Zareen Khan: హీరోయిన్ ఇంట్లో నిన్న, ఇవాళ వరుస విషాదాలు- జరీన్ ఖాన్ తల్లి కన్నుమూత- నేడు సాయంత్రం అంత్యక్రియలు!
Zareen Khan Mother Parveen Khan Death: బాలీవుడ్ హీరోయిన్, గోపీచంద్ చాణక్య నటి జరీన్ ఖాన్ ఇంట్లో వరుసగా విషాదాలు చోటు చేసుకున్నాయి. ఇవాళ జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్ కన్నుమూశారు. దీంతో జరీన్ పుట్టెడు దుఃఖంలో ఉండిపోయింది. జరీన్ ఖాన్‌కు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్, తెలుగు చాణక్య ఫేమ్ జరీన్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి పర్వీన్ ఖాన్ బుధవారం (ఏప్రిల్ 8) తుదిశ్వాస విడిచారు.

సుదీర్ఘ పోరాటం తర్వాత అనంత లోకాలకు..
హిందీ సినిమా 'వీర్' ద్వారా సల్మాన్ ఖాన్ సరసన వెండితెరకు పరిచయమైన జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్ మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని ఏళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా 2016లో పర్వీన్ ఖాన్‌కు గుండె శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి విషమించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పర్వీన్ ఖాన్ కన్నుమూశారు.
"మా ప్రియతమ పర్వీన్ ఖాన్ (జరీన్ ఖాన్, సనా ఖాన్‌ల తల్లి) ఏప్రిల్ 8న శాంతియుతంగా స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని జరీన్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని వెర్సోవాలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం పర్వీన్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
పుట్టెడు దుఃఖంలో జరీన్ ఖాన్
జరీన్ ఖాన్ తన తల్లికి చాలా సన్నిహితంగా ఉండేవారు. గత కొన్ని నెలలుగా తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై జరీన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. "అమ్మ మళ్లీ ఆసుపత్రిలో చేరారు.. దయచేసి ఆమె కోసం ప్రార్థించండి" అంటూ ఫిబ్రవరిలో జరీన్ ఖాన్ పెట్టిన పోస్ట్ ఆమె ఆవేదనను తెలియజేసింది. తన తల్లిని కాపాడుకోవడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. అయితే, విధి వెక్కిరించడంతో తల్లి జ్ఞాపకాలతో జరీన్ ఖాన్ మిగిలిపోయారు.
వరుస విషాదాలు
జరీన్ ఖాన్‌ను ఒకేసారి రెండు విషాదాలు చుట్టుముట్టాయి. తన తల్లి మరణించడానికి కేవలం ఒక్క రోజు ముందే (ఏప్రిల్ 7న), ఆమె ప్రాణంగా ప్రేమించే పెంపుడు పిల్లి 'రాంబో' కూడా మరణించింది.
"నా బిడ్డ నన్ను వదిలి వెళ్లిపోయింది" అంటూ నిన్ననే ఎమోషనల్ పోస్ట్ పెట్టిన జరీన్, ఇప్పుడు కన్నతల్లిని కోల్పోవడం జరీన్ ఖాన్‌కు కోలుకోలేని దెబ్బ తీసింది. వరుసగా ఎదురైన ఈ విషాదకర సంఘటనలు జరీన్ ఖాన్‌తోపాటు ఆమె అభిమానులను సైతం కలిచివేస్తున్నాయి.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే
కాగా, సల్మాన్ ఖాన్ పక్కన భారీ అంచనాలతో కెరీర్ ప్రారంభించిన జరీన్ ఖాన్ కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. గోపీచంద్ హీరోగా వచ్చిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ 'చాణక్య' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు జరీన్ ఖాన్.
అలాగే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వీరప్పన్' చిత్రంలోనూ జరీన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. పంజాబీ, తమిళ భాషల్లోనూ తన ముద్ర వేసిన జరీన్ 2020లో వచ్చిన 'హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే' తర్వాత వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమెకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












