Agadha Movie Review In Telugu And Rating:

టైటిల్: అగధ
నటీనటులు: కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ఉల్కా గుప్త, జోవిక విజయ్ కుమార్, షైజు, వనిత విజయ్ కుమార్, భాను చందర్, తదితరులు
దర్శకత్వం: ఎంఎస్ రాజు
సంగీతం: రాకేష్ వెంకటాపురం
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
విడుదల తేది: ఆగస్ట్ 14, 2026
టాలీవుడ్ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ తెలుగు డివైన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా అగధ. నటి కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా అగధ ఇవాళ థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి అగధ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మహాదేవి (కామాక్షి భాస్కర్ల) తన బాబాయ్ (భానుచందర్) ఇంట్లోనే పెరుగుతుంది. అనుకోకుండా ఒకరోజు నుంచి ఓ దైవ శక్తి చూపిన మార్గంలో నడుస్తుంది మహాదేవి. ఒక సాధువు సహాయంతో యంత్ర, తంత్ర విద్యలను అభ్యసించిన మహాదేవి, ఆ శక్తులను ప్రజల మేలు కోసం ఉపయోగిస్తూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు సంపాదిస్తుంది.
అయితే, ఆమెను పెంచిన బాబాయ్ కుటుంబానికి 'అగధ' అనే ఒక భయంకరమైన అతీత శక్తి నుంచి ముప్పు ఎదురవుతుంది. గర్భవతి అయిన బాబాయ్ కూతురు మహిమ (ఉల్కా గుప్త) అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమెతో పాటు వరుసగా వింత మరణాలు సంభవిస్తాయి.
తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి సొంతూరికి వెళ్లిన మహదేవికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అసలు అగధ ఎవరు? దైవిక శక్తుల అండ ఉన్న మహాదేవి, ఈ చీకటి శక్తిని ఎలా అంతమొందించింది ఈ క్రమంలో మహాదేవి ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ? అగధను మహాదేవి అంతం చేసిందా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
{{/usCountry}}తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి సొంతూరికి వెళ్లిన మహదేవికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అసలు అగధ ఎవరు? దైవిక శక్తుల అండ ఉన్న మహాదేవి, ఈ చీకటి శక్తిని ఎలా అంతమొందించింది ఈ క్రమంలో మహాదేవి ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ? అగధను మహాదేవి అంతం చేసిందా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
{{/usCountry}}ఇటీవల కాలంలో హారర్, దెయ్యాలు వంటి సినిమాలు తెలుగు ఆడియెన్స్‌కు కొత్తేం కాదు. ఈ జోనర్‌కు కామెడీ, సైకలాజికల్, యాక్షన్ వంటి వివిధ హంగులు అద్ది తెరకెక్కిస్తున్నారు. కానీ, వీటికి భిన్నంగా అగధను తెరకెక్కించారు డైరెక్టర్ ఎంఎస్ రాజు.
అడవిలో ఒక యువతిని అతీత శక్తి వెంటాడటం, ఆమెతోపాటు ఉన్న ఫ్రెండ్ హత్య, ఆపై ఆమె ఆత్మహత్య వంటి సీన్‌తో సినిమా ప్రారంభంలోనే వీక్షకులను కథలోకి తీసుకెళ్లడంలో దర్శకుడు సఫలమయ్యారు. మహదేవి పాత్ర పరిచయం, ఆమె సాధించిన తాంత్రిక విద్యల నేపథ్యం ఆసక్తిని రేకెత్తిస్తాయి.
ముఖ్యంగా అడవి ఎపిసోడ్, గుహ దగ్గర జరిగే సన్నివేశాలు, విరామానికి ముందు వచ్చే ట్విస్ట్ ద్వితీయార్థంపై మరింత ఇంట్రెస్ట్, థ్రిల్ పెంచుతాయి. రెండో భాగంలో అసలు గుహలో ఉన్న అగధ కథ, హీరో పాత్రలోని మరో కోణం ఆకట్టుకుంటాయి.
