ఆ రోజే థియేటర్లలోకి అఖండ 2.. రిలీజ్ పై లేటెస్ట్ బజ్ ఇదే.. ఈ నెలలోనే!

నందమూరి బాలకృష్ణ అప్ కమింగ్ మూవీ అఖండ 2 రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ఇదే నెలలో రిలీజ్ చేయబోతున్నారన్నది లేటెస్ట్ బజ్. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. 

Published on: Dec 6, 2025, 17:57:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారీ అంచనాలతో థియేటర్లలోకి రావాల్సిన అఖండ 2 రిలీజ్ కొన్ని గంటల ముందే ఆగిపోయింది. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ ప్రొడ్యూసర్లు అనూహ్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన అఖండ 2 విడుదల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

అఖండ 2లో బాలకృష్ణ
అఖండ 2లో బాలకృష్ణ

అఖండ 2 రిలీజ్ డేట్

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం, డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కావాల్సింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ మూవీ రిలీజ్ కావడం లేదని గురువారం అర్ధరాత్రి చిత్ర నిర్మాతలు అనూహ్య ప్రకటన చేశారు. అయితే ఈ సినిమాను డిసెంబర్ లోనే థియేటర్లలోకిి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తారని టాక్. ఆ రోజు కచ్చితంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు తెలిపాయి.

ప్రొడ్యూసర్ల సారీ

అభిమానులు విడుదల తేదీ ఇంకెప్పుడూ అని అడుగుతుండటంతో రీసెంట్ గా అఖండ 2 ప్రొడ్యూసర్లు సారీ చెప్పారు. కానీ ఇంకా నిర్దిష్ట విడుదల తేదీని ప్రకటించలేదు. 14 రీల్స్ ప్లస్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ, వాయిదాకు నిర్దిష్ట కారణాలు తెలియజేసింది.

‘‘మేము అఖండ2 ను బిగ్ స్క్రీన్‌లపై తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేశాం. కానీ నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతాయి. దురదృష్టవశాత్తు ఇది అలాంటి సమయం. ఎంతో ఆసక్తితో సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రియులకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాం. అఖండ-2 ఎప్పుడు వచ్చినా తప్పక విజయం సాధిస్తుంది. త్వరలో కొత్త తేదీతో వస్తుంది’’ అని ఎక్స్ లో పేర్కొన్నారు.

కోర్టు కేసుతో

మద్రాసు హై కోర్టు స్టే విధించడంతో అఖండ 2 రిలీజ్ అగిపోయింది. అఖండ 2ను ప్రొడ్యూస్ చేసిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 11 సంవత్సరాలుగా వారికి చెల్లించాల్సిన రూ.28 కోట్లు ప్లస్ వడ్డీ మొత్తానికి సంబంధించిన పెండింగ్ ఆర్బిట్రేషన్ డబ్బుపై ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు అనుమతి ఇచ్చే వరకు అఖండ 2 విడుదలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అఖండ 2 గురించి

అఖండ 2: తాండవం 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. బాలకృష్ణతో పాటు ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఎస్ స్వరపరిచిన ఈ చిత్రానికి సంబంధించిన సౌండ్‌ట్రాక్ అభిమానుల నుండి సానుకూల స్పందన పొందింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More