అఖండ 2 సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ వాడిన వాహనాన్ని తాజాగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. XDrive అత్యాధునిక ఇంజిన్‌తో ఈ వెహికిల్‌ను నిర్మించగా ఎక్స్ స్టూడియోస్ దానికి అద్భుతమైన సినిమాటిక్ లుక్‌ను అందించింది.
మాస్ ఎనర్జీకి నిదర్శనంగా

పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుందని మేకర్స్ తెలిపారు. నందమూరి బాలకృష్ణ శక్తివంతమైన స్క్రీన్ ప్రజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు.
బోయపాటి శ్రీను కామెంట్స్
ఈ వెహికిల్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వెహికల్ పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు చూసిన ఏవీ వీడియోలో నా సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దాదాపుగా పది వెహికల్స్ ఉన్నాయి. అమర్ గారు అద్భుతంగా డిజైన్ చేస్తారు" అని అన్నారు.
రాత్రి పగలు కష్టపడి
"ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికిల్ రాత్రి పగలు కష్టపడి గొప్పగా డిజైన్ చేశారు. అందుకు ఆయనను అభినందించాలి. ఈ వెహికల్‌ని యాక్షన్‌లో ఎంత అద్భుతంగా వాడుకున్నామో అది మీరు థియేటర్స్‌లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. మెస్మరైజ్ అవుతారు. అది మీరు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు" అని బోయపాటి శ్రీను తెలిపారు.
పవర్ ఉన్న క్యారెక్టర్
"ఒక పవర్ ఉన్న క్యారెక్టర్ దిగి వస్తుంటే దానికి తగ్గ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ వెహికల్ కూడా అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మేము కోరుకున్నట్టుగా ఈ వెహికల్‌ని చాలా తక్కువ రోజుల్లోనే అద్భుతంగా డిజైన్ చేసి ఇచ్చిన అమర్‌కి ధన్యవాదాలు. ఈవెంట్‌ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు" దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు.
భారత దేశ ఆత్మ
{{/usCountry}}"ఒక పవర్ ఉన్న క్యారెక్టర్ దిగి వస్తుంటే దానికి తగ్గ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ వెహికల్ కూడా అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మేము కోరుకున్నట్టుగా ఈ వెహికల్‌ని చాలా తక్కువ రోజుల్లోనే అద్భుతంగా డిజైన్ చేసి ఇచ్చిన అమర్‌కి ధన్యవాదాలు. ఈవెంట్‌ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు" దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు.
భారత దేశ ఆత్మ
{{/usCountry}}"అఖండ 2 ది తాండవం డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. అభిమానులు అందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా భారత దేశ ఆత్మ. మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అందరికీ థాంక్యు వెరీ మచ్" అని తన స్పీచ్ ముగించారు అఖండ 2 డైరెక్టర్ బోయపాటి శ్రీను.
ఇది మా అదృష్టం
ఇదే ఈవెంట్‌లో అమర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి ధన్యవాదాలు. అఖండ2 లాంటి ప్రతిష్టాత్మక సినిమాకి పని చేయడం మా అదృష్టం. ఇందులో మీరు చూస్తున్న ఈ వెహికల్ స్క్రీన్ మీద మెస్మరైజ్ చేస్తుంది" అని అన్నారు.
ప్రతి విషయంలో
"డైరెక్టర్ బోయపాటి గారితో మాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది. అయిన ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ఈ వెహికల్‌ని ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ ప్రాజెక్ట్‌లో బాగం కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ చిత్రం మీ అందరినీ అలరిస్తుంది" అని అఖండ 2 వెహికిల్ డిజైన్ చేసిన అమర్ తెలిపారు.