Tabu About Age And Story Rejection: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గ్లామర్ బ్యూటి టబు. గ్లామర్ పాత్రలకైనా, నటనకు ప్రాధాన్యమున్న రూల్స్‌కు అయిన ఈ సీనియర్ హీరోయిన్ టబు కేరాఫ్ అడ్రస్‌గా చెబుతారు. అయితే సినీ ఇండస్ట్రీలో అందరూ నడిచే దారిలో నడవడం టబుకు అస్సలు ఇష్టం ఉండదు.

వివాదాలకు దూరంగా ఉంటూ, తన పని తాను చేసుకుపోయే ఈ సీనియర్ బ్యూటీ.. తాజాగా వయసు పెరగడం (Ageing), సినిమా రంగంలో ఉండే ఒత్తిళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్పర్స్ బజార్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టబు తన మనసులోని మాటను బయటపెట్టారు.
మీ ఇంట్లో అద్దం లేదా?
సినిమా రంగంలో హీరోయిన్ల వయసు గురించి జరిగే చర్చలపై టబు తీవ్రంగా స్పందించారు. "నా వయసు గురించి నాకంటే కూడా ఎదుటి వారికే ఎక్కువ ఆందోళన ఉంటుంది. ఏదో నా ఇంట్లో అద్దం లేనట్టుగా, జనం నాకు అద్దం చూపించాలని తాపత్రయపడుతుంటారు" అని టబు ఎద్దేవా చేశారు.
వయసు మళ్లడం అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదని, అది ప్రతిరోజూ మనం అనుభవించే ఒక సహజమైన ప్రక్రియ అని టబు వివరించారు. నిన్న 20 ఏళ్లలో ఉండి, ఈరోజు ఉదయాన్నే 45 ఏళ్లకు చేరుకోము కదా అని టబు ప్రశ్నించారు.
అబద్ధాలు చెప్పడం నావల్ల కాదు!
సాధారణంగా ఇండస్ట్రీలో ఏదైనా సినిమా నచ్చకపోతే.. స్క్రిప్ట్ బాలేదని చెప్పడానికి చాలా మంది మొహమాటపడుతుంటారు. అటువంటి సమయంలో "డేట్స్ ఖాళీ లేవు" అనే అబద్ధపు సాకుతో తప్పించుకోమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని టబు గుర్తు చేసుకున్నారు.
"సినిమా చేయకపోవడానికి అసలు కారణం ఎప్పుడూ చెప్పకూడదు, డేట్స్ సమస్య అని చెప్పి తప్పుకోమని నాకు చెప్పారు. కానీ, నాకు అది అర్థం కాలేదు. నాకు కథ నచ్చకపోతే.. నచ్చలేదని మొహం మీదే చెప్పేస్తా. అదే నా పద్ధతి" అని టబు కుండబద్దలు కొట్టారు. ఆమెలోని ఈ నిజాయితీనే నేటి తరం నటీమణుల్లో చాలా తక్కువగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తుంటారు.
తెలుగు వెండితెరపై మళ్లీ 'నిన్నే పెళ్లాడతా' మేజిక్?
{{/usCountry}}"సినిమా చేయకపోవడానికి అసలు కారణం ఎప్పుడూ చెప్పకూడదు, డేట్స్ సమస్య అని చెప్పి తప్పుకోమని నాకు చెప్పారు. కానీ, నాకు అది అర్థం కాలేదు. నాకు కథ నచ్చకపోతే.. నచ్చలేదని మొహం మీదే చెప్పేస్తా. అదే నా పద్ధతి" అని టబు కుండబద్దలు కొట్టారు. ఆమెలోని ఈ నిజాయితీనే నేటి తరం నటీమణుల్లో చాలా తక్కువగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తుంటారు.
తెలుగు వెండితెరపై మళ్లీ 'నిన్నే పెళ్లాడతా' మేజిక్?
{{/usCountry}}తెలుగు ప్రేక్షకులకు టబు అంటే ప్రత్యేకమైన అభిమానం. ముఖ్యంగా కింగ్ నాగార్జునతో ఆమె కెమిస్ట్రీ అప్పట్లో ఒక ఊపు ఊపింది. 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడ మా ఆవిడే' వంటి చిత్రాల తర్వాత మళ్లీ 28 ఏళ్లకు ఈ క్రేజీ కాంబో సెట్స్ మీదకు వచ్చింది. నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం (King100)లో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నాగార్జున కింగ్ 100 మూవీ షూటింగ్‌లో టబు కూడా పాల్గొన్నారు. నవీన్ (రా) కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా, అక్షయ్ కుమార్‌తో కలిసి ఆమె నటించిన హారర్ కామెడీ 'భూత్ బంగ్లా' కూడా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.