OTT Trending: ఈ వారం ఓటీటీలో రచ్చ చేస్తున్న 5 సౌత్ క్రేజీ సినిమాలు.. డిఫరెంట్ జోనర్లు.. వీకెండ్ కు సరిపోయే కంటెంట్!
OTT Trending: వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ ప్రియులు కొత్త సినిమాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఆరా తీస్తుంటారు. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన సౌత్ ఇండియా టాప్ 5 క్రేజీ సినిమాల లిస్ట్ ఇక్కడుంది. ఇందులో డిఫరెంట్ జోనర్ మూవీస్ ఉన్నాయి. వెంటనే ఓ లుక్కేయండి.
OTT Trending: ఓటీటీ ప్రియులకు ఈ వారం అదిరే వినోదాల విందు రెడీ గా ఉంది. థియేటర్లలో సందడి చేసిన చిత్రాలతో పాటు నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగుపెట్టిన విభిన్న జోనర్ల సౌత్ సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న 5 సస్పెన్స్, యాక్షన్, రొమాంటిక్ చిత్రాలు డిజిటల్ వీక్షకుల హిట్ లిస్ట్‌లో నిలిచాయి.

లెనిన్ (Lenin)
అక్కినేని అఖిల్ హీరోగా విభిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘లెనిన్’. థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ స్పేస్‌లో భారీ అంచనాల మధ్య ఓటీటీలోకి అడుగుపెట్టింది. అఖిల్ సరికొత్త మాస్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన ఈ చిత్రం.. సామాజిక నేపథ్యం, యాక్షన్ డ్రామాతో సాగుతుంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదయం మురళి (Idhayam Murali)
తమిళ యంగ్ హీరో అథర్వ మురళి కథానాయకుడిగా నటించిన ‘ఇదయం మురళి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొండుతోంది. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, సస్పెన్స్ ఎలిమెంట్లతో కూడిన ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.
ఓ.. సుకుమారి
డిఫరెంగ్ స్టోరీ లైన్ తో వచ్చిన మూవీ ఇది. తాత రూ.80 కోట్ల ఆస్తి కోసం ఓ దామినిని యాదగిరి పెళ్లి చేసుకుంటాడు. కానీ దామినికి ఓ రేర్ కండీషన్ వల్ల ఇబ్బందకర పరిస్థితి ఏర్పడుతుంది. ఆమెను ఎవరు తాకినా కరెంట్ షాక్ కొడుతుంది. ఈ రొమాంటిక్ కామెడీ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది.
నూరు సామి
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామానే నూరు సామి. తెలుగులో ఇది వంద దేవుళ్లు పేరుతో థియేటర్లో రిలీజైంది. థియేటర్లో ఫర్వాలేదనిపించిన ఈ సినిమా ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తన తల్లి కలను నిజం చేసేందుకు కొడుకు ఏం చేశాడన్నది ఈ సినిమాలో ఎమోషనల్ గా చూపించారు.
ఉయిర్
మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. పాడుబడిన బావిలో దొరికిన ఓ మహిళ శవం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అసలు ఆ మహిళ ఎవరు? అనేది పోలీసులు విచారణ చేస్తుంటారు. ఈ క్రమంలో వెల్లడయ్యే విషయాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. తెలుగులోనూ ఈ సినిమా జియోహాట్ స్టార్ లో అదరగొడుతోంది.
బెస్ట్ ఆప్షన్
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కేవలం పెద్ద హీరోల సినిమాలే కాకుండా, కంటెంట్ ఓరియెంటెడ్ సౌత్ చిత్రాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అఖిల్ అక్కినేని ‘లెనిన్’, అథర్వ 'ఇదయం మురళి', రోషన్ ‘ఉయిర్’ ఓటీటీలో అదరగొట్టడమే ఇందుకు నిదర్శనం.
ముఖ్యంగా తమిళం, మలయాళం నుంచి తెలుగులోకి రీ-డబ్ అయి వస్తున్న ఇన్వెస్టిగేటివ్ అండ్ రొమాంటిక్ డ్రామాలు ఓటీటీ వాచ్‌టైమ్‌ను పెంచుతున్నాయి. వీకెండ్‌లో విభిన్న కంటెంట్ చూడాలనుకునే వారికి ఈ 5 సౌత్ సినిమాల క్యూరేటెడ్ లిస్ట్ బెస్ట్ ఆప్షన్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


