OTT Horror Family: ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ ఫ్యామిలీ హారర్ థ్రిల్లర్- ప్రతి గదిలో అంతుచిక్కని రహస్యాలు- ఎక్కడంటే?

Dark Giant OTT Streaming: ఓటీటీలోకి సైకలాజికల్ ఫ్యామిలీ హారర్ థ్రిల్లర్ డ్రామా చిత్రం డార్క్ జెయింట్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ దుష్టశక్తితో చేసుకున్న ఒప్పందం తమ కుటుంబానికి ఎలా శాపంగా మారిందనే కథతో తెరకెక్కింది ఈ సినిమా. సోనియా అగర్వాల్ నటించిన డార్క్ జెయింట్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Aug 13, 2026, 06:00:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dark Giant OTT Release: ఈ మధ్య కాలంలో హారర్ సినిమాలు రూటు మార్చి ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం దెయ్యాలు, భయానక శబ్దాలతో జంప్ స్కేర్లు ఇవ్వడం వంటివి కాకుండా సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తూ హారర్ ప్రియులను అలరిస్తున్నాయి.

ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ ఫ్యామిలీ హారర్ థ్రిల్లర్- ప్రతి గదిలో అంతుచిక్కని రహస్యాలు- ఎక్కడంటే?
ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ ఫ్యామిలీ హారర్ థ్రిల్లర్- ప్రతి గదిలో అంతుచిక్కని రహస్యాలు- ఎక్కడంటే?

మానసిక అంశాలు

అలాంటి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా సినిమానే డార్క్ జెయింట్. భయపెట్టే దెయ్యాలు, జంప్ స్కేర్స్ మాత్రమే కాకుండా కుటుంబంలో ఉండే స్వార్థం, గిల్ట్, దురాశ, పాత తరం చేసిన తప్పులు ఎలా వెంటాడతాయనే మానసిక అంశాలతో ఈ తమిళ చిత్రం డార్క్ జెయింట్‌ను తెరకెక్కించారు.

మరి ఇలాంటి డార్క్ జెయింట్ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ సైకలాజికల్ హారర్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు కేఎస్ కిషన్ దర్శకత్వం వహించారు. సీనియర్ హీరోయిన్ సోనియా అగర్వాల్ కీ రోల్ చేసింది. ఇదే ఏడాది జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఐఎమ్‌డీబీలో 6.2 రేటింగ్ దక్కించుకుంది.

శాపం వెనుక అసలు నిజాలు.. కథేంటంటే?

డార్క్ జెయింట్ కథ ఒక కుటుంబాన్ని తరతరాలుగా వెంటాడుతున్న శాపం చుట్టూ తిరుగుతుంది. ఎన్నో ఏళ్ల క్రితం ఆ ఫ్యామిలీలోని ఓ వ్యక్తి తన కోరికలు నెరవేర్చుకోవాలనే ఆశతో దైవ సహాయం కోసం ప్రయత్నిస్తాడు. అయితే అనుకోకుండా ఒక భయంకరమైన దుష్టశక్తిని మేల్కొలుపుతాడు.

మొదట అతనికి కోరుకున్నవి దక్కినట్లే కనిపించినా, ఆ శక్తి ప్రతి కోరికకు బదులుగా అమాయకుల ప్రాణాలు, నరబలులు కోరడం స్టార్ట్ చేస్తుంది. ఆ నిర్ణయం కారణంగా మొత్తం కుటుంబమే ఒక శాపంలో చిక్కుకుపోతుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత హీరో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడతాడు.

తలకిందులుగా మారే జీవితం

అప్పుల భారంఎక్కువ కావడంతో తన పూర్వీకుల పాత భవనం గురించి తెలుసుకుని, అక్కడ ఏదో విలువైన ఆస్తి దాగి ఉందని భావిస్తాడు. ఆ ఆశతో తన పూర్వీకుల ఇంటికి వెళ్తాడు. అయితే ఆ ఇంటిలో అడుగు పెట్టిన క్షణం నుంచి హీరో జీవితం తలకిందులు అవుతుంది.

ఆ ఇంట్లో ప్రతి గది ఒక రహస్యాన్ని దాచి పెట్టినట్లుగా ఉంటుంది. విచిత్రమైన శబ్దాలు, నీడలు, అర్థంకాని భయానక సంఘటనలు వరుసగా జరుగుతుంటాయి. మొదట ఇవన్నీ భ్రమలుగా భావించిన హీరో తర్వాత నిజంగానే ఏదో దుష్ట శక్తి తమ కుటుంబాన్ని గమనిస్తోందని కనిపెడతాడు. ఈ క్రమంలోనే తన కుటుంబానికి చెందిన పాత రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి.

పూర్వీకుల తప్పు

అదే సమయంలో తమ పూర్వీకులు చేసిన ఒక పెద్ద తప్పే ఈ శాపానికి కారణమని తెలుస్తుంది. దుష్టశక్తితో కుదుర్చుకున్న ఒప్పందం ఇంకా ముగిసిపోలేదని.. ఆ శాపం ఇప్పుడు కొత్త తరాన్ని బలి తీసుకోవడానికి సిద్ధమైందని తెలుసుకుంటాడు. ఇదే సమయంలో తమ కుటుంబ సభ్యులలోని అపరాధ భావం, స్వార్థం, దురాశ పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తాయి.

మరి చివరికి ఆ శాపాన్ని ఆ కుటుంబం ముగించగలిగిందా? దుష్టశక్తి కోరిన బలి ఏంటీ? అసలు కుటుంబాన్ని వెంటాడుతున్న రహస్యం ఎలా బయటపడింది? అనేదే మిగతా కథ. ఇలా సాగే కథను హారర్‌తో పాటు ఎమోషనల్ ఫ్యామిలీ అంశాలు యాడ్ చేసి మరి డైరెక్టర్ తెరకెక్కించారు.

డార్క్ జెయింట్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇలాంటి డార్క్ జెయింట్ ఓటీటీలో ఆకట్టుకుంటోంది. ఆహాలో డార్క్ జెయింట్ ఓటీటీ రిలీజ్ అయింది. ఆగస్ట్ 7 నుంచి ఆహాలో డార్క్ జెయింట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తమిళంతోపాటు తెలుగులో కూడా డార్క్ జెయింట్ ఓటీటీలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఫ్యామిలీ, సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో మంచి హారర్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ఆహా ఓటీటీలోని డార్క్ జెయింట్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More