బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. వరుస పాటలతో మూవీ టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. తాజాగా మంగళవారం (నవంబర్ 18) జాజికాయ జాజికాయ అంటూ తమన్ కంపోజ్ చేసిన ఓ మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
జాజికాయ జాజికాయ సాంగ్ రిలీజ్

బాలకృష్ణ అఖండ 2 నుంచి ఈ మధ్యే వచ్చిన తాండవం సాంగ్ ఎలా ఉందో చూశారు కదా. అందులో బాలయ్య ఓ రకమైన విశ్వరూపం చూపించాడు. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా అదే మూవీ నుంచి జాజికాయ జాజికాయ అంటూ మరో పాట రిలీజైంది. ఇందులో బాలకృష్ణ, సంయుక్త మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.
ఈ పాటను కాసర్ల శ్యామ్ రాగా.. బ్రిజేష్ శాండిల్య, శ్రేయా ఘోషాల్ పాడారు. ఈ పాటను వైజాగ్ లోని జగదాంబ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేశారు. తొలి పాటను ముంబైలో రిలీజ్ చేయగా.. ఈ రెండో పాటను వైజాగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం.
అఖండ 2 గురించి..
2021లో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లోనే వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తోంది. సరిగ్గా నాలుగేళ్లకు ఈ సీక్వెల్ రిలీజ్ కానుండటం విశేషం. ఈ సినిమాలో సంయుక్త, హర్షాలీ మల్హోత్రా కూడా నటిస్తున్నారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ ఏడాది ఆగస్టులోనే మూవీ షూటింగ్ పూర్తియింది. అప్పటి నుంచీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అఖండ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా రెండు పాటలు రిలీజ్ చేయడం ద్వారా మూవీ టీమ్ మెల్లగా ప్రమోషన్లపై దృష్టి సారించనుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో మరో బ్లాక్బస్టర్ ఖాయమని అభిమానులు అంచనాతో ఉన్నారు.
{{/usCountry}}ఈ ఏడాది ఆగస్టులోనే మూవీ షూటింగ్ పూర్తియింది. అప్పటి నుంచీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అఖండ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా రెండు పాటలు రిలీజ్ చేయడం ద్వారా మూవీ టీమ్ మెల్లగా ప్రమోషన్లపై దృష్టి సారించనుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో మరో బ్లాక్బస్టర్ ఖాయమని అభిమానులు అంచనాతో ఉన్నారు.
{{/usCountry}}