సమాచార సాంకేతిక చట్టం (IT Act 2000), అలాగే భారతీయ న్యాయ సంహిత (BNS 2023) ప్రకారం ఇది తీవ్రమైన శిక్షార్హమైన నేరం" అని ఆమె హెచ్చరించారు.

ఈ నేరానికి ఒడిగట్టిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సునైనా యెల్లా స్పష్టం చేశారు. ఇటువంటి మానసిక దాడులు తన మనశ్శాంతిని గానీ, ధైర్యాన్ని గానీ దెబ్బతీయలేవని ధీమా వ్యక్తం చేశారు.

ప్రేక్షకులకు, అభిమానులకు కీలక విజ్ఞప్తి

సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతుందో, దాన్ని చెడు మార్గంలో వాడే మానసిక వైకల్యం కూడా అంతే స్థాయిలో పెరుగుతోందని ఈ ఘటన నిరూపిస్తోంది. డిజిటల్ యుగంలో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

"ఎవరైనా ఒక వ్యక్తి స్వభావాన్ని లేదా గుర్తింపును దుర్వినియోగం చేసే కంటెంట్‌ను చూసినప్పుడు దాన్ని చూడకండి, ఇతరులకు షేర్ చేయకండి. మీ కళ్లముందు ఇటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు గళమెత్తండి" అని సునైనా నేటి తరం నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.

సునైనా తెలుగు, తమిళ సినిమాలు

మన చిన్న చిన్న నిర్ణయాలే సమాజంలో మంచి మార్పుకు పునాది వేస్తాయని నొక్కి చెప్పారు. కాగా, శ్రీవిష్ణు నటించిన రాజ రాజ చోర సినిమాలో హీరోయిన్‌గా సునైనా చేసింది. అలాగే నాగార్జున, ధనుష్‌ల కుబేర, విశాల్ లాఠీ, రెజీనా వంటి సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More