టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్ (Adivi Sesh). అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పెరిగిన అతడు.. సినిమాలపై ఆసక్తితో ఇండియాకు వచ్చి ఇక్కడ ఎలా నిలదొక్కుకున్నాడో వివరించాడు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో నెపోటిజం గురించి, తనకు మహేష్ బాబు, నాని వంటి స్టార్ల నుంచి లభించిన మద్దతు గురించి మాట్లాడాడు.
ఆడిషన్‌లో వింత అనుభవం.. "యాస" గొడవ!

తాను 'ఔట్‌సైడర్' (బయట వ్యక్తి)గా ఫీలయ్యారా అని అడిగిన ప్రశ్నకు శేష్ ఒక పాత జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ సీరియల్ కోసం ముంబైలో ఆడిషన్‌కు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనను అతడు వివరించాడు.
"ఆడిషన్‌లో డైలాగ్స్ చెప్పాక, 'మీది ఏ ఊరు?' అని అడిగారు. నేను 'శాన్ ఫ్రాన్సిస్కో' అని చెప్పగానే.. 'అవును, అందుకే నీ హిందీలో అమెరికన్ యాస వినిపిస్తోంది' అన్నారు. తర్వాతి వారం మళ్ళీ అదే చోటుకి ఆడిషన్‌కు వెళ్ళాను. ఈసారి 'హైదరాబాద్' అని చెప్పాను. వెంటనే వాళ్లు.. 'ఓహో.. అందుకే నీ హిందీలో సౌత్ ఇండియన్ యాస వినిపిస్తోంది' అన్నారు (నవ్వుతూ). అంటే నేను అమెరికాకు 'టూ మచ్ ఇండియన్'ని, ఇండియాకు 'టూ మచ్ అమెరికన్'ని, సౌత్ వాళ్లకు నార్త్ ఇండియన్‌ని, నార్త్ వాళ్లకు సౌత్ ఇండియన్‌ని అయిపోయాను" అని శేష్ తన కన్ఫ్యూజన్‌ను గుర్తుచేసుకున్నాడు.
"డాక్టర్ కొడుకు డాక్టరే అవుతాడు కదా.."
తెలుగు ఇండస్ట్రీలో బ్రేక్ రావడం కష్టమా? అని అడిగినప్పుడు శేష్ ఇలా స్పందించాడు. "నిజాయితీగా చెప్పాలంటే.. మన దేశంలో ఏ పల్లెటూరికి వెళ్ళినా డాక్టర్ కొడుకు డాక్టరే అవుతాడు, రైతు కొడుకు రైతే అవుతాడు. అందుకే మనం ఒక 'నెపో కంట్రీ' (వారసత్వ దేశం)లో ఉన్నామని నేను అనుకుంటున్నాను (నవ్వుతూ). కానీ ప్రేక్షకులకు ఇవి అనవసరం. మిగతా వాళ్ల కంటే భిన్నంగా ఏదైనా చేస్తే వాళ్లు ఆదరిస్తారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చాలా డెమోక్రటిక్ గా మారింది" అని అభిప్రాయపడ్డాడు.
టాలీవుడ్ స్టార్ల సపోర్ట్..
తనకు ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్ద హీరోలు మద్దతుగా నిలిచారని శేష్ చెప్పాడు. "మొదటి రోజు నుంచే నాకు ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాల నుంచి గౌరవం దక్కింది. నా సినిమా ‘మేజర్’ను మహేష్ బాబు నిర్మించారు. నా తదుపరి చిత్రం 'డెకాయిట్'ను నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. నా స్నేహితుడు, ఫేవరెట్ యాక్టర్ నాని 'హిట్: ది సెకండ్ కేస్' నిర్మించారు. ఇదంతా గౌరవానికి సంబంధించిన విషయం" అని శేష్ అన్నాడు.
అడివి శేష్ రాబోయే సినిమాలు..
{{/usCountry}}తనకు ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్ద హీరోలు మద్దతుగా నిలిచారని శేష్ చెప్పాడు. "మొదటి రోజు నుంచే నాకు ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాల నుంచి గౌరవం దక్కింది. నా సినిమా ‘మేజర్’ను మహేష్ బాబు నిర్మించారు. నా తదుపరి చిత్రం 'డెకాయిట్'ను నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. నా స్నేహితుడు, ఫేవరెట్ యాక్టర్ నాని 'హిట్: ది సెకండ్ కేస్' నిర్మించారు. ఇదంతా గౌరవానికి సంబంధించిన విషయం" అని శేష్ అన్నాడు.
అడివి శేష్ రాబోయే సినిమాలు..
{{/usCountry}}మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)తో కలిసి నటిస్తున్న డెకాయిట్ సినిమాను షానీల్ డియో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్ కూడా నటిస్తున్నాడు. ఇది హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటోంది.
ఇది కాకుండా గూఢచారి 2 కూడా ఉంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో వస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మే 1, 2026న విడుదల కానుంది. ఇందులో ఇమ్రాన్ హష్మీ, వామికా గబ్బి, మురళి శర్మ, సుప్రియ యార్లగడ్డ కీలక పాత్రలు పోషిస్తున్నారు.