బ్రేకింగ్.. బాలకృష్ణ ఫ్యాన్స్‌కు షాక్.. అఖండ 2 రిలీజ్ వాయిదా.. కొన్ని గంటల ముందు అనూహ్య నిర్ణయం.. ఇదే కారణం
నందమూరి బాలకృష్ణ అభిమానులకు గట్టి షాక్ తగిలింది. భారీ అంచనాలతో ఈ రోజు థియేటర్లలో రిలీజ్ కావాల్సిన అఖండ 2 వాయిదా పడింది. సినిమా విడుదలను వాయిదా వేస్తూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
డిసెంబర్ 5, శుక్రవారం.. నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న రోజు ఇది. కానీ ఈ అభిమానులకు గట్టి షాక్ తప్పలేదు. అఖండ 2 రిలీజ్ ను వాయిదా వేస్తూ విడుదలకు కొన్ని గంటల ముందు ప్రొడక్షన్ సంస్థ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సోసల్ మీడియాలో 14 రీల్స్ ప్లస్ పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది.

అఖండ 2 వాయిదా
సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కింది. మరోసారి ఈ సినిమాతో బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ రిపీట్ అయింది. ట్రైలర్, పాటలు ఈ మూవీపై హైప్ పెంచేశాయి. కానీ తీరా రిలీజ్ డేట్ వచ్చాక మూవీ విడుదలను వాయిదా వేశారు.
‘‘అనివార్య కారణాల వల్ల అఖండ 2ను షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేయలేకపోతున్నామని బరువెక్కిన హృదయంతో మీకు చెప్పేందుకు చింతిస్తున్నాం. ఇది మాకు నొప్పి కలిగించే సందర్భం. సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రతి అభిమాని నిరాశను మేం నిజంగా అర్థం చేసుకుంటున్నాం. త్వరలోనే సమస్యకు పరిష్కారం కనుక్కొంటాం. త్వరలోనే సానుకూల అప్ డేట్ ను పంచుకుంటాం’’ అని 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ అర్ధరాత్రి ట్వీట్ చేసింది.
ఇదే కారణం
అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా పడటం వెనుక ఓ కారణం ఉంది. గురువారం ఈ సినిమా ప్రీమియర్ షోలను రద్దు చేశారు. ఇప్పుడు విడుదలను వాయిదా వేశారు. ఈరోస్ ఇంటర్నేషనల్ కు 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ రూ.28 కోట్లకు పైగా బకాయి చెల్లించాల్సి ఉంది. 2019లో ఈ డబ్బును చెల్లించాలని మధ్యవర్తిత్వ తీర్పు వచ్చింది. కానీ 14 రీల్స్ ఆ డబ్బును చెల్లించలేదు.
కోర్టు తీర్పు
ఈ నేపథ్యంలో ఈరోస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్ సంస్థ బకాయిలు చెల్లించకుండా, 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి అనే కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేసి కొత్త సినిమా రిలీజ్ చేస్తుందని ఈరోస్ కోర్టుకు వెళ్లింది. తమ బకాయిలు వసూలు అయ్యేంతవరకూ సినిమా (అఖండ 2) రిలీజ్ ఆపాలని కోర్టును కోరింది. మద్రాస్ హై కోర్టు ఈరోస్ ఇంటర్నేషనల్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. రూ.28 కోట్లు చెల్లించేంతవరకూ అఖండ 2 రిలీజ్ పై స్టే విధించింది. అందుకే ఇప్పుడు అఖండ 2 విడుదల వాయిదా పడింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


