Lenin Jr NTR: 'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత సరైన కమ్‌బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న అక్కినేని అఖిల్ కు 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ తోడయ్యారు. చిత్తూరు పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా 'లెనిన్' జులై 10, 2026 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ భారీ యాక్షన్ సినిమాకు నందమూరి తారక్ తన బేస్ వాయిస్ తో నెరేషన్ ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సెన్సేషన్ గా మారింది.
ఆ టైగర్ పోస్టర్ వెనుక అసలు కథ

లెనిన్ మూవీ మేకర్స్ సోమవారం (జులై 6) రిలీజ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం టైటిల్ లోగో, ఒక భయంకరమైన పులి బొమ్మ మాత్రమే ఉన్న ఈ పోస్టర్ చూసి మొదట్లో ఫ్యాన్స్ కాస్త అయోమయానికి గురయ్యారు.
కానీ ఆ పులి మరెవరో కాదు కథను నెరేట్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని తెలియడంతో అక్కినేని, నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తారక్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో సినిమా ఓపెన్ అవ్వడం ఈ ప్రాజెక్ట్ కే మెయిన్ హైలైట్ కానుంది.
డైరెక్టర్ మురళీ కిషోర్ మార్క్ మేకింగ్
'వినరో భాగ్యము విష్ణు కథ' లాంటి డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చిన డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈసారి తన ట్రాక్ పూర్తిగా మార్చేశాడు. పూర్తి రా అండ్ రస్టిక్ ఆంధ్రా పాలిటిక్స్ ను స్క్రీన్ పై చూపించబోతున్నాడు.
ముఖ్యంగా అఖిల్ క్యారెక్టరైజేషన్, యాటిట్యూడ్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఇన్ సైడ్ టాక్. చిత్తూరు యాసలో అఖిల్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్, మైండ్ బ్లాంక్ అయ్యే యాక్షన్ స్టంట్స్ థియేటర్లలో మోత మోగించడం గ్యారెంటీ.
గ్లామర్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా
ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సెన్సేషనల్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తన గ్లామర్ తో పాటు ఒక సీరియస్ రోల్ లో ఆమె కనిపించబోతోందట. వీళ్లతో పాటు ప్రమోద్ పంజు, యాక్టర్ శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరీ రావు లాంటి సీనియర్ తారాగణం కీలకమైన సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.
{{/usCountry}}ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సెన్సేషనల్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తన గ్లామర్ తో పాటు ఒక సీరియస్ రోల్ లో ఆమె కనిపించబోతోందట. వీళ్లతో పాటు ప్రమోద్ పంజు, యాక్టర్ శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరీ రావు లాంటి సీనియర్ తారాగణం కీలకమైన సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.
{{/usCountry}}ఈ క్రేజీ ప్రాజెక్టును సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్స్ పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు ప్రాణం పోస్తుందని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జులై 10న అఖిల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.