అతిగా వచ్చే మలుపులు
కథానాయకుడు శ్రవణ్ రెడ్డి దెయ్యం పట్టిన వ్యక్తిగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లు, జోవికా క్లాస్‌రూమ్ ఎపిసోడ్ భయపెడతాయి. క్లైమాక్స్‌లో 'కాలయంత్రం' కాన్సెప్ట్‌తో ప్రతినాయకుడిని బంధించే సన్నివేశం హారర్ ప్రేమికులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. అయితే, ద్వితీయార్థంలో ఒక దశ దాటిన తర్వాత అతిగా వచ్చే మలుపులు (Twists) కథనం వేగాన్ని తగ్గించాయి.
సినిమా మొదటి భాగం కథను, దాని వెనుకున్న రహస్య ప్రపంచాన్ని పరిచయం చేయడానికే ఎక్కువగా కేటాయించారు. మహిమ ఎందుకు చనిపోయింది? మహాదేవికి ఈ ఆధ్యాత్మిక శక్తులు ఎలా వచ్చాయి? అసలు అగధ ఎవరు? వంటి ప్రశ్నలతో ప్రథమార్ధాన్ని చాలా ఆసక్తికరంగా నడిపించారు. కథనంలో ఉన్న వేగం ప్రేక్షకుడిలో తదుపరి ఏం జరుగుతుందోననే ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
అయితే ద్వితీయార్థానికి వచ్చేసరికి సినిమా గ్రాఫ్ కాస్త పడిపోతుంది. మొదటి భాగంలో వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో కథనం రొటీన్ హారర్ బాట పట్టింది. కొత్తగా ఏదో చూపించబోతున్నారనే భావన కలిగించినప్పటికీ, కథనం ఊహించదగిన రీతిలోనే సాగుతుంది. స్కీన్ ప్లే ఇంకాస్త బలంగా ఉండి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది.
హైలెట్‌గా కామాక్షి భాస్కర్ల
సాంకేతిక విభాగాల విషయానికొస్తే.. రాకేష్ వెంకటాపురం నేపథ్య సంగీతం రీసౌండింగ్ హారర్ ఎఫెక్ట్‌ను ఇచ్చింది. సినిమాటోగ్రఫీ, సీజీఐ (CGI) విజువల్స్ పర్వాలేదు. అడవి సీన్లు ఆకట్టుకుంటాయి. ఎం.ఎస్.రాజు కథనంలో పాత పద్ధతులే వాడినప్పటికీ, నిర్మాణ విలువల్లో ఎక్కడా తగ్గకుండా నాణ్యమైన థ్రిల్లర్‌ను అందించారు.
ఈ సినిమాకి అతిపెద్ద బలం నటి సాయి కామాక్షి భాస్కర్ల. తనలోని ఆధ్యాత్మిక శక్తులను తెలుసుకుంటూ, ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే 'మహాదేవి' పాత్రలో ఆమె ఒదిగిపోయింది. గంభీరమైన ఆహార్యంతో, భావోద్వేగాలను పండిస్తూ సినిమాను తన భుజాలపై మోశారు.
మహిమ పాత్రలో ఉల్కా గుప్తా, భయానక పాత్రలో జోవికా విజయ్‌కుమార్ షాకింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శ్రవణ్ రెడ్డి తన నెగెటివ్ షేడ్స్‌తో చాలా బాగా మెప్పించారు. భానుచందర్, వనితా విజయ్‌కుమార్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
ఫైనల్‌గా చెప్పాలంటే?
పాత హారర్ ఫార్మాట్‌నే ఎంచుకున్నప్పటికీ.. ఆధ్యాత్మికత, గ్రాఫిక్స్, నటీనటుల ప్రతిభతో 'అగధ' ఒక కొత్త అనుభూతిని ఇచ్చే ప్రయత్నం చేసింది. సెకండాఫ్ కాస్త నెమ్మదించినా, కామాక్షి భాస్కర్ల అద్భుత నటన, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు అగధ సినిమాను చూసేయొచ్చు.