...
...
Next Story

అఖండ 2 రిలీజ్‌పై ఈ రోజు రానున్న క్లారిటీ-ఈ వార‌మే థియేట‌ర్ల‌లోకి! కోర్టు విచార‌ణ‌పై ఉత్కంఠ‌

అఖండ 2 రిలీజ్ డేట్ పై కొనసాగుతున్న సస్పెన్స్ కు ఇవాళ ఎండ్ కార్డు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మూవీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందరూ కోర్టు విచారణ కోసం ఉత్కంఠతో ఉన్నారు.

Published on: Dec 9, 2025, 09:06:22 IST
Advertisement

నందమూరి బాల‌కృష్ణ‌ ఫ్యాన్స్ కు ఈ రోజు గుడ్ న్యూస్ అందే అవకాశముంది. అఖండ 2 రిలీజ్ డేేట్ పై ఇవాళ (డిసెంబర్ 9) ఒ క్లారిటీ రానుందని సమాచారం. ఈ చిత్రం రిలీజ్ డేట్ పై నెలకొన్న సస్పెన్స్ కు మంగళవారం మేకర్స్ ఎండ్ కార్డు వేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈరోస్ ఇంటర్నేషనల్ తో చర్చలు ముగిశాయని తెలిసింది.

అఖండ 2 రిలీజ్ డేట్

అఖండ 2 పోస్టర్ లో బాల‌కృష్ణ‌ (x/14ReelsPlus)
అఖండ 2 పోస్టర్ లో బాల‌కృష్ణ‌ (x/14ReelsPlus)

బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా అఖండ 2. ఇందులో మరోసారి అఖండగా బాల‌కృష్ణ‌ నట విశ్వరూపం చూపించారని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం రిలీజ్ డేట్ వాయిదా పడింది. అయితే కొత్త రిలీజ్ డేట్ పై మంగళవారం క్లారిటీ రాబోతుందని సమాచారం. అన్ని సమస్యలను నిర్మాతలైన 14 రీల్స్ ప్లస్ క్లియర్ చేసిందని తెలిసింది.

ఈరోస్ తో చర్చలు

ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో 14 రీల్స్ ప్లస్ ప్రొడ్యూసర్లు సోమవారం రాత్రి చర్చలు జరిపినట్లు తెలిసింది. దీంతో గొడవకు ఫుల్ స్టాప్ పడిందని అంటున్నారు. ఇవాళ మద్రాస్ హైకోర్టులో అఖండ 2 రిలీజ్ గురించి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోస్ తో సమస్యను పరిష్కరించుకున్నామని 14 రీల్స్ ప్లస్ కోర్టుకు తెలపబోతుందని సమాచారం. దీంతో మూవీ రిలీజ్ కు అనుమతి సంపాదిస్తారని టాక్.

ఈ వారంలోనే

అఖండ 2 సినిమాను డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎక్స్ లోనూ ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ కూడా డిసెంబర్ 12న అంటే ఈ శుక్రవారం మూవీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ రోజు కోర్టు విచారణను బట్టి సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. అయితే అఖండ 2ను మాత్రం ఇదే వారం థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. 11న ప్రీమియర్ షోలు వేస్తారని సమాచారం.

రిలీజ్ వాయిదా

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks