హీరోలంటే యాక్షన్ సీన్లు మాత్రమే కాదు డ్యాన్స్, కామెడీ, ఎమోషన్ అన్నీ పండించాలి. కానీ అడివి శేష్ ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో పెద్దగా డ్యాన్స్ చేసినట్లు కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ తోనే ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్ తనలోని డ్యాన్సర్ ను బయటకు తీశాడు. డెకాయిట్ సినిమా నుంచి రిలీజైన ‘చిచ్చుబుడ్డి’ వీడియో సాంగ్ లో శేష్ డ్యాన్స్ వేరే లెవల్ లో ఉంది.
అడివి శేష్ డ్యాన్స్

అడివి శేష్ డ్యాన్స్ చేస్తే ఇలా ఉంటుందా? అడివి శేష్ లో ఇంత మంచి డ్యాన్సర్ ఉన్నాడా? ఆ గ్రేస్ ఏంటి బాబు? ఇన్ని రోజులు ఈ టాలెంట్ ఎక్కడ దాచావయ్యా?.. ఇవీ చిచ్చుబుడ్డి సాంగ్ లో అడివి శేష్ డ్యాన్స్ చూసిన తర్వాత నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలు. అవును.. ఈ సాంగ్ లో అడివి శేష్ అంతలా రెచ్చిపోయి డ్యాన్స్ కుమ్మేశాడు.
జొనితా గాంధీతో
డెకాయిట్ సినిమా నుంచి రిలీజ్ అయిన ఈ ‘చిచ్చుబుడ్డి’ సాంగ్ కు మరో స్పెషాలిటీ కూడా ఉంది. పాపులర్ సింగర్ కమ్ డ్యాన్సర్ జొనితా గాంధీ ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేసింది. సినిమాలో తొలిసారి ఆడిపాడింది. అడివి శేష్ తో జొనితా కెమిస్ట్రీ అదిరిపోయింది. వీళ్లు ఇద్దరు కలిసి స్టెప్పులతో అదరగొట్టారు.
వైరల్ గా సాంగ్
శనివారం (మార్చి 28) రాత్రి రిలీజ్ అయిన చిచ్చుబుడ్డి వీడియో సాంగ్ తెగ వైరల్ గా మారిపోయింది. ముఖ్యంగా అడివి శేష్, జొనితా డ్యాన్స్ పై నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ‘పర్ఫెక్ట్ డ్యాన్స్ నంబర్’ అని పేర్కొంటున్నారు.
ఎందుకు చేయలేదని
అడివి శేష్ డ్యాన్స్ చూసిన ఫ్యాన్స్ ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ‘‘డెకాయిట్ నుంచి వచ్చిన చిచ్చుబుడ్డి సాంగ్ బాగుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఫస్ట్ టైమ్ అడివి శేష్ డ్యాన్స్.. అది చూశాక ఇంత గ్రేస్ పెట్టుకుని ఎందుకు ట్రై చేయాలేదా అనిపించింది’’ అని ఓ యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.
{{/usCountry}}అడివి శేష్ డ్యాన్స్ చూసిన ఫ్యాన్స్ ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ‘‘డెకాయిట్ నుంచి వచ్చిన చిచ్చుబుడ్డి సాంగ్ బాగుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఫస్ట్ టైమ్ అడివి శేష్ డ్యాన్స్.. అది చూశాక ఇంత గ్రేస్ పెట్టుకుని ఎందుకు ట్రై చేయాలేదా అనిపించింది’’ అని ఓ యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.
{{/usCountry}}డెకాయిట్ గురించి
అడివి శేష్, మృనాల్ ఠాకూర్ జంటగా నటించిన రాబరీ థ్రిల్లర్ ‘డెకాయిట్’. ఈ సినిమా ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి తదితరులు నటించారు. దీనికి షనీల్ డియో డైరెక్టర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిచ్చుబుడ్డి పాటను రామ్ మిర్యాలా, జొనితా పాడారు.