Netflix: వీకెండ్ లో ఓటీటీలో ఏం చూడాలో అర్థం కావడం లేదా? మంచి డార్క్ కామెడీ సిరీస్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఆగండి, ఈ న్యూస్ మీకోసమే. నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన ఈ డార్క్ కామెడీ సిరీస్ పై ఓ లుక్కేయండి. ఆ సిరీస్ పేరు 'ఆఫ్టర్‌లైఫ్'.
ఆఫ్టర్ లైఫ్ ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆఫ్టర్ లైఫ్’ డార్క్ కామెడీ సిరీస్ ఓ మస్ట్ వాచ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్రిటిష్ డ్రామా టీవీ సిరీస్. దీనిని రిక్కీ గెర్వైస్ సృష్టించాడు.ఈ సిరీస్ మిమ్మల్ని నవ్విస్తుంది. కొన్ని చోట్ల ఆహా అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కాస్త అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది.
మూడు సీజన్ లు
ఈ ఆఫ్టర్ లైఫ్ సిరీస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో వచ్చే ఒక అంశం గురించి మాట్లాడుతుంది. ఈ సిరీస్‌లో మూడు సీజన్‌లు ఉన్నాయి. ఆఫ్టర్‌లైఫ్ అనేది ట్యాంబరీ అనే సిటీలో నివసించే టోనీ జాన్సన్ అనే రిపోర్టర్ కథ. టోనీ జాన్సన్ ఎంతో అమితంగా ప్రేమించే భార్యను కోల్పోతాడు. టోనీ భార్య రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తుంది.
ప్రపంచంపై ప్రతీకారం
భార్య మరణం తర్వాత టోనీ జీవితం తలకిందులవుతుంది. అతను ఆత్మహత్య ఆలోచనలతో బాధపడతాడు. కానీ అతను తన భార్య మరణానికి ప్రపంచంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. దీని కోసం, టోనీ ప్రపంచాన్ని పట్టించుకోకుండా తాను చేయాలనుకున్నదంతా చేస్తాడు. అతను చెప్పాలనుకున్నది కచ్చితంగా చెప్తాడు. ప్రజలు అతన్ని ప్రశ్నిస్తే, అతను వారికి తిరిగి సమాధానాలు ఇస్తాడు.
6 ఎపిసోడ్ లు
ఓటీటీలో ఆఫ్టర్ లైఫ్ సిరీస్ లో స్టోరీ ముందుకు సాగుతున్న కొద్ద టోనీ జాన్సన్ ప్రవర్తన మీకు అర్థం అవుతుంది. అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుస్తుంది. ఈ సిరీస్ మొదటి సీజన్ 2019లో విడుదలైంది. రెండవ సీజన్ 2020లో, మూడవ సీజన్ 2022లో విడుదలైంది. ఒక్కో సీజన్ లో 6 ఎపిసోడ్ల చొప్పున ఉన్నాయి.
8.2 ఐఎండీబీ
{{/usCountry}}ఓటీటీలో ఆఫ్టర్ లైఫ్ సిరీస్ లో స్టోరీ ముందుకు సాగుతున్న కొద్ద టోనీ జాన్సన్ ప్రవర్తన మీకు అర్థం అవుతుంది. అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుస్తుంది. ఈ సిరీస్ మొదటి సీజన్ 2019లో విడుదలైంది. రెండవ సీజన్ 2020లో, మూడవ సీజన్ 2022లో విడుదలైంది. ఒక్కో సీజన్ లో 6 ఎపిసోడ్ల చొప్పున ఉన్నాయి.
8.2 ఐఎండీబీ
{{/usCountry}}ఆఫ్టర్‌లైఫ్ సిరీస్‌లో రిక్కీ గెర్వైస్, డైయాన్ మోర్గాన్, టామ్ బాస్డెన్, టోనీ వే, మందీప్ ధిల్లాన్, యాష్లే జెన్సెన్, డేవిడ్ బ్రాడ్లీ, కారీ గోడ్లిమన్, పెనెలోప్ విల్టన్, డేవిడ్ ఎర్ల్, జో విల్కిన్సన్, జో హార్ట్లీ, రోయిసిన్ కోనాటీ, టిమ్ ప్లెస్టర్, పాల్ వంటి నటీనటులు నటించారు. రిక్కీ యాక్టింగ్ చేయడంతో పాటు ఈ సిరీస్ కు కథ అందించాడు. అలాగే దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్‌కు IMDb రేటింగ్ 8.2గా ఉంది.