...
...
Next Story

OTT Trending: ఓటీటీని షేక్ చేస్తున్న అడివి శేష్ రొమాంటిక్ థ్రిల్లర్.. ఒక్క రోజులోనే రికార్డు.. మీరు చూశారా?

OTT Trending: అడివి శేష్ లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే నంబర్ వన్ సినిమాగా ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది.

Published on: May 9, 2026, 19:26:39 IST
Advertisement

OTT Trending: ఓటీటీలో తెలుగు సినిమాల జోరు కొనసాగుతోంది. లేటెస్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన అడివి శేష్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ మూవీ అదరగొడుతోంది. ఓటీటీలో ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. డిజిటల్ ఆడియన్స్ ను భలే ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ మూవీని మీరు చూశారా? లేదంటే వెంటనే ఓ లుక్కేయండి.

డెకాయిట్ ఓటీటీ

ఓటీటీ ట్రెండింగ్ లో తెలుగు థ్రిల్లర్ (x/AdiviSesh)
ఓటీటీ ట్రెండింగ్ లో తెలుగు థ్రిల్లర్ (x/AdiviSesh)

అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌ జంటగా నటించిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. థియేటర్లో అదరగొట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఈ మూవీ మే 8న ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

నంబర్ వన్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా ‘డెకాయిట్’ దూసుకెళ్తోంది. ఓటీటీలోకి వచ్చిన ఒక్కరోజులోనే మిగతా సినిమాలను వెనక్కి నెట్టి డెకాయిట్ అదరగొడుతోంది. ఈ మూవీని జనాలు తెగ చూసేస్తున్నారు. దీంతో టాప్ లోకి వచ్చేసింది డెకాయిట్. అడివి శేష్ యాక్టింగ్ కు జనాలు ఫిదా అవుతున్నారు.

డెకాయిట్ స్టోరీ

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ప్రేయసిపై ఆ ప్రియుడు పగ తీర్చుకోవాల్సి వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే డెకాయిట్. ఇందులో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ సాధించింది.

ఈ క్రమంలోనే హరిదాస్ జైలు నుంచి తప్పించుకుంటాడు. దుబాయ్ వెళ్లాలనుకుంటాడు. అందుకు రూ. 60 లక్షలు అవసరం అవుతాయి. మరోవైపు ఆరేళ్ల కూతురికి తల్లిగా, అనారోగ్యంతో మంచాన పడిన భాస్కర్‌ (వైభవ్)కు భార్యగా సరస్వతి ఉంటుంది. పాప కోసం జూలియట్ కు మనీ అవసరం ఉంటుంది. ఇద్దరు కలిసి ఓ దొంగతనం ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే డెకాయిట్ మిగతా కథ.

టాప్-5 ఇలా

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రెండింగ్ టాప్-5 లిస్ట్ పైనా ఓ లుక్కేయండి. డెకాయిట్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ తమిళ్ మూవీ ‘లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ’ ఉంది. ఆ తర్వాత చూసుకుంటే వరుసగా ‘హ్యాపీ రాజ్’, ‘ఓ రోమియో’, ‘టీఎన్ 2026’ టాప్-5లో ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe