Adhey Neevu Adhey Nenu Movie Review In Telugu And Rating: రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు థియేటర్లలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆకట్టుకునే ప్రేమకథకు కాసింత ఉత్కంఠ, ఫ్యామిలీ, థ్రిల్లింగ్ అంశాలు తోడైతే ప్రేక్షకులు సీట్ల అంచులపై కూర్చుని సినిమాను ఆస్వాదిస్తారు.
అదే నీవు అదే నేను రివ్యూ

అదే నమ్మకంతో శ్రీ లక్ష్మీ వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై కాండ్రేగుల గోవిందు నిర్మించిన చిత్రం 'అదే నీవు అదే నేను'. తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అదే నీవు అదే నేను సినిమాకు డైరెక్టర్ కొండల్ దర్శకత్వం వహించారు. రియల్ ఇన్సిడెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ఇవాళ (జూలై 31) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి అదే నీవు అదే నేను రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
హైదరాబాద్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సాగర్ (యశ్వంత్ పెండ్యాల), అతని భార్య శ్రీవల్లి (తన్వీ నేగి) నివసిస్తుంటారు. సాగర్ తల్లి సావిత్రి (కల్పలత) కోడలిని సొంత కూతురిలా చూసుకుంటుంది. అంతా ప్రశాంతంగా సాగుతుందనుకున్న సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా సాగర్ తన భార్యకు తగినంత సమయం ఇవ్వలేకపోతాడు.
ఈ క్రమంలోనే వారి ఎదురు ఫ్లాట్‌లోకి కెనడా నుంచి ప్రాజెక్ట్ పని మీద వచ్చిన కార్తీక్ (త్రినాథ్ వర్మ) అడుగుపెడతాడు. చలాకీగా ఉండే కార్తీక్ సరదా మాట తీరు శ్రీవల్లిని ఆకర్షిస్తుంది. తను తప్పు చేస్తున్నానని మనసులో అనుకున్నప్పటికీ అతడిని దూరం పెట్టలేక సతమతమవుతుంది. ఈ క్రమంలోనే భర్త సాగర్ గురించి కొన్ని భయంకరమైన నిజాలు శ్రీవల్లికి తెలుస్తాయి. ఆ నిజాలేంటి? చివరకు శ్రీవల్లి ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుంది? సాగర్ శ్రీవల్లి కార్తీక్ ముగ్గురి జీవితాల్లో ఏం జరిగింది? అనేది వెండితెరపైనే చూడాలి.
విశ్లేషణ:
ఇది ఒక సస్పెన్స్ రొమాంటిక్ ఫ్యామిలీ క్రైమ్ డ్రామా సినిమా. ఒక కారులో శ్రీవల్లి రెండు మృతదేహాలను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లే సస్పెన్స్ సీన్‌తో సినిమా చాలా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అసలు ఆమె ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే ఆసక్తిని పెంచుతూ కథ గతంలోకి వెళ్తుంది.
{{/usCountry}}ఇది ఒక సస్పెన్స్ రొమాంటిక్ ఫ్యామిలీ క్రైమ్ డ్రామా సినిమా. ఒక కారులో శ్రీవల్లి రెండు మృతదేహాలను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లే సస్పెన్స్ సీన్‌తో సినిమా చాలా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అసలు ఆమె ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే ఆసక్తిని పెంచుతూ కథ గతంలోకి వెళ్తుంది.
{{/usCountry}}ప్రారంభంలోనే రెండు మృతదేహాల సీన్‌తో ప్రేక్షకులలో ఉత్కంఠ పెంచిన దర్శకుడు, ఫస్టాఫ్‌ను గేటెడ్ కమ్యూనిటీ వాతావరణం, ఆఫీస్ కామెడీతో సరదాగా నడిపించారు. రీమిక్స్ రీల్ స్టార్ రవిగా బిత్తిరి సత్తి, మంగళవారంగా సూర్యతేజ చేసే హంగామా థియేటర్లో నవ్వులు పూయిస్తుంది.
మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో స్క్రీన్ ప్లే
ఇక సెకండాఫ్‌కి వచ్చేసరికి అసలు సిసలైన థ్రిల్ మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో ఏర్పడిన సందేహాలన్నింటికీ ఊహకందని ట్విస్టులతో సమాధానమిచ్చారు దర్శకుడు కొండల్. సినిమాలో ఒక్క పోలీస్ పాత్ర కూడా లేకుండా ఒక థ్రిల్లర్ కథనాన్ని నడిపించడం కథనంలో కనిపిచే కొత్తదనం.
సమాజంలో జరుగుతున్న కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను మలచడం విశేషం. ఫస్టాఫ్ అంతా కామెడీ, శ్రీవల్లి-సాగర్ భార్యాభర్తల బంధం, కార్తీక్ ఎఫైర్ ప్రయత్నాలతో సాగితే సెకండాఫ్ ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నింపేశారు. క్లైమాక్స్ పర్వాలేదు.
నటీనటుల అభినయం
'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల తమ పాత్రల్లో ఒదిగిపోయారు. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూనే చాక్లెట్ బాయ్ లుక్‌లో త్రినాథ్ వర్మ, కాస్త గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో యశ్వంత్ చక్కటి మెచ్యూరిటీ ప్రదర్శించారు. శ్రీవల్లిగా తన్వీ నేగి నటన కథకు ప్రధాన బలమని చెప్పాలి. అనేక లేయర్లు ఉన్న పాత్రను ఆమె చాలా సహజంగా పండించింది.
సాంకేతిక బలం
రూబీగా సహర్ కృష్ణన్ గ్లామర్ జోడిస్తూనే అభినయంతో ఆకట్టుకుంది. సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. నిమ్మల జయపాల్ రెడ్డి కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించింది. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. కనిష్క అందించిన 'మనసా మనసా', 'మధురమా' పాటలతో పాటు నేపథ్య సంగీతం సినిమా గ్రాఫ్‌ను పెంచింది. ప్రొడ్యూసర్ కాండ్రేగుల గోవిందు ప్రొడక్షన్ విలువలు క్వాలిటీగా ఉన్నాయి.
ఫైనల్‌గా చెప్పాలంటే?
"పెళ్లికి ముందు ప్రేమ 'నువ్వు లేకపోతే నేను బతకలేను' అని చెబితే.. పెళ్లి తర్వాత ప్రేమ 'నేను బతికేదే నీకోసం' అని చెబుతుంది" అనే సందేశంతో చిత్రాన్ని ముగించారు. ఫైనల్‌గా చెప్పాలంటే మంచి సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను కోరుకునే ప్రేక్షకులు అదే నీవు అదే నేను సినిమాపై ఓ లుక్కేయొచ్చు